PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus089fcaf7-55ee-4b8b-9a2b-84e0a1a11efc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus089fcaf7-55ee-4b8b-9a2b-84e0a1a11efc-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన పెంచుతున్నాయి. అదే విధంగా కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడంతో, మరింత భయం చుట్టుముడుతోంది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో అత్యవసర పడకలు దొరకట్లేదు. ఆక్సిజన్‌ అందుబాటులో లేక కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతోంది. CORONAVIRUS;cbn;amala akkineni;tiru;cinema;cinema theatre;central governmentకని "కరోనా" : మరో మూడు నెలలు జాగ్రత్త తప్పదు...లేదంటే అంతే...?కని "కరోనా" : మరో మూడు నెలలు జాగ్రత్త తప్పదు...లేదంటే అంతే...?CORONAVIRUS;cbn;amala akkineni;tiru;cinema;cinema theatre;central governmentWed, 21 Apr 2021 14:01:16 GMTదేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన పెంచుతున్నాయి. అదే విధంగా కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడంతో, మరింత భయం చుట్టుముడుతోంది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో అత్యవసర పడకలు దొరకట్లేదు. ఆక్సిజన్‌ అందుబాటులో లేక కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతోంది. అలాగే రెమిడెసివిర్‌ ఇంజెక్షన్ల డిమాండ్ పెరగడంతో... అందరికీ అందుబాటులో లేకుండా పోయింది. ఒకవేళ దొరికినా రూ.మూడున్నర వేల విలువచేసే ఇంజెక్షన్‌ బ్లాక్‌ మార్కెట్‌లో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌ లేక ప్రజలు మార్కెట్లకు, సినిమా హాల్స్ లకు, షాపింగ్ మాల్స్ కు, పార్కులకు విచ్చలవిడిగా తిరుగుతుండడంతో కరోనా కేసులు రెట్టింపు సంఖ్యలో నమోదవుతున్నాయి.

దీనికంతటికీ ప్రభుత్వమే కారణమని కొందరు తిట్టుకుంటున్నారు. థియేటర్లు తెరిచే ఉన్నాయి, బెల్ట్ షాపులు నిరంతరం అవుతున్నాయి, షాపింగ్ మాల్స్ కు అనుమతి ఇచ్చారు... లాక్ డౌన్ అమలు చేయడం లేదు అంటూ ఆరోపిస్తూ అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తిట్టిపోస్తున్నారు... అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... పోయినసారి లాక్ డౌన్ విధించినప్పుడు పేద ప్రజలు, మధ్య తరగతి ప్రజలు కరోనా కు మించిన కష్టాలు ఎదుర్కొన్నారు. ఇదంతా ఓ వైపు అయితే... రోడ్లపై వారి ఇష్టానుసారం, ఇతర ప్రదేశాలకు విచ్చలవిడిగా తిరిగే వాళ్లని కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ తిరగమని  చెప్పడం లేదు... మందుబాబులను బలవంతంగా వెళ్ళమని చెప్పడం లేదు.. ఇదంతా వారి స్వయంకృతాపరాధం అవుతుంది. కరోనా విజృంభణ దృష్టిలో ఉంచుకొని ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి, వారి ఆరోగ్యాన్ని వారే సమీక్షించుకోవాలి.

అలాగే ప్రభుత్వాలు కూడా తమ బాధ్యతను తాము నిర్వర్తిస్తున్నాయి. నిబంధనలు పెట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ లో వేగవంతం, డాక్టర్లని అందుబాటులో ఉంచడం.. ఇలాంటివి చేస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా వారి వారి కుటుంబాల పట్ల బాధ్యత కలిగి ఉండి జాగ్రత్త వహించాలి. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే... వ్యాక్సిన్ వేయించుకుంటే ఇక కరోనా రాదు అంటే పూర్తిగా కరెక్ట్ అని  ఆరోగ్యశాఖ చెప్పడం లేదు. మొదటి డోసు మరియు రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకునప్పటికీ కొందరికి కరోనా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక వ్యాక్సిన్ ఎందుకు అంటే... కరోనా వచ్చినప్పటికీ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగల రోగనిరోధక శక్తిని పెంచి, ప్రమాదం నుండి తప్పిస్తుంది. ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతున్నప్పటికీ... దేశంలోని ప్రజలందరికీ పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లు పూర్తిగా ఇవ్వడానికి... అలాగే కరోనా అదుపులోకి రావడానికి ఇంకో మూడు నెలల పాటు పడుతుందని అంచనా వేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి అప్పటిదాకా ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తించి, వ్యక్తిగత జాగ్రత్త తీసుకోవడం వల్ల కరోనా ఉధృతి పెరగకుండా మరో  మూడు నాలుగు నెలల్లో కరోనా అదుపులోకి వస్తుందంటున్నారు వైద్య శాస్త్రజ్ఞులు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని "కరోనా": వ్యాక్సిన్ వేసుకునే ముందు...ఆ తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలివే...?

పెద్దలకు ఫిర్యాదు చేసే ఆలోచనలో పవన్...?

వకీల్ సాబ్ సక్సెస్ తో ఎక్కువ మేలు ఎవరికి జరిగిందంటే ..... ??

కని " కరోనా " : జర్నలిస్టుల కోసం చిరు ఏం చేశాడో చూడండి..!

చంద్రబాబు పరిస్థితి రాకుండా జగన్ జాగ్రత్తలు

కరోనా ఈసారైనా అనుష్కను కనికరిస్తుందా...?

కని కరోనా : అంతా కలసి చేతులెత్తేస్తున్నారు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>