PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/polavaram-ycp-jagan-apcea003bc-246c-4d1d-8b5a-afc1a4146338-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/polavaram-ycp-jagan-apcea003bc-246c-4d1d-8b5a-afc1a4146338-415x250-IndiaHerald.jpg అధికారంలోకి వచ్చిన కొత్తలో పోలవరం ప్రాజెక్టులో అవినీతి ఏరులై పారుతోందంటూ ఆరోపించిన ఏపీ ప్ర‌భుత్వం ప్రాజెక్టు విషయంలో పారదర్శకత అనే మాటను అట‌కెక్కించింది. గ‌త ప్ర‌భుత్వంక‌న్నా ఎక్కువ ధ‌ర‌కు ప‌నులు చేయిస్తోంది. పూర్తి వివ‌రాలు వెల్ల‌డిచేయ‌డానికి ఇబ్బంది ఏమిట‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న క‌ర‌వు. అధిక చెల్లింపులకు అనుమతిస్తూ జలవనరుల శాఖ మరో ఎత్తిపోతలకు ప‌చ్చ‌జెండా ఊపింది. పోలవరం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీని వాడుకునేందుకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తారంట‌!. ఏమ‌న్నా అర్థ‌మpolavaram, ycp, jagan, ap;delhi;godavari river;krishna river;andhra pradesh;polavaram;west godavari;aqua;polavaram project;central government;chinthalapudi venkatramaiah;lieఢిల్లీ నుంచి దౌల‌తాబాద్‌కు.. దౌల‌తాబాద్ నుంచి ఢిల్లీకి!!ఢిల్లీ నుంచి దౌల‌తాబాద్‌కు.. దౌల‌తాబాద్ నుంచి ఢిల్లీకి!!polavaram, ycp, jagan, ap;delhi;godavari river;krishna river;andhra pradesh;polavaram;west godavari;aqua;polavaram project;central government;chinthalapudi venkatramaiah;lieWed, 21 Apr 2021 09:23:40 GMT
అధికారంలోకి వచ్చిన కొత్తలో పోలవరం ప్రాజెక్టులో అవినీతి ఏరులై పారుతోందంటూ ఆరోపించిన ఏపీ ప్ర‌భుత్వం ప్రాజెక్టు విషయంలో పారదర్శకత అనే మాటను అట‌కెక్కించింది. గ‌త ప్ర‌భుత్వంక‌న్నా ఎక్కువ ధ‌ర‌కు ప‌నులు చేయిస్తోంది. పూర్తి వివ‌రాలు వెల్ల‌డిచేయ‌డానికి ఇబ్బంది ఏమిట‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న క‌ర‌వు. అధిక చెల్లింపులకు అనుమతిస్తూ  జలవనరుల శాఖ మరో ఎత్తిపోతలకు ప‌చ్చ‌జెండా ఊపింది. పోలవరం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీని వాడుకునేందుకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తారంట‌!. ఏమ‌న్నా అర్థ‌ముందా ఇందులో?  మీకేమ‌న్నా అర్థ‌మ‌వుతోందా?

కొత్త ఎత్తిపోతల ప్రాజెక్టు ఎక్కడ కడతారు..?
నిజానికి పోలవరం నీటిని ఎత్తిపోయడానికి ఇప్పటికే పట్టిసీమ, పులిచింతల ప్రాజెక్టులున్నాయి. ఇప్పుడు ఇంకొక‌టి ఎక్కడ కడతార‌నేది అర్థం కాకుండా ఉంది. చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలు ఉండగా కొత్తగా పోలవరం డెడ్ స్టోరేజీ 38 మీటర్ల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు రూ.9132 కోట్ల ఖర్చుకు ప్రభుత్వం ప‌చ్చ‌జెండా ఊపింది. ఈ ఎత్తిపోతల నిర్మాణానికి హేతుబద్దత ఏమిటన్నది జలవనరులశాఖ నిపుణులకే అర్థం కాకుండా ఉంది.

ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని త‌గ్గించ‌నున్నారా?
డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తోడేయడమంటే పోలవరం సాగునీటి ప్రాజెక్టును 196 టీఎంసీల నీటి నిల్వ నుచి 25 టీఎంసీల నీటి నిల్వకు పరిమితం చేయడమేనని అనుమానిస్తున్నారు. డెడ్ స్టోరేజీ ద్వారా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగు నీరు అందించేందుకు ఈ ఎత్తిపోతల నిర్మాణమని ప్రభుత్వం చెబుతోంది. గతంలో ప్రచారం జరిగినట్లుగా పోలవరంను బ్యారేజీ స్థాయిలో ఉంచబోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలవరం ప్రధాన డ్యామ్‌ను పూర్తిచేసినా నీళ్లు నిల్వ చేయాలంటే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే నీళ్లు నిల్వ చేయడం కుద‌ర‌దు. ఇప్పుడు రూ.35వేల కోట్లుంటేకానీ అండ్ ఆర్ పూర్తికాదు. కేంద్రం ఇవ్వ‌నంటోంది.. రాష్ట్రం భ‌రించ‌డానికి సిద్ధంగా లేదు. మొత్తానికి ఒక ప‌థ‌కం ప్ర‌కారం పోల‌వ‌రం ప్రాజెక్టునే నిర్వీర్యం చేయ‌బోతున్నారంటూ ఆరోపిస్తోన్న ప్ర‌తిప‌క్షాల మాటే నిజ‌మ‌వుతోంద‌ని జ‌ల‌వ‌న‌రుల నిపుణులు అంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు...!

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ కౌంటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌

ఎన్నికలు రద్దు చేయండి.. బిజెపి అభ్యర్థి పిటిషన్ సంచలనం..?

మమత యూటర్న్.. బిజెపి మార్పు.. ప్రజల్లో పెరుగుతున్న భయం..?

మహేష్ చేసిన పొరపాటు పై శేఖర్ కమ్ముల కామెంట్స్ !

నాది అదే కులం.. తెగేసి చెప్పిన ఉపముఖ్యమంత్రి..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తొందరలోనే బీజేపీ పగ్గాలు మారిపోతాయా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>