BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hyderabadilaku-good-news-edadilo-uppal-chowrastha-ila5e454d48-1a33-4e09-af9a-ba23dd49979e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hyderabadilaku-good-news-edadilo-uppal-chowrastha-ila5e454d48-1a33-4e09-af9a-ba23dd49979e-415x250-IndiaHerald.jpgఇప్పుడిప్పుడే ఇబ్బందుల నుంచి బయటపడుతూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న సమయంలో మళ్లీ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం మెట్రో ప్రయాణాలకు కష్టంగా మారింది. అసలే ఏసీ ప్రయాణం కావడంతో ప్రయాణికులు మెట్రో ఎక్కాలంటేనే భయపడుతున్నారు. ప్రజల రక్షణకు అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని మెట్రో అధికారులు చెప్పిన .. ప్రజలు మాత్రం మెట్రో ప్రయానాలకు ఆశ చూపడం లేదు. గత ఏడాది విధించిన లాక్‌డౌన్‌తో దాదాపు ఏడు నెలల పాటు మెట్రో రైళ్లు మూతపడ్డా విషయం తెలిసిందే. metro;nithya new;hyderabad;2020;railఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం..నష్టాల్లో మెట్రో‌..!!ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం..నష్టాల్లో మెట్రో‌..!!metro;nithya new;hyderabad;2020;railTue, 20 Apr 2021 09:18:10 GMT
హైదరాబాద్‌ ప్రజారవాణా వ్యవస్థలో మెరుగైన మార్పులు తీసుకొచ్చిన మెట్రో రైల్‌ నష్టాల్లో నడుస్తోంది. హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలు ప్రారంభమయిన నాటి నుంచి లాక్ డౌన్ ముందు వరకు లాభసాటిగానే నడిచింది. ప్రతి నిత్యం వేలాది మందిని వారి వారి గమ్యస్థానాలకు చేర్చుతుంది. కానీ ఎప్పుడైతే కరోనా లాక్ డౌన్ మొదలయిందో అప్పటి నుంచి మెట్రో నష్టాల్లో కూరుకుపోయింది. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తరువాత రైల్లు ప్రారంభం అయినా ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండడంతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నష్టాల్లో కొనసాగుతుంది.

అసలే నష్టాల్లో నడుస్తున్న హైదరాబాద్‌ మెట్రోపై కొవిడ్‌ సెకండ్ వేవ్ పిడుగులా పడింది. ఇప్పుడిప్పుడే ఇబ్బందుల నుంచి బయటపడుతూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న సమయంలో మళ్లీ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం మెట్రో ప్రయాణాలకు కష్టంగా మారింది. అసలే ఏసీ ప్రయాణం కావడంతో ప్రయాణికులు మెట్రో ఎక్కాలంటేనే భయపడుతున్నారు. ప్రజల రక్షణకు అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని మెట్రో అధికారులు చెప్పిన .. ప్రజలు మాత్రం మెట్రో ప్రయానాలకు ఆశ చూపడం లేదు.

గత ఏడాది విధించిన లాక్‌డౌన్‌తో దాదాపు ఏడు నెలల పాటు మెట్రో రైళ్లు మూతపడ్డా విషయం తెలిసిందే. సెప్టెంబరులో తిరిగి ప్రారంభించినప్పటికి.. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తుండటంతో సగం మంది మాత్రమే మెట్రోలో ప్రయాణిస్తున్నారు. 2020-21లో వెయ్యికోట్ల ఆదాయం అంచనా వేయగా.. మూడింట ఒక వంతు ఆదాయం కూడా కష్టమైంది. దీంతో ఆపరేషన్స్‌ వ్యయం కూడా రావడం లేదని సంస్థ ఆందోళన చెందుతోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ కోసం మళ్లీ పాత ఫార్ములానే వాడుతున్న త్రివిక్రమ్.. బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..!!

ఈ రెండు లోపాలు స‌రిచేసుకుంటే చంద్ర‌బాబుకు తిరుగులేన‌ట్టే ?

ఇన్ని క‌ష్టాల్లోనూ చెక్కు చెద‌ర‌ని బాబు ఇమేజ్‌... ఇదే 2024 బ్ర‌హ్మాస్త్రం...!

తిరుప‌తిపై టీడీపీ, వైసీపీ బెట్టింగులు ఇలా...!

ఏపీలో అవినీతికి చెక్‌... ఆ సీఎంను ఫాలో అంటోన్న జ‌గ‌న్ ?

ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌కు వెళ్లొద్దు.. ప‌రిస్థితి ఎంత డేంజ‌ర్ అంటే...!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబును బాగా ఇరికించేసిన అచ్చెన్న



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>