CookingSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/india-herald-cookingc6b73820-61c9-4b18-8c89-e7c8f0cf231d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/india-herald-cookingc6b73820-61c9-4b18-8c89-e7c8f0cf231d-415x250-IndiaHerald.jpgశ్రీరామ నవమి రోజున పానకం – వడపప్పును భక్తులకు ప్రసాదంగా అందిస్తారు.ఈ పండగ రోజున పానకం, వడపప్పును ప్రసాదంగా పెట్టడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నది. పానకం – వడపప్పును ప్రసాద రూపంలో సేవించడం వల్ల ఆరోగ్యం, ఆయుష్షుతో పాటు అలసట తీరుతుందని పండితుల అభిప్రాయం. ఈ రుతువులో వచ్చే గొంతువ్యాధులకు, పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని కలిగిస్తాయని, ఔషధంగా పని చేస్తాయని అంటారు. మరి శ్రీ రామ నవమి స్పెషల్ వంటకం అయిన పానకంను ఎలా తయారు చేయాలో చూద్దామా.. ! కావాల్సినవి: బెల్లం- 3 కప్పులు, మిరియIndia-herald-cooking;paanakam;mirchi;pepper powderపానకం, వడపప్పు తయారీ విధానం ఎలానో తెలుసుకోండి . !!పానకం, వడపప్పు తయారీ విధానం ఎలానో తెలుసుకోండి . !!India-herald-cooking;paanakam;mirchi;pepper powderWed, 21 Apr 2021 12:00:00 GMTశ్రీరామ నవమి రోజున పానకం – వడపప్పును భక్తులకు ప్రసాదంగా అందిస్తారు.ఈ పండగ రోజున పానకం, వడపప్పును ప్రసాదంగా పెట్టడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నది. పానకం – వడపప్పును ప్రసాద రూపంలో సేవించడం వల్ల ఆరోగ్యం, ఆయుష్షుతో పాటు అలసట తీరుతుందని పండితుల అభిప్రాయం. ఈ రుతువులో వచ్చే గొంతువ్యాధులకు, పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని కలిగిస్తాయని, ఔషధంగా పని చేస్తాయని అంటారు. మరి శ్రీ రామ నవమి స్పెషల్ వంటకం అయిన పానకంను ఎలా తయారు చేయాలో చూద్దామా.. !


కావాల్సిన పదార్థాలు :

బెల్లం- 3 కప్పులు,
మిరియాల పొడి- 3 టీ స్పూన్లు,
ఉప్పు- చిటికెడు,
శొంఠిపొడి- టీ స్పూన్‍,
నిమ్మరసం- 3 టీ స్పూన్లు,
యాలకుల పొడి- టీ స్పూన్‍,
నీరు- 9 కప్పులు.
పానకం తయారు చేసే విధానం:
ముందుగా ఒక గిన్నెలోకి  బెల్లాన్ని తీసుకుని మెత్తగా దంచి, నీళ్లలో కలపాలి. బెల్లం మొత్తం కరిగాక, పలుచని క్లాత్‍తో వడకట్టాలి. ఇందులో మిరియాల పొడి, శొంఠిపొడి, ఉప్పు, యాలకుల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అంతే పానకం తయారు అయిపోయినట్లే..

వడపప్పు తయారీకి కావలిసిన పదార్దాలు :

ఒక కప్పు పెసరపప్పు
ఒక పచ్చి మిర్చి
తగినంత ఉప్పు

తయారీ విధానం :

ముందుగా ఒక కప్పు పెసరపప్పును శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత 3 నుంచి 4 గంటల పాటు నీళ్లల్లో దానిని వేసి నానబెట్టాలి. ఇప్పుడు నీటిని పక్కకు తీసేసి పప్పుని ఒక గిన్నెలో వేసి దానిలో పచ్చి మిర్చి, ఉప్పు వేసి కలపాలి. అంతే వడపప్పు తయారైపోయింది.

పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలువ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక అయిన పెసరపప్పును ‘వడ’ పప్పు అంటారు. అంటే, మండుతున్న ఎండల్లో వడదెబ్బ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని దీనిని ‘వడపప్పు’ అంటారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వారికి బిగ్ షాక్ ఇచ్చిన బాలయ్య...?

చంద్రబాబు పరిస్థితి రాకుండా జగన్ జాగ్రత్తలు

కరోనా ఈసారైనా అనుష్కను కనికరిస్తుందా...?

కని కరోనా : అంతా కలసి చేతులెత్తేస్తున్నారు...?

కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు...!

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ కౌంటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌

ఎన్నికలు రద్దు చేయండి.. బిజెపి అభ్యర్థి పిటిషన్ సంచలనం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>