PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/puvvada-ajay-kumarcfaa16b7-ff87-4516-91c6-32588ab98020-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/puvvada-ajay-kumarcfaa16b7-ff87-4516-91c6-32588ab98020-415x250-IndiaHerald.jpgగ‌త రెండు రోజుల క్రితం మంత్రి పువ్వాడ చేసిన ప్ర‌క‌ట‌న‌తో ఆ పార్టీలోని ప‌లువురు సీనియ‌ర్ల‌లో సంతోషం వ్య‌క్త‌మ‌వుతుంద‌ట‌. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డ‌క ముందునుంచే మేయ‌ర్ ప‌ద‌వికి ప‌లు పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. ముఖ్యంగా మంత్రి పువ్వాడ అజ‌య్ స‌తీమ‌ణి పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. నామినేష‌న్‌ల ప్ర‌క్రియ స‌మ‌యంలో ఆమె త‌ర‌పున నామినేష‌న్ దాఖ‌లైన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. Puvvada Ajay Kumar;kcr;kumaar;telangana rashtra samithi trs;minister;party;santoshamపువ్వాడ ప్ర‌క‌ట‌న‌తో సంతోషంలో సీనియ‌ర్లు..పువ్వాడ ప్ర‌క‌ట‌న‌తో సంతోషంలో సీనియ‌ర్లు..Puvvada Ajay Kumar;kcr;kumaar;telangana rashtra samithi trs;minister;party;santoshamWed, 21 Apr 2021 11:08:00 GMTఖ‌మ్మం కార్పొరేష‌న్‌పై పార్టీ జెండాను ఎగుర‌వేసేందుకు అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. ఇప్ప‌టికే నామినేష‌న్ల ప్ర‌క్రియ పూర్త‌యింది. అధికార తెరాస‌తో పాటు ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి అభ్య‌ర్థులు భారీగా నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. అధికార పార్టీ నుంచి పోటీదారులు అధికంగా ఉండ‌టంతో గెలుపు గుర్రాల‌కు బీఫాంలు ఇచ్చి మిగిలిన‌వారిని ప‌క్క‌కు త‌ప్పించేలా మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్‌లు మంత‌నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు మంత్రి సూచ‌న‌ల‌తో బ‌రిలో నుంచి వెన‌క్కు త‌గ్గుతుండ‌గా.. మ‌రికొంద‌రు ఇండిపెండెంట్‌గానైనా బ‌రిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఇదిలాఉంటే గ‌త రెండు రోజుల క్రితం మంత్రి పువ్వాడ చేసిన ప్ర‌క‌ట‌న‌తో ఆ పార్టీలోని ప‌లువురు సీనియ‌ర్ల‌లో సంతోషం వ్య‌క్త‌మ‌వుతుంద‌ట‌. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డ‌క ముందునుంచే మేయ‌ర్ ప‌ద‌వికి ప‌లు పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. ముఖ్యంగా మంత్రి పువ్వాడ అజ‌య్ స‌తీమ‌ణి పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. నామినేష‌న్‌ల ప్ర‌క్రియ స‌మ‌యంలో ఆమె త‌ర‌పున నామినేష‌న్ దాఖ‌లైన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. దీంతో పువ్వాడ స‌తీమ‌ణినే మేయ‌ర్ అభ్య‌ర్థి అంటూ తెరాస నేత‌లుసైతం పేర్కొన్నారు. ఈ వార్త సామాజిక మాధ్య‌మాలు, సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టింది. నామినేష‌న్ల దాఖ‌లు పూర్త‌యిన త‌రువాతిరోజు ఊహించ‌ని రీతిలో మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి నా స‌తీమ‌ణి ఎన్నిక‌ల బ‌రిలో లేద‌ని స్ప‌ష్టం చేశారు.

మంత్రి ప్ర‌క‌ట‌న‌తో అప్ప‌టి వ‌ర‌కు కొంత నిరాశ‌లో ఉన్న కార్పొరేష‌న్ ప‌రిధిలోని కొంద‌రు తెరాస నేతల్లో ఒక్క‌సారిగా సంతోషం వెల్లివిరిసింద‌ట‌. పువ్వాడ స‌తీమ‌ణి బ‌రిలో లేకుంటే మేయ‌ర్ అభ్య‌ర్థిగా తాము బ‌రిలో నిల‌వ‌వ‌చ్చ‌ని ప‌లువురు సీనియ‌ర్‌లు భావిస్తున్నారు. ఈ క్ర్ర‌మంలో ఒక‌వైపు ప్ర‌చారప‌ర్వంలో దూసుకెళ్తూనే.. రాష్ట్ర స్థాయిలో మంత్రి అజ‌య్‌కు, మంత్రి కేటీఆర్‌తో ద‌గ్గ‌రి సంబంధాలు ఉన్నవారి ద్వారా పైర‌వీలు చేసి మేయ‌ర్ ప‌ద‌విని ద‌క్కించుకొనేందుకు ప్ర‌య‌త్నాల‌నుసైతం మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఖ‌మ్మం కార్పొరేష‌న్ బాధ్య‌త‌ల‌ను మొత్తం అధిష్టానం పువ్వాడ‌కు అప్ప‌గించింది. సీఎం కేసీఆర్ ద్వారా సీల్డ్ క‌వ‌ర్‌లో మేయ‌ర్ పేరువ‌చ్చినా పువ్వాడ నిర్ణ‌యించిన పేరే అందులో ఉంటుంద‌నే వాద‌న వినిపిస్తుంది. కార్పొరేష‌న్‌లో తెరాస గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అన్న‌ట్లు క‌నిపిస్తుండ‌టంతో మ‌రి మేయ‌ర్ అభ్య‌ర్థిగా పువ్వాడ ఎవ‌రిని ఎంపిక‌చేస్తార‌నే అంశం ఆస‌క్తిక‌రంగా మారింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇదే జరిగితే జగన్ కు యూత్ దూరం...?

కరోనా ఈసారైనా అనుష్కను కనికరిస్తుందా...?

కని కరోనా : అంతా కలసి చేతులెత్తేస్తున్నారు...?

కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు...!

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ కౌంటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌

ఎన్నికలు రద్దు చేయండి.. బిజెపి అభ్యర్థి పిటిషన్ సంచలనం..?

మమత యూటర్న్.. బిజెపి మార్పు.. ప్రజల్లో పెరుగుతున్న భయం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>