EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/jagan0fadfbb2-4f29-46e5-b70a-e36effd38be0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/jagan0fadfbb2-4f29-46e5-b70a-e36effd38be0-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్‌తో కయ్యం పెట్టుకున్న మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు సంబంధించిన వార్తలు నిన్న మొన్నటి వరకూ ఎక్కడ చూసినా కనిపించేవి.. ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యారు. తన పదవీకాలం చివర్లో ఆయన నేరుగా జగన్‌తో ఢీ అన్నట్టుగా వ్యవహరించారు. సుప్రీంకోర్టుకు సైతం వెళ్లారు. ఒక దశలో నిమ్మగడ్డ జగన్ పై పైచేయి సాధించారు కూడా. అంతటి మొండి వ్యక్తిగా పేరున్న జగన్ సైతం ఏమీ చేయలేక.. చివరక నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ చెప్పినట్టు చేయాల్సి వచ్చింది. రాజ్యాంగ బద్ద పదవులకు ఉన్న శక్తి అలాంటిది. అయితే ఇప్పుడు మరో వ్యక్తి జగjagan;kumaar;rahul new;rahul;raj;k l rahul;jagan;andhra pradesh;devineni avinash;mp;court;y s vivekananda reddy;job;rahul sipligunj;letter;murder.;reddy;sara shrawan;shakti;ab venkateswararaoఈ ఏపీ అధికారి.. మరో నిమ్మగడ్డగా తయారవుతున్నారా..?ఈ ఏపీ అధికారి.. మరో నిమ్మగడ్డగా తయారవుతున్నారా..?jagan;kumaar;rahul new;rahul;raj;k l rahul;jagan;andhra pradesh;devineni avinash;mp;court;y s vivekananda reddy;job;rahul sipligunj;letter;murder.;reddy;sara shrawan;shakti;ab venkateswararaoWed, 21 Apr 2021 00:00:00 GMTఏపీ సీఎం జగన్‌తో కయ్యం పెట్టుకున్న మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు సంబంధించిన వార్తలు నిన్న మొన్నటి వరకూ ఎక్కడ చూసినా కనిపించేవి.. ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యారు. తన పదవీకాలం చివర్లో ఆయన నేరుగా జగన్‌తో ఢీ అన్నట్టుగా వ్యవహరించారు. సుప్రీంకోర్టుకు సైతం వెళ్లారు. ఒక దశలో నిమ్మగడ్డ జగన్ పై పైచేయి సాధించారు కూడా. అంతటి మొండి వ్యక్తిగా పేరున్న జగన్ సైతం ఏమీ చేయలేక.. చివరక నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ చెప్పినట్టు చేయాల్సి వచ్చింది. రాజ్యాంగ బద్ద పదవులకు ఉన్న శక్తి అలాంటిది.

అయితే ఇప్పుడు మరో వ్యక్తి జగన్ పాలిట నిమ్మగడ్డగా మారుతున్నారు. ఆయనే.. ఏపీ  మాజీ ఇంటెలెజెన్స్ ఛీప్ ఎబి వెంకటేశ్వరరావు. జగన్ అధికారంలోకి రాగానే.. ఈ మాజీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై అనేక కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి విదేశీ గూడచర్య పరికరాల కేసులో ఏబీవీ అవినీతికి పాల్పడ్డాడని కేసు పెట్టింది. దీనిపై విచారణ సాగుతోంది. ఈ విషయంలో ఏబీవీ సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. పరిస్థితి ఇలా ఉన్న సమయంలో.. ఏబీ వెంకటేశ్వరరావు ఇటీవల సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు దర్యాప్తుపై సీబీఐకి లేఖ రాశారు. వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నించారని లేఖలో ప్రస్తావించారు.


వివేకా హత్య తర్వాత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించేదాకా ఘటనాస్థలాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన బంధువులు తమ అధీనంలో ఉంచుకున్నారని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. అయితే ఇప్పుడు ఏబీవీ జగన్ కుటుంబ సభ్యులనే టార్గెట్ చేశారని.. అప్పట్లో వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి రాహుల్ శర్మపై ఎబి వెంకటేశ్వరరావు ఒత్తిడి తెచ్చారని, ఆ కేసులో జగన్ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టాలని ఆ ఒత్తిడి సారాంశమని పోలీసు శాఖ అధికార ప్రతినిధి పాల్ రాజ్ సంచలన విషయం వెల్లడించారు. బదిలీ అయ్యే వరకు వివేకానందరెడ్డి కేసు దర్యాప్తును ఏబీ వెంకటేశ్వరావునే పర్యవేక్షించారని తెలిపారు. మొత్తానికి ఇప్పుడు ఉద్యోగంలో ఉండి కూడా జగన్ పై వరుస ఆరోపణలు చేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు చూస్తే అచ్చం నిమ్మగడ్డను చూసినట్టే ఉంటుందంటున్నారు కొందరు విశ్లేషకులు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏంటి .... ఆ సూపర్ హిట్ మూవీ కి సీక్వెల్ తీయనున్న త్రివిక్రమ్ ....??

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>