PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusba0ef60e-b228-487f-8c1d-5dc86d552fb8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusba0ef60e-b228-487f-8c1d-5dc86d552fb8-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ ఓ వైపు వీర విహారం చేస్తోంది. దాన్ని తుఫాన్ అని కేంద్రమే అంటోంది. అంటే అంతకు మించి అని సామాన్యుడు అర్ధం చేసుకోవాలి. కరోనా వైరస్ పెద్ద అంగలేసుకుని దేశాన వీర విహారం చేస్తూంటే దాని నుంచి కాపాడుకోవాల్సిన ఆయుధం అయితే ప్రస్తుతం ఏదీ ఎవరి వద్దా కూడా లేదు అనే చెప్పాలి. coronavirus;mandula;population;vegetable market;central government;coronavirus;paruguకని కరోనా : అందరికీ వ్యాక్సిన్.. షాకింగ్ నిజాలు...?కని కరోనా : అందరికీ వ్యాక్సిన్.. షాకింగ్ నిజాలు...?coronavirus;mandula;population;vegetable market;central government;coronavirus;paruguWed, 21 Apr 2021 15:44:27 GMTకరోనా వైరస్ ఓ వైపు వీర విహారం చేస్తోంది. దాన్ని తుఫాన్ అని కేంద్రమే అంటోంది. అంటే అంతకు మించి అని సామాన్యుడు అర్ధం చేసుకోవాలి. కరోనా వైరస్ పెద్ద అంగలేసుకుని దేశాన వీర విహారం చేస్తూంటే దాని నుంచి కాపాడుకోవాల్సిన ఆయుధం అయితే ప్రస్తుతం ఏదీ ఎవరి వద్దా కూడా లేదు అనే చెప్పాలి.

నిజానికి వాక్సిన్లు వేసుకున్నా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇపుడు అందరూ వ్యాక్సిన్ల కోసం పరుగులు పెడుతున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా రాదు అని ఇప్పటికీ నమ్ముతున్నారు. దీంతో ఇపుడు వ్యాక్సిన్ల మీద వత్తిడి బాగా ఎక్కువ అవుతోంది. దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉంది. ప్రభుత్వ లెక్కన ప్రకారం చూసుకుంటే ఇప్పటి దాకా 13 కోట్ల మందికి కరోనా టీకాలు ఇచ్చారు. ఇందులో మొదటి డోస్ తీసుకున్న వారే ఎక్కువ.  రెండవ దశ   టీకాలు ఎంతమంది తీసుకోవాలో ఇంకా లెక్క ఏదీ లేదు.

ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్రం ఇపుడు రాష్ట్రాల  మీదనే బాధ్యత మోపింది. ఇక  మే 1 నుంచి 18 ఏళ్ళు నిండిన వారు అంతా కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చు అని   పచ్చ జెండా ఊపేసింది. అయితే ఇది ఉచితం కాదు, దాన్ని బహిరంగ మార్కెట్ లో కొనుగోలు చేసుకుని వేసుకోవాలి. ఇప్పటికే కరోనా  మందులు సరిపోక బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలు పలుకుతున్న పరిస్థితి. అలాంటిది కరోనా వ్యాక్సిన్ ని బహిరంగ మార్కెట్ లో అమ్మకానికి పెడితే జనాల  డిమాండ్ చూసుకుంటే దాని ధరలు ఎక్కడ ఉంటాయో ఎవరూ ఊహించడం కష్టం.

ఇక కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కూడా ఇక్కడ ముఖ్యం. ఎంత ఎక్కువగా చేసినా కూడా మొత్తం 130 కోట్ల మందికి రెండు డోసుల కరోనా కావాలంటే 260 కోట్ల డోసుల  ఉత్పత్తి అవసరం. అలా కనుక చూసుకుంటే అందరికీ వ్యాక్సినేషన్ కి  కచ్చితంగా రెండేళ్ల సుదీర్ఘ కాలం పడుతుంది అంటున్నారు. వీటన్నిటి కంటే ఉత్తమమైన మార్తం ఏంటి అంటే జనాలు ఎవరి మానాన వారు ఇళ్ళలో తలుపులు గడియ పెట్టుకుని కూచోవడమే. మొత్తానికి కరోనా వ్యాక్సిన్ కాదు కానీ షాకింగ్ నిజాలెన్నో ఉన్నాయని అంటున్నారు. ఇది పూర్తిగా కమర్షియల్ కలర్ తీసుకుంటే కనుక సామాన్యుడిని వ్యాక్సిన్ కూడా అందకుండా పోవడం ఖాయమే.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇష్క్ సినిమా ఇంకా డైరెక్ట్ ఓటిటి కేనా??

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!

కని "కరోనా":కరోనా కొత్త మ్యుటేషన్లను కూడా అడ్డుకోగల కొవాగ్జిన్‌: ఐసీఎంఆర్‌

కని కరోనా : అక్కడ కనుక కరోనా విస్తరిస్తే భారీ బ్లాస్టింగే ?

కని"కరోనా": కరోనా ఆస్పత్రులకు జగన్...?

'వకీల్ సాబ్' థియేటర్లకు మినహాయింపు ఎందుకు..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>