MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayyaa7bf9e08-5a14-442c-afe7-708715cbaf0e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayyaa7bf9e08-5a14-442c-afe7-708715cbaf0e-415x250-IndiaHerald.jpgనందమూరి బాలక్రిష్ణ శతాధిక చిత్రాల నటుడు. తండ్రి ఎన్టీయార్ మాదిరిగానే అన్ని జానర్లలో సినిమాలు చేసిన ఏకైక‌ నటుడు. పౌరాణికాలు చేయాలంటే ఎన్టీయార్ తరువాత బాలయ్యే అన్న పేరు తెచ్చుకున్నాడు. అలాగే జానపద సినిమా భైరవద్వీపం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఘనత కూడా బాలయ్యదే. balayya;ntr;balakrishna;b gopal;gouthami;cinema;blockbuster hit;director;vegetable market;success;nandamuri taraka rama rao;fatherవారికి బిగ్ షాక్ ఇచ్చిన బాలయ్య...?వారికి బిగ్ షాక్ ఇచ్చిన బాలయ్య...?balayya;ntr;balakrishna;b gopal;gouthami;cinema;blockbuster hit;director;vegetable market;success;nandamuri taraka rama rao;fatherWed, 21 Apr 2021 12:00:00 GMT
నందమూరి బాలక్రిష్ణ శతాధిక చిత్రాల నటుడు. తండ్రి ఎన్టీయార్ మాదిరిగానే అన్ని జానర్లలో సినిమాలు  చేసిన ఏకైక‌ నటుడు. పౌరాణికాలు చేయాలంటే ఎన్టీయార్ తరువాత బాలయ్యే అన్న పేరు తెచ్చుకున్నాడు. అలాగే జానపద సినిమా భైరవద్వీపం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఘనత కూడా బాలయ్యదే.

ఇక బాలయ్య కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆయన చేసిన ప్రయోగాలు కూడా జనాలను ఆకట్టుకున్నాయి. ఇక బాలయ్య తన కెరీర్ లో ఎపుడూ టాప్ డైరెక్టర్లతోనే వర్క్ చేయాలని షరతు  పెట్టుకోలేదు. మంచి కధతో తన వద్దకు వచ్చే వారిని ఆయన ప్రోత్సహించి సినిమాలు చేసేవారు. అయితే అలా చేసిన సినిమాలలో  కొన్ని ఫ్లాప్స్ కూడా అయ్యేవి. ఇక రీసెంట్ గా చూస్తే బాలయ్యకు గౌతమి పుత్ర శాతకర్ణి మూవీ తరువాత సరైన హిట్ పడలేదు. దానికి కారణం ఆయన తన వద్దకు వచ్చిన దర్శకులకు వరసగా  సినిమాలు చేసుకుంటూ పోవడమే.

కొందరు సీనియర్ డైరెక్టర్ల విషయంలో కూడా బాలయ్య నమ్మి చేసిన సినిమాలు ఫెయిల్ అయ్యాయి. ఒక దశలో బాలయ్య మార్కెట్ కే అది ప్రమాదంగా మారింది. దాంతో ఇపుడు బాలయ్య ఇపుడు కరెక్ట్ రూట్ పట్టాడు అంటున్నారు చేతిలో సక్సెస్ ఉన్న డైరెక్టర్ కే అవకాశాలు ఇవ్వాలని బాలయ్య తాజాగా డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. దీని వల్ల బాలయ్య హిట్ రేంజి కూడా బాగా పెరగడమే కాకుండా ప్రెజెంట్ ట్రెండ్ కి అనుగుణంగా ఆయన సినిమాలు కూడా ఉంటాయని ఫ్యాన్స్ అంటున్నారు.

బాలయ్య ఈ డెసిషన్ తీసుకోవడంతో ఆయనను నమ్ముకుని తరువాత సినిమాలు చేయాలని భావిస్తున్న సీనియర్ డైరెక్టర్లకు బిగ్ షాక్ తగిలింది అంటున్నారు.  బి గోపాల్, వీవీ వినాయాక్ వంటి వారితో బాలయ్యతరువాత  సినిమాలు ఉంటాయని ఆ మధ్యన ప్రచారం సాగింది. అయితే ఇపుడు వాటికి ఫుల్ స్టాప్ పడినట్లే అంటున్నారు. మొత్తానికి చూస్తే బాలయ్య తన కెరీర్ లో నే బెస్ట్ డెసిషన్ తీసుకున్నారు అని ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలోనూ ప్రశంసలు దక్కుతున్నాయట.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చంద్రబాబు పరిస్థితి రాకుండా జగన్ జాగ్రత్తలు

కరోనా ఈసారైనా అనుష్కను కనికరిస్తుందా...?

కని కరోనా : అంతా కలసి చేతులెత్తేస్తున్నారు...?

కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు...!

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ కౌంటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌

ఎన్నికలు రద్దు చేయండి.. బిజెపి అభ్యర్థి పిటిషన్ సంచలనం..?

మమత యూటర్న్.. బిజెపి మార్పు.. ప్రజల్లో పెరుగుతున్న భయం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>