PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcr650311e6-cfcc-495b-b283-0042ba19c30b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcr650311e6-cfcc-495b-b283-0042ba19c30b-415x250-IndiaHerald.jpgఈనెల 19న సీఎం కేసీఆర్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. అప్ప‌టి నుంచి ఆయ‌న ఫాం హౌస్‌లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే మంగ‌ళ‌వారం మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ క‌విత‌, ఎంపీ సంతోష్ కుమార్‌లు సీఎం కేసీఆర్‌ను ఫాంహౌస్ కు వెళ్లి క‌లిసిన‌ట్లు తెలిసింది.CM KCR;kcr;ktr;santhosh;telangana rashtra samithi trs;mp;smart phone;minister;yadadri;house;santhossh jagarlapudi;mantraనిల‌క‌డ‌గా కేసీఆర్ ఆరోగ్యం.. ఫాంహౌస్‌కు వెళ్లిన కొడుకు, కూతురునిల‌క‌డ‌గా కేసీఆర్ ఆరోగ్యం.. ఫాంహౌస్‌కు వెళ్లిన కొడుకు, కూతురుCM KCR;kcr;ktr;santhosh;telangana rashtra samithi trs;mp;smart phone;minister;yadadri;house;santhossh jagarlapudi;mantraWed, 21 Apr 2021 10:29:21 GMTరాష్ట్రంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుంది. రోజుకురోజుకు భారీగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. అనేక మంది ప్ర‌ముఖులు ఈ వైర‌స్ బారిన‌ప‌డి చికిత్స పొందుతున్నారు. సీఎం కేసీఆర్‌సైతంకు కొవిడ్ పాజిటివ్ రావ‌డంతో ఆయ‌న ఎర్ర‌వెల్లిలోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో హోం ఐసోలేష‌న్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే కోలుకుంటార‌ని పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని తెరాస శ్రేణులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు.అదేవిధంగా యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి దేవాల‌యంలో శ్రీ సుద‌ర్శ‌న నార‌సింహ హోమం నిర్వ‌హించారు. కేసీఆర్ గోత్రం, నామాల‌తో ప్ర‌త్యేక హోమాది పూజ‌లు నిర్వ‌హించారు.

మ‌రోవైపు సీఎం కేసీఆర్‌కు క‌రోనా పాజిటివ్ రావ‌టంతో ఆయ‌న యోగ‌క్షేమాల‌ను ప్ర‌ముఖులు ఫోన్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఇప్ప‌టికే శాస‌న స‌భాప‌తి పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డిల‌తో పాటు మంత్రులు, ఇత‌ర రంగాలకు చెందిన ప్ర‌ముఖులు కేసీఆర్‌కు ఫోన్‌చేసి ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీశారు. మ‌రికొంత మంది సామాజిక మాద్య‌మాల ద్వారా కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుతున్నారు. ఇదిలాఉంటే  ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు ఫోన్ ద్వారా కేసీఆర్‌కు స‌మాచారం అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప‌లు కీల‌క విష‌యాల‌పై కేసీఆర్‌ను ఫోన్‌ద్వారా సంప్ర‌దించి త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ఈనెల 19న సీఎం కేసీఆర్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. అప్ప‌టి నుంచి ఆయ‌న ఫాం హౌస్‌లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే మంగ‌ళ‌వారం మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ క‌విత‌, ఎంపీ సంతోష్ కుమార్‌లు సీఎం కేసీఆర్‌ను ఫాంహౌస్ కు వెళ్లి క‌లిసిన‌ట్లు తెలిసింది. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ.. సీఎం కేసీఆర్‌ను క‌లిసి ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించిన‌ట్లు స‌మాచారం. వైద్యుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో ప్ర‌స్తుతం క‌రోనా ఉధృతి, రాజ‌కీయ అంశాల‌పై కేసీఆర్‌తో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కొత్త అప్‌డేట్ ఇదే

కని కరోనా : అంతా కలసి చేతులెత్తేస్తున్నారు...?

కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు...!

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ కౌంటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌

ఎన్నికలు రద్దు చేయండి.. బిజెపి అభ్యర్థి పిటిషన్ సంచలనం..?

మమత యూటర్న్.. బిజెపి మార్పు.. ప్రజల్లో పెరుగుతున్న భయం..?

మహేష్ చేసిన పొరపాటు పై శేఖర్ కమ్ముల కామెంట్స్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>