SpiritualityChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/sri-rama-namami1b2a514c-c486-4f94-a7d0-a9d8c266c408-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/sri-rama-namami1b2a514c-c486-4f94-a7d0-a9d8c266c408-415x250-IndiaHerald.jpgమన తెలుగువారి పండుగలలో ఒక్కో పండుగకు ఒక్కో విశిష్టత ఉంటుంది. అలాగే ఆయా పండుగలకు చేసే పూజలు, పూజా విధానాలు ఇలా ప్రతి విషయంలోనూ విభిన్నత కనిపిస్తూ ఉంటుంది. మొన్నటికి మొన్న తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభం పండుగ అయిన ఉగాదిని ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆరోజున తెలుగు వారు అందరూ ఆది పచ్చడి తిని రోజు ప్రారంభిస్తారు. ఇక ఈ రోజు దేశం మొత్తం శ్రీరామ నవమి వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే శ్రీరామనవమి రోజు పానకం వడపప్పుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. పానకం వడపప్పు ని ప్రసాదం గా ఈ రోజు తింటూ ఉంటారు. అయితే sri rama namami;pooja hegde;tara;paanakam;adinarayanareddy;telugu;festival;aqua;ayurvedaశ్రీరామ నవమికి పానకం, వడపప్పు ఎందుకు ప్రసాదంగా పెడతారో తెలుసా ?శ్రీరామ నవమికి పానకం, వడపప్పు ఎందుకు ప్రసాదంగా పెడతారో తెలుసా ?sri rama namami;pooja hegde;tara;paanakam;adinarayanareddy;telugu;festival;aqua;ayurvedaWed, 21 Apr 2021 12:00:00 GMTమన తెలుగువారి పండుగలలో ఒక్కో పండుగకు ఒక్కో విశిష్టత ఉంటుంది. అలాగే ఆయా పండుగలకు చేసే పూజలు, పూజా విధానాలు ఇలా ప్రతి విషయంలోనూ విభిన్నత కనిపిస్తూ ఉంటుంది. మొన్నటికి మొన్న తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభం పండుగ అయిన ఉగాదిని ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆరోజున తెలుగు వారు అందరూ ఆది పచ్చడి తిని రోజు ప్రారంభిస్తారు. ఇక ఈ రోజు దేశం మొత్తం శ్రీరామ నవమి వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే శ్రీరామనవమి రోజు పానకం వడపప్పుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. పానకం వడపప్పు ని ప్రసాదం గా ఈ రోజు తింటూ ఉంటారు. అయితే దీని వెనుక కూడా కొన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. 

శరదృతువు, వసంత రుతువు యముడు కోరలు లాంటివి అని దేవీభాగవతం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే తీసుకునే ప్రసాదంలో కూడా ఆరోగ్య విలువలు ఉండేలా చూసుకుంటారు. పానకంలో ఉపయోగించే మిరియాలు, యాలకులు వసంత ఋతువులో వచ్చే గొంతు సంబంధిత అన్ని వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని ఇది ఒక రకంగా దివ్యౌషధంగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అదీకాక పానకం అనేది శ్రీరాముడి అంశకు మూలం అయిన మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. 

అలాగే వడపప్పు కోసం వాడే పెసరపప్పు శరీరంలో వేడి తగ్గించి చలువ చేస్తుంది. జీర్ణ శక్తిని అభివృద్ధి పరిచి దేహకాంతి పెంచుతోంది. అలాగే పెసరపప్పు జ్ఞానానికి ప్రతీకగా కూడా చెబుతారు. ఎండలు బాగా ముదిరి పోతున్న రోజుల్లోనే శ్రీరామ నవమి వస్తుంటుంది. ఆ ఎండలో ఎండ వేడి దెబ్బ కొట్టకుండా ఈ వడపప్పు కాపాడుతుంది. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది కాబట్టి బుధుడి అనుగ్రహంతో మేధో వికాసం కలుగుతుందని చెబుతుంటారు పెద్దలు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వారికి బిగ్ షాక్ ఇచ్చిన బాలయ్య...?

చంద్రబాబు పరిస్థితి రాకుండా జగన్ జాగ్రత్తలు

కరోనా ఈసారైనా అనుష్కను కనికరిస్తుందా...?

కని కరోనా : అంతా కలసి చేతులెత్తేస్తున్నారు...?

కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు...!

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ కౌంటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌

ఎన్నికలు రద్దు చేయండి.. బిజెపి అభ్యర్థి పిటిషన్ సంచలనం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>