BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/shariram-nitham-yavanaga-undalanty-eam-chyalo-telusada39d963-78d9-47ca-8f3d-862df91af01d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/shariram-nitham-yavanaga-undalanty-eam-chyalo-telusada39d963-78d9-47ca-8f3d-862df91af01d-415x250-IndiaHerald.jpgసాధారణంగా అందం అంటే మనం వేసుకొనే ఫేస్ ప్యాక్, బ్యూటీ ఉత్పత్తుల లోనే కాదు, మనం తీసుకునే రోజు వారి ఆహార పదార్థాలలో కూడా అందం దాగి ఉంటుంది. అయితే ఈ అందం శరీరం లోపలి నుంచి రావాలి అంటే, అందుకు తగ్గట్టు సరైన పోషక పదార్థాలు కలిగిన ఆహారాలను తీసుకోవడం ఎంతో అవసరం. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించి, మీరు కూడా నిత్య యవ్వనంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి.. బిగుతైన చర్మానికి నీళ్లు ఎంతో ఆరోగ్యకరం. వీటికి మించిన మంచి ఔషధం వేరేది లేదు. డీహైడ్రేషన్ వల్ల చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో నష్టం జరుగుతుంNITYANAM YAVANAM;nithya new;apple;beans;oil;aqua;strawberry;oxygen;dehydration;avocadoశరీరం నిత్య యవ్వనంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?శరీరం నిత్య యవ్వనంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?NITYANAM YAVANAM;nithya new;apple;beans;oil;aqua;strawberry;oxygen;dehydration;avocadoWed, 21 Apr 2021 11:40:00 GMT
సాధారణంగా అందం అంటే మనం వేసుకొనే ఫేస్ ప్యాక్,  బ్యూటీ ఉత్పత్తుల లోనే కాదు, మనం తీసుకునే రోజు వారి ఆహార పదార్థాలలో కూడా అందం దాగి ఉంటుంది. అయితే ఈ అందం శరీరం లోపలి నుంచి రావాలి అంటే, అందుకు తగ్గట్టు సరైన పోషక పదార్థాలు కలిగిన ఆహారాలను తీసుకోవడం ఎంతో అవసరం. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించి, మీరు కూడా నిత్య యవ్వనంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి..


బిగుతైన చర్మానికి నీళ్లు ఎంతో ఆరోగ్యకరం. వీటికి మించిన మంచి ఔషధం వేరేది లేదు. డీహైడ్రేషన్ వల్ల చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో నష్టం జరుగుతుంది. కాబట్టి అలా జరగకూడదు అంటే, నీళ్లు తాగడం ఒక్కటే పరిష్కారం. రోజుకు కావలసిన నీళ్లు తాగడం వల్ల విషపదార్థాలు, మలినాలు బయటకు వెళ్లిపోతాయి. ఇక అంతేకాకుండా మొటిమలు, దురద వంటి చర్మ సమస్యలు కూడా రాకుండా ఉండటంతో పాటు చర్మాన్ని బిగుతుగా మార్చడంలో నీరు ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజు 8 లీటర్ల నీటిని తాగడం తప్పనిసరి..

మనం తీసుకుని ఆహారంలో ఒమేగా త్రీ ఉండేటట్టు చూసుకోవాలి . చర్మం ఎప్పుడూ యవ్వనంగా ఉండాలంటే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు తప్పనిసరిగా తీసుకోవాలి. మాంసాహారులు చేపల ద్వారా, శాఖాహారులు గింజలు, నట్స్ ద్వారా ఈ పోషకాలను పొందవచ్చు.. ఇక వీటితో పాటు ఆలివ్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, కోకొనట్ ఆయిల్ వంటి వాటిని వంటల్లో వాడినా కూడా చక్కటి ఫలితం ఉంటుంది.. సూర్యరశ్మి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు కారణంగా చర్మం పై టాన్ ఏర్పడకుండా, ఈ పోషకం అడ్డుకుంటుంది.. అంతే కాకుండా వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేస్తుంది..


చర్మ కణాలకు సరిపడా రక్తం, ఆక్సిజన్ అందినప్పుడే అవి ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా చర్మం లోపలి నుంచి మెరిసినప్పుడే, ఆ మెరుపు బయటకు కనిపిస్తుంది. అందుకు ఫైబర్ చక్కగా ఉపయోగపడుతుంది. అవకాడో, స్ట్రాబెర్రీ, ఆపిల్, అవిసె గింజలు, బీన్స్, క్యారెట్, బ్రోకలీ వంటి వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల చర్మం నవయవ్వనం గా మారడంతోపాటు మెరుపును సంతరించుకుంటుంది..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని "కరోనా": కరోనా చరిత్రలో సరికొత్త రికార్డ్..!!

చంద్రబాబు పరిస్థితి రాకుండా జగన్ జాగ్రత్తలు

కరోనా ఈసారైనా అనుష్కను కనికరిస్తుందా...?

కని కరోనా : అంతా కలసి చేతులెత్తేస్తున్నారు...?

కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు...!

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ కౌంటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌

ఎన్నికలు రద్దు చేయండి.. బిజెపి అభ్యర్థి పిటిషన్ సంచలనం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>