MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-db82c373-9400-45e9-bd81-830d7a3d7b67-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-db82c373-9400-45e9-bd81-830d7a3d7b67-415x250-IndiaHerald.jpgవెండి తెరపైన రాముడు అయినా క్రిష్ణుడు అయినా ఒక్క ఎన్టీయారే. ఆయన్ని మాత్రమే జనాలు చూశారు, ఆరాధించారు. మరొకరు ఆ పాత్ర వేసినా కూడా జనాలకు ఎక్కేది కాదు. నిజానికి ఎన్టీయార్ మొదట సాంఘిక చిత్రాల ద్వారానే ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ntr;cbn;ntr;poorna;ramu;rani;sobhan babu;cinema;silver;lavakusa;shoban babuరాముడుగా ఎన్టీయార్ తో పాటు ఆ ఇద్దరూ రాణించారు...?రాముడుగా ఎన్టీయార్ తో పాటు ఆ ఇద్దరూ రాణించారు...?ntr;cbn;ntr;poorna;ramu;rani;sobhan babu;cinema;silver;lavakusa;shoban babuWed, 21 Apr 2021 11:00:00 GMTవెండి తెరపైన రాముడు అయినా క్రిష్ణుడు అయినా ఒక్క ఎన్టీయారే. ఆయన్ని మాత్రమే జనాలు చూశారు, ఆరాధించారు. మరొకరు ఆ పాత్ర వేసినా కూడా జనాలకు ఎక్కేది కాదు. నిజానికి ఎన్టీయార్ మొదట సాంఘిక చిత్రాల ద్వారానే ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

కానీ ఆయన పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచారు.లవకుశ సినిమా చూస్తే రాముడు అంటే ఎన్టీయారే అని అంతా భావించారంటే ఆ సుందర రూపం లో ఆయన ఒదిగిన తీరుని చూడాల్సిందే. ఇక నాడు లవకుశ ఆడిన  సినిమా హాళ్ళే రామాలయాలుగా మారిపోయాయి కూడా. ఆ తరువాత కూడా రాముడిగా అనేక సినిమాల్లో ఎన్టీయార్ నటించారు. తాను స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన శ్రీరామపట్టాభిషకం మూవీలో అటు రాముడిగా ఇటు రావణాసురుడిగా కూడా నటించి శభాష్ అనిపించుకున్నారు.

అయితే రాముడి పాత్రలకు పెట్టింది పేరు అయిన ఎన్టీయార్ తాను తొలిసారి దర్శకత్వం వహించి నిర్మించిన సీతారామ కళ్యాణం మూవీలో రాముడి పాత్రకు హరనాధ్ ని ఎంపిక చేశారు. అలా ఆయన నుదిట తిలకం దిద్ది మరీ ఆయన్ని లోకాభిరాముడిగా తీర్చి దిద్దారు. ఆ విధంగా రాముడిగా హరనాధ్ ఎంత బాగున్నాడో అన్న పేరు జనాల నుంచి బాగా తెచ్చుకుని చిరకీర్తిని ఆర్జించారు.

ఇక దర్శకుడు  బాపూకు రాముడు అంటే ఎంత భక్తో అందరికీ తెలిసిందే. ఆయన సంపూర్ణ రామాయణం మూవీని తీయాలనుకుని మొదట రామారావునే సంప్రదించారట. అయితే ఆయన కాల్షీట్లు అందుబాటులో లేకపోవడంతో శోభన్ బాబుని రాముడిగా పెట్టి ఆ సినిమా పూర్తి చేశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ విధంగా తెలుగు ప్రెక్షకులు శోభన్ బాబు ని కూడా రాముడిగా అంగీకరించి నీరాజనాలు అందించారు. ఇక ఎన్టీయార్ తనయుడు బాల‌క్రిష్ణ కూడా శ్రీరామరాజ్యంలో రాముడిగా నటించారు. ఎవరు రాముడిగా వేసినా కూడా ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులకు  రాముడు అంటే మాత్రం ఎన్టీయారే అని అంతా అంటారు.











Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇదే జరిగితే జగన్ కు యూత్ దూరం...?

కరోనా ఈసారైనా అనుష్కను కనికరిస్తుందా...?

కని కరోనా : అంతా కలసి చేతులెత్తేస్తున్నారు...?

కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు...!

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ కౌంటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌

ఎన్నికలు రద్దు చేయండి.. బిజెపి అభ్యర్థి పిటిషన్ సంచలనం..?

మమత యూటర్న్.. బిజెపి మార్పు.. ప్రజల్లో పెరుగుతున్న భయం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>