PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-viruse798156c-9b48-4ae4-8f97-21b1481e9331-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-viruse798156c-9b48-4ae4-8f97-21b1481e9331-415x250-IndiaHerald.jpgసాయమందించిన పోలీసుల‌పై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునేందుకు అక్క‌డి పోలీస్‌శాఖ ఉద్యుక్త‌మ‌వుతోంది. వీరి త‌ప్పు ఎంత‌వ‌ర‌కు ఉంది? అని తేల్చేందుకు ద‌ర్యాప్తున‌కు ఆదేశించింది. ఆక్సిజ‌న్ లేక శ్వాస‌తీసుకునేందుకు ఇబ్బంది ప‌డుతున్న క‌రోనా రోగుల‌కు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు సమ‌కూర్చి వారి ప్రాణాల‌ను కాపాడిన పోలీసులు ఇబ్బందుల్లో ప‌డ్డారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఉన్న‌తాధికారులు చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి సిద్ధ‌మయ్యారు. మ‌హారాష్ట్ర‌లోని నాగ‌పూర్ జిల్లాలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌కు సcorona virus;modi;tiru;district;police;letter;traffic police;local language;central governmentక‌ని "క‌రోనా": రోగుల‌ను కాపాడిన పోలీసుల‌పై చ‌ర్య‌లు!క‌ని "క‌రోనా": రోగుల‌ను కాపాడిన పోలీసుల‌పై చ‌ర్య‌లు!corona virus;modi;tiru;district;police;letter;traffic police;local language;central governmentWed, 21 Apr 2021 18:00:00 GMTసాయమందించిన పోలీసుల‌పై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునేందుకు అక్క‌డి పోలీస్‌శాఖ ఉద్యుక్త‌మ‌వుతోంది. వీరి త‌ప్పు ఎంత‌వ‌ర‌కు ఉంది? అని తేల్చేందుకు ద‌ర్యాప్తున‌కు ఆదేశించింది. ఆక్సిజ‌న్ లేక శ్వాస‌తీసుకునేందుకు ఇబ్బంది ప‌డుతున్న క‌రోనా రోగుల‌కు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు సమ‌కూర్చి వారి ప్రాణాల‌ను కాపాడిన పోలీసులు ఇబ్బందుల్లో ప‌డ్డారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఉన్న‌తాధికారులు చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి సిద్ధ‌మయ్యారు. మ‌హారాష్ట్ర‌లోని నాగ‌పూర్ జిల్లాలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం...

15 మంది రోగుల‌కు అత్య‌వ‌స‌రం
జరిపట్కాలోని తిరుపుడే హాస్పిటల్‌లో ఆక్సిజ‌న్ కొర‌త ఏర్ప‌డంతో ఆదివారం అర్థ‌రాత్రి  వెంటిలేష‌న్‌పై ఉన్న 15 మంది క‌రోనా రోగులు శ్వాస‌తీసుకోవ‌డంలో ఇబ్బంది పడ్డారు. ప్రాణాలు పోయే ప‌రిస్థితి ఏర్ప‌డటంతో అత్య‌వ‌స‌రంగా ప‌ది ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు అవ‌స‌ర‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ఆసుప‌త్రి సిబ్బంది అర్థ‌రాత్రి వేళ స్థానిక పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి డ్యూటీలో ఉన్న ఎస్ఐ మహాదేవ్ నాయక్‌వాడేకు ప‌రిస్థితి వివ‌రించి ఆయ‌న స‌హాయం కోరారు.

మాన‌వ‌త‌కు అర్థ‌మేది?
ఎస్ఐ నాయ‌క్‌వాడే త‌న సిబ్బందితో క‌లిసి ఆ ప్రాంతంలోని ఆక్సిజ‌న్ ప్లాంట్‌కు వెళ్లి సిలిండ‌ర్ల‌ను అత్య‌వ‌స‌రంగా స‌ర‌ఫ‌రా చేయాల‌ని ప్లాంట్‌ య‌జ‌మానిని కోరారు. అయితే జిల్లా యంత్రాంగం నుంచి అధికారికంగా లేఖ ఉంటేనే ఇస్తామ‌ని ఆ య‌జ‌మాని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ నాయ‌క్‌వాడే ప‌దే ప‌దే విన్న‌వించడంతోపాటు మాన‌వ‌తా దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించాల‌ని, ఆసుప‌త్రిలో ఉన్న రోగుల ప్రాణాలు కాపాడాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో ప్లాంట్ య‌జ‌మాని వాటిని ఇవ్వ‌డంతో 15 మందికి ప్రాణాపాయం త‌ప్పింది. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఆక్సిజ‌న్ ప్లాంట్ నుంచి ఆసుప‌త్రికి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను స‌మ‌కూర్చారంటూ ఎస్ఐతోపాటు  న‌లుగురు పోలీస్ సిబ్బందిపై ఉన్న‌తాధికారులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. మాన‌వ‌తా దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించిన‌వారిపై చ‌ర్య‌లు చేప‌డితే ఇక మాన‌వ‌త‌కు అర్థ‌మేముంటుంద‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా రెండోద‌శ‌లో 21 ల‌క్ష‌ల 57వేల యాక్టివ్ కేసులున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌శ్నించింది. ఇప్ప‌టికే సీబీఎస్ ఈ ప‌రీక్ష‌ల‌ను కూడా ర‌ద్దుచేసింది. జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ ప్ర‌ధాన‌మంత్రి మోడీ జాతినుద్దేశించి మాట్లాడారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అన్నీ ఉన్నా అదృష్టం లేని హీరోయిన్ ఎవరో తెలుసా..?

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!

కని కరోనా : ఏపీలోనూ నైట్ కర్ఫ్యూ....?

కని "కరోనా":కరోనా కొత్త మ్యుటేషన్లను కూడా అడ్డుకోగల కొవాగ్జిన్‌: ఐసీఎంఆర్‌

కని కరోనా : అక్కడ కనుక కరోనా విస్తరిస్తే భారీ బ్లాస్టింగే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>