EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chandeababu-corona-modi-parliament-speakder-ombirla-jagan-covid-1931a5cd96-4ec7-4eb2-9472-ec9873dcc6ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chandeababu-corona-modi-parliament-speakder-ombirla-jagan-covid-1931a5cd96-4ec7-4eb2-9472-ec9873dcc6ce-415x250-IndiaHerald.jpgచంద్రబాబు చెప్పినదేమంటే సెకెండ్ వేవ్ ను నియంత్రించటంలో జగన్ విఫలమయ్యారట. అత్యధిక కరోనా వైరస్ కేసులు నముదవుతున్న రాష్ట్రాల్లో ఏపి 5వ స్ధానంలో ఉందన్నారు. రాష్ట్రంలో పరిస్దితులు చాలా దయనీయంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటివరకు 9.5 లక్షలమంది వైరస్ బారినపడితే 7.5 వేల మంది చనిపోయారట. కరోనా నిబంధనల అమలులో రాష్ట్రం విఫలమైందన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రాకింగ్ విషయంలో కేంద్రమార్గదర్శకాలను రాష్ట్రం పట్టించుకోకపోవటం వల్లే రాష్ట్ర పరిస్దితి ఇంత ఘోరంగా తయారైందన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంchandeababu corona modi parliament speakder ombirla jagan covid 19;cbn;amala akkineni;delhi;bharatiya janata party;jagan;om birla;andhra pradesh;gujarat - gandhinagar;madhya pradesh - bhopal;maharashtra - mumbai;narendra modi;government;prime minister;assembly;uttar pradesh;maharashtra;central government;reddy;coronavirusహెరాల్డ్ ఎడిటోరియల్ : రాష్ట్రం పరువు తీసేసిన చంద్రన్నహెరాల్డ్ ఎడిటోరియల్ : రాష్ట్రం పరువు తీసేసిన చంద్రన్నchandeababu corona modi parliament speakder ombirla jagan covid 19;cbn;amala akkineni;delhi;bharatiya janata party;jagan;om birla;andhra pradesh;gujarat - gandhinagar;madhya pradesh - bhopal;maharashtra - mumbai;narendra modi;government;prime minister;assembly;uttar pradesh;maharashtra;central government;reddy;coronavirusWed, 21 Apr 2021 03:00:00 GMTజగన్మోహన్ రెడ్డి మీద కసి, కక్షతో  చంద్రబాబునాయుడు రాష్ట్రం పరువు తీసేశారు. కరోనా వైరస కట్టడిపై లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ఆధ్వర్యంలో దేశంలోని అసెంబ్లీ సభా నాయకులు, చట్టసభల అధ్యక్షులు, ప్రతిపక్షాల నేతలతో వర్చువల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు కూడా పాల్గొన్నారు. కరోనా వైరస్ తీవ్రత, నియంత్రణ అంశంపై చర్చలో చంద్రబాబు మాట్లాడుతు జగన్ పై తనలో పేరుకుపోతున్న కసినంతా వెళ్ళగక్కేశారు. అందరిముందు జగన్ను బద్నాం చేస్తున్నానని అనుకుంటునే రాష్ట్రం పరువు తీసేశారు. ఇంతాచేసి చంద్రబాబు చెప్పినదాంట్లో నిజాలేమైనా ఉన్నాయా అంటే అంతా ఆవు వ్యాసమే తప్ప కొత్తదేమీలేదు. వర్చువల్ మీటింగ్ ను చంద్రబాబు దేనికి ఉపయోగించుకున్నారయ్యా అంటే జగన్ పై బురద చల్లటానికి మాత్రమే అని అర్ధమైపోతోంది.




చంద్రబాబు చెప్పినదేమంటే సెకెండ్ వేవ్ ను నియంత్రించటంలో జగన్ విఫలమయ్యారట. అత్యధిక కరోనా వైరస్ కేసులు నముదవుతున్న రాష్ట్రాల్లో ఏపి 5వ స్ధానంలో ఉందన్నారు. రాష్ట్రంలో పరిస్దితులు చాలా దయనీయంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటివరకు 9.5 లక్షలమంది వైరస్ బారినపడితే 7.5 వేల మంది  చనిపోయారట. కరోనా నిబంధనల అమలులో రాష్ట్రం విఫలమైందన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రాకింగ్ విషయంలో కేంద్రమార్గదర్శకాలను రాష్ట్రం పట్టించుకోకపోవటం వల్లే రాష్ట్ర పరిస్దితి ఇంత ఘోరంగా తయారైందన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఓం బిర్లా ముందు రాష్ట్రాన్ని కించపరిచి, అవమానించటం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోడికి దగ్గరవుదామన్న ఆలోచనే కనబడుతోంది. ఇంత మాట్లాడిన చంద్రబాబు కరోనా నియంత్రణకు చేసిన సూచనలేదు, సలహాలేదు.




కేంద్రమార్గదర్శకాలను ఏపి పట్టించుకోకపోవటం వల్లే కేసులు పెరిగిపోవటమే నిజమని అనుకుందాం. మరి ఏపికన్నా కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మాటేమిటి ? కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలే కదా . చంద్రబాబు లెక్క ప్రకారం అవికూడా కేంద్ర మార్గదర్శకాలను పాటించనట్లే కదా. ఆ రాష్ట్రాల్లో కేసులు పెరగటానికి కూడా జగనే కారణమా ? దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉధృతి చాలా స్పీడుగా ఉంది. మరి దీని నియంత్రణలో నరేంద్రమోడి కూడా ఫెయిల్ అయినట్లే కదా. చంద్రబాబు మరచిపోయిన విషయం ఏమిటంటే కరోనా నియంత్రణలో ప్రభుత్వంతో పాటు జనాలకు కూడా బాధ్యతుంది. ప్రభుత్వం ఎన్నిచర్యలు తీసుకున్నా జనాలు లెక్కచేయకపోతే ఎవరు చేసేదేమీలేదు. వర్చువల్ మీటింగ్ లో పాల్గొనే అవకాశం దొరికింది కదాని జగన్ పరువు తీసేద్దామనే తొందరలో చంద్రబాబు రాష్ట్రపరువే తీసేశారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏంటి .... ఆ సూపర్ హిట్ మూవీ కి సీక్వెల్ తీయనున్న త్రివిక్రమ్ ....??

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>