PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chevireddy-audio1ab3b14f-12d9-4ab4-9e58-e805d2d61539-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chevireddy-audio1ab3b14f-12d9-4ab4-9e58-e805d2d61539-415x250-IndiaHerald.jpgతిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్ల కలకలం ప్రకపంనలు సృష్టించిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేయించుకున్నారని ఆరోపించిన టీడీపీ నేతలు పలుచోట్ల దొంగఓటర్లను పట్టుకున్నామని హడావిడి చేశారు. జీవకోనలో బయట నుంచి వచ్చి ఓటేస్తోన్న కొంతమందిని టీడీపీ కార్యకర్తలు పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. ఈ విషయంపై ప్రధాన ఎన్నికల అధికారికి చంద్రబాబు లేఖ కూడా రాశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. బయట వ్యక్తులు చొరబడుతున్నారంటూ ఫొటో ఆధారాలతో లేఖ రాశారు. చంద్రగిరిchevireddy-audio;view;bhaskar;tiru;bharatiya janata party;baba bhaskar;smart phone;police;tirupati;bus;loksabha;mla;audio;husband;thief;letter;tdp;ycp;chandragiri;reddy;chevireddy bhaskarareddy;nagari;dongaతిరుపతిలో దొంగఓట్ల వ్యూహం చెవిరెడ్డిదేనా.. దొరికిపోయినట్టేనా..?తిరుపతిలో దొంగఓట్ల వ్యూహం చెవిరెడ్డిదేనా.. దొరికిపోయినట్టేనా..?chevireddy-audio;view;bhaskar;tiru;bharatiya janata party;baba bhaskar;smart phone;police;tirupati;bus;loksabha;mla;audio;husband;thief;letter;tdp;ycp;chandragiri;reddy;chevireddy bhaskarareddy;nagari;dongaWed, 21 Apr 2021 10:00:00 GMTతిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్ల కలకలం ప్రకపంనలు సృష్టించిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేయించుకున్నారని ఆరోపించిన టీడీపీ నేతలు పలుచోట్ల దొంగఓటర్లను పట్టుకున్నామని హడావిడి చేశారు. జీవకోనలో బయట నుంచి వచ్చి ఓటేస్తోన్న కొంతమందిని టీడీపీ కార్యకర్తలు పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. ఈ విషయంపై ప్రధాన ఎన్నికల అధికారికి చంద్రబాబు లేఖ కూడా  రాశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. బయట వ్యక్తులు చొరబడుతున్నారంటూ ఫొటో ఆధారాలతో లేఖ రాశారు. చంద్రగిరి, నగరి, తంబళ్లపల్లె, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో.. వేలాది మంది బయటి వ్యక్తులు ప్రవేశించారని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.

అయితే ఇప్పుడు వైసీపీకి దిమ్మతిరిగే ఓ ఆడియో బయటకు వచ్చింది.  పోలింగ్ సందర్భంగా ఇతర జిల్లాల నుంచి జనాలను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించినట్టుగా చెబుతున్న  వైసీపీ నేతల ఫోన్ కాల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చిప్ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరో వైసీపీ నేతతో దొంగ ఓటర్లను తరలించేందుకు బస్సులు ఏర్పాటు కోసం మాట్లాడినట్టుగా చెబుతున్న ఫోన్ కాల్ ఆడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. అయితే.. ఇది చెవిరెడ్డి మాట్లాడిందా? లేదా ఎవరైనా మార్ఫింగ్ చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. కానీ ఈ ఆడియో మాత్రం కలకలం సృష్టిస్తోంది.

ఆడియో ప్రకారం.. ప్రజలను తరలించేందుకు 7 బస్సులు కాదని.. 12 బస్సులు కావాలని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆడియోలో మాట్లాడినట్టుగా ఉంది.  ఒకరోజు ముందే దీనిపై ప్లాన్ చేయాలని ఆడియోలో  సూచించారు. అదే రోజు వాళ్లను రెడీ చేయవద్దని.. ముందురోజు వాళ్లను రెడీ చేయాలని సూచించారు. ఇప్పుడు ఈ ఆడియో ఆధారంగా వైసీపీ నేతలే పక్కా ప్లాన్ తో ఈ దొంగ ఓట్లు వేయించారని బీజేపీ, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆడియోలపై ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా మిగతా నేతలు ఇంతవరకు స్పందించలేదు. మరి ఇది నిజమైన ఆడియోనేనా .. కాదా అన్నది తేలాల్సి ఉంది. ఇదే నిజమైతే వైసీపీ అడ్డంగా దొరికిపోయినట్టే మరి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ సమయంలో అస్సలు టీకా తీసుకోవద్దు.. హెచ్చరిస్తున్న వైద్యులు..?

కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు...!

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ కౌంటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌

ఎన్నికలు రద్దు చేయండి.. బిజెపి అభ్యర్థి పిటిషన్ సంచలనం..?

మమత యూటర్న్.. బిజెపి మార్పు.. ప్రజల్లో పెరుగుతున్న భయం..?

మహేష్ చేసిన పొరపాటు పై శేఖర్ కమ్ముల కామెంట్స్ !

నాది అదే కులం.. తెగేసి చెప్పిన ఉపముఖ్యమంత్రి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>