MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-848bb692-56cf-4eb2-bcc2-93af06527eed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-848bb692-56cf-4eb2-bcc2-93af06527eed-415x250-IndiaHerald.jpgసెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ముల కు చాల మంచి పేరుంది. ‘ఆనంద్’ మూవీ నుండి ‘ఫిదా’ వరకు ఈ దర్శకుడుకి ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఈ దర్శకుడు టాప్ యంగ్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాన్ని పొందలేకపోయాడు. వాస్తవానికి గతంలో ఈయన మహేష్ రామ్ చరణ్ లతో సినిమా తీయాలని ప్రయత్నించి వారికి కథలు చెప్పడం కూడ జరిగింది.అయితే వారిద్దరూ శేఖర్ కమ్ములకు గౌరవాన్ని ఇచ్చారు కాని అతడు చెప్పిన కథలను అంగీకరించలేదు అన్న విషయం స్వయంగా శేఖర్ కమ్ముల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియ చేసాడు. ‘ఫిదా’ మూవీ కథmahesh;;mahesh;ram charan teja;anand malayalam actor;ram pothineni;sekhar;varun;varun sandesh;varun tej;kamma;cinema;media;interview;director;heroine;darsakudu;anand deverakonda;fidaaమహేష్ చేసిన పొరపాటు పై శేఖర్ కమ్ముల కామెంట్స్ !మహేష్ చేసిన పొరపాటు పై శేఖర్ కమ్ముల కామెంట్స్ !mahesh;;mahesh;ram charan teja;anand malayalam actor;ram pothineni;sekhar;varun;varun sandesh;varun tej;kamma;cinema;media;interview;director;heroine;darsakudu;anand deverakonda;fidaaWed, 21 Apr 2021 08:00:00 GMTసెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ముల కు చాల మంచి పేరుంది. ‘ఆనంద్’ మూవీ నుండి ‘ఫిదా’ వరకు ఈ దర్శకుడుకి ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఈ దర్శకుడు టాప్ యంగ్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాన్ని పొందలేకపోయాడు. వాస్తవానికి గతంలో ఈయన మహేష్ రామ్ చరణ్ లతో సినిమా తీయాలని ప్రయత్నించి వారికి కథలు చెప్పడం కూడ జరిగింది.


అయితే వారిద్దరూ శేఖర్ కమ్ములకు గౌరవాన్ని ఇచ్చారు కాని అతడు చెప్పిన కథలను అంగీకరించలేదు అన్న విషయం స్వయంగా శేఖర్ కమ్ముల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియ చేసాడు. ‘ఫిదా’ మూవీ కథను ముందుగా ఈ దర్శకుడు మహేష్ కు ఆతరువాత రామ్ చరణ్ కు వినిపించాడట. అయితే వారిద్దరూ ఆ కథ పట్ల ఆశక్తి కనపరచక పోవడంతో ఈమూవీని వరుణ్ తేజ్ తో చేయవలసి వచ్చిన విషయాన్ని ఈ దర్శకుడు ఆ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు.


వాస్తవానికి మహేష్ ‘ఫిదా’ మూవీలో నటించడానికి అంగీకరించి ఉంటే ఆ మూవీ మరింత రికార్డులను క్రియేట్ చేసి ఉండేదని ఆయన అభిప్రాయ పడుతున్నాడు. అయితే టాప్ హీరోలు హీరోయిన్ కు ప్రాధాన్యత ఉండే మూవీ కథలో నటించడానికి ఇష్టపడరు అన్న విషయం తనకు తెలుసు అని అందువల్లనే మహేష్ కు ఫిదా’ కథ నచ్చకపోయి ఉండవచ్చు అన్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు.


ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ తాను మంచి సినిమాలను బాగా తీయగలను కానీ టాప్ హీరోలకు నచ్చే విధంగా తన కథలను వారికి చెప్పి వారిని ఒప్పించే సమర్థత తనకు లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఈ దర్శకుడు అభిప్రాయంలో ‘ఫిదా’ కథ మహేష్ కు నచ్చుతుంది అన్న విషయం వాస్తవం అయినప్పటికీ వరుణ్ తేజ్ పాత్రలో మహేష్ నటిస్తే ప్రేక్షకులు ముఖ్యంగా అభిమానులు ఊరుకోరు అన్న విషయం దర్శకుడు శేఖర్ కమ్ములకు కూడ అర్థం అయి ఉంటుంది..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్నిక‌ల్లో దొంగ ఓట్లు వేసుకోవ‌చ్చు.. ఇబ్బందేమీ లేదు!: సీఈసీ?

మమత యూటర్న్.. బిజెపి మార్పు.. ప్రజల్లో పెరుగుతున్న భయం..?

నాది అదే కులం.. తెగేసి చెప్పిన ఉపముఖ్యమంత్రి..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తొందరలోనే బీజేపీ పగ్గాలు మారిపోతాయా ?

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>