MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nikeshpatel-14fb795a-029c-4303-b13f-ac4594beec6c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nikeshpatel-14fb795a-029c-4303-b13f-ac4594beec6c-415x250-IndiaHerald.jpgమన తెలుగు సినీ ఇండస్ట్రీలో సాధారణంగా హీరోయిన్లు , స్టార్ హీరోలతో వారి సినీ కెరియర్ ను మొదలు పెడితే, వరుస ఆఫర్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కొమరంపులి సినిమాతో, హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నికిషా పటేల్ కు మాత్రం అందం, అభినయం ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం వరించలేదు . కొమరం పులి సినిమా డిజాస్టర్ కావడంతో ఆ సినిమా తర్వాత ఈమెకు చిన్న సినిమాలలో మాత్రమే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి.. ఇక కొమరం పులి సినిమా డిజాస్టర్ అని పక్కన పెడితే ,ఈ సినిమా లో ఈమె అందానికి ప్రేక్షకులంతా మంత్రముNIKESHPATEL;pawan;abinaya;kalyan;wales;komaram bheem;cinema;telugu;tamil;kannada;tiger;heroine;sardar vallabhai patelఅన్నీ ఉన్నా అదృష్టం లేని హీరోయిన్ ఎవరో తెలుసా..?అన్నీ ఉన్నా అదృష్టం లేని హీరోయిన్ ఎవరో తెలుసా..?NIKESHPATEL;pawan;abinaya;kalyan;wales;komaram bheem;cinema;telugu;tamil;kannada;tiger;heroine;sardar vallabhai patelWed, 21 Apr 2021 18:02:47 GMT
మన తెలుగు సినీ ఇండస్ట్రీలో సాధారణంగా హీరోయిన్లు  , స్టార్ హీరోలతో వారి సినీ కెరియర్ ను మొదలు పెడితే, వరుస ఆఫర్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కొమరంపులి సినిమాతో, హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నికిషా పటేల్ కు మాత్రం అందం, అభినయం ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం వరించలేదు . కొమరం పులి సినిమా డిజాస్టర్ కావడంతో ఆ సినిమా తర్వాత ఈమెకు చిన్న సినిమాలలో మాత్రమే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి..

ఇక కొమరం పులి సినిమా డిజాస్టర్ అని పక్కన పెడితే ,ఈ సినిమా లో ఈమె అందానికి ప్రేక్షకులంతా మంత్రముగ్ధులు అయ్యారు అని చెప్పడంలో, ఎలాంటి సందేహం లేదు . అయితే ఈమె కన్నడ, తమిళ భాషలలోని సినిమాలలో నటించినా, ఆ ఇండస్ట్రీలలో నటించిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. తెలుగులో చివరగా అరకు రోడ్ అనే సినిమాలో నటించింది . 2016 వ సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది.  ప్రస్తుతం ఈ హీరోయిన్ బ్రిటన్ లోని రెగర్ మేనేజ్మెంట్ లో పనిచేస్తోందని సమాచారం .

అయితే వరుస డిజాస్టర్ లతో భారీగా నిరాశ చెందిన నికిషా, ఇప్పుడు మాత్రం తన వయసు పెరుగుతున్నకొద్దీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవాలన్న ఆశపడుతోంది. ఇక ఈ  హీరోయిన్ ఒక మంచి సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోందట.. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆక్టివ్ గా ఉండే నటీనటులలో నికిషా పటేల్ కూడా ఒకరు . ఈమె ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది . తన గ్లామరస్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానుల కోసం షేర్ చేస్తూ తన అందాలను ఆరబోస్తుంది ఈ ముద్దుగుమ్మ .


అంతే కాకుండా సినిమాలలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి నికిషా పటేల్ , ఇలాంటి హాట్ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్లు సమాచారం. 2006వ సంవత్సరంలో యూకేలో మిస్ వేల్స్ పోటీలలో  ఫైనల్ గా నిలిచారు. అప్పట్లో  సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందంటూ  ఈమె సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం కూడా తెలిసిందే.. అయితే ఏదిఏమైనప్పటికీ నికిషా పటేల్ సినీ ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ ను త్వరలో స్టార్ట్ చేసి, ఇప్పటికైనా పవన్ హీరోయిన్ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా ఎదిగింది ,అని అనిపించుకుంటుందో లేదో చూడాల్సిందే ..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!

కని కరోనా : ఏపీలోనూ నైట్ కర్ఫ్యూ....?

కని "కరోనా":కరోనా కొత్త మ్యుటేషన్లను కూడా అడ్డుకోగల కొవాగ్జిన్‌: ఐసీఎంఆర్‌

కని కరోనా : అక్కడ కనుక కరోనా విస్తరిస్తే భారీ బ్లాస్టింగే ?

కని"కరోనా": కరోనా ఆస్పత్రులకు జగన్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>