PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-govt-corona3f3d060c-1ce9-4892-b03d-fa4e696fb22a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-govt-corona3f3d060c-1ce9-4892-b03d-fa4e696fb22a-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌గానే ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సంబంధించిన సంఘాల నేత‌లు కూడా మారారు. ఉద్యోగుల ప్ర‌యోజ‌నాల‌ను గాలికి వ‌దిలి ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం, మాట్లాడుతుండ‌టం చేస్తున్నారు. తెలంగాణ‌లో ఉద్యోగ సంఘాల నేత‌లు రాజ‌కీయాల్లోకి రావ‌డం.. మంత్రుల‌వ‌డంలాంటివ‌న్నీ చూసి తాము కూడా భ‌విష్య‌త్తులో అటువంటి ప‌ద‌వుల‌నుభ‌వించాల‌నే ఆలోచ‌న‌తో అధికార‌పార్టీకి కొమ్ముకాయ‌డం మొద‌లుపెట్టారు.ap govt,corona;andhra pradesh;high court;grama sachivalayam;amaravathi;mantraఉద్యోగ సంఘాల నేత‌లు అమ్ముడుబోయారా?ఉద్యోగ సంఘాల నేత‌లు అమ్ముడుబోయారా?ap govt,corona;andhra pradesh;high court;grama sachivalayam;amaravathi;mantraTue, 20 Apr 2021 13:48:49 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌గానే ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సంబంధించిన సంఘాల నేత‌లు కూడా మారారు. ఉద్యోగుల ప్ర‌యోజ‌నాల‌ను గాలికి వ‌దిలి ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం, మాట్లాడుతుండ‌టం చేస్తున్నారు. తెలంగాణ‌లో ఉద్యోగ సంఘాల నేత‌లు రాజ‌కీయాల్లోకి రావ‌డం.. మంత్రుల‌వ‌డంలాంటివ‌న్నీ చూసి తాము కూడా భ‌విష్య‌త్తులో అటువంటి ప‌ద‌వుల‌నుభ‌వించాల‌నే ఆలోచ‌న‌తో అధికార‌పార్టీకి కొమ్ముకాయ‌డం మొద‌లుపెట్టారు.

స‌చివాల‌యంలో మోగుతున్న మ‌ర‌ణ మృదంగం
ఆంధ్రప్రదేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి క‌రోనా వ‌ల‌యంలో చిక్క‌కుంది. స‌చివాల‌యంలో న‌లుగురు ఉద్యోగులు మ‌ర‌ణించారు. హైకోర్టులో ఇద్ద‌రు ఉద్యోగులు మృతిచెందారు. కార్యాల‌యాల‌కు రావాలంటేనే ప్ర‌భుత్వ ఉద్యోగులు హ‌డ‌లిపోతున్నారు. ఇంటిద‌గ్గ‌ర నుంచే ప‌నిచేస్తామ‌ని, అనుమ‌తివ్వ‌మంటూ ప్ర‌భుత్వాన్ని కోరారుకానీ ఎటువంటి స్పంద‌నా రాలేదు. దీంతో ఉద్యోగులంతా సంఘ నేత‌ల‌కు మొర‌పెట్టుకున్నారు. రాజ‌కీయ నేత‌ల్లామారిన ఈ ఉద్యోగ సంఘాల నేత‌లు కూడా వారిలాగే మాయ‌మాట‌లు చెప్పి కాలం నెట్టుకొస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేత‌లుగా వీరికి కార్యాల‌యానికి హాజ‌రుకాక‌పోయినా వేత‌నాలందే వెసులుబాటు ఉందికాబ‌ట్టి వీరంతా ఏదో ఒక సాకు చెప్పి ప‌ర్య‌ట‌న‌లు చేస్తుంటారు. కానీ రోజూ వ‌చ్చి విధులు నిర్వ‌హించే ఉద్యోగుల సంగ‌తి మాత్రం ప‌ట్టించుకున్న పాపాన పోవ‌డంలేదు.

ప్ర‌భుత్వ పెద్ద‌ల అపాయింట్‌మెంట్ దొర‌క‌డంలేదు?
ఏపీ సచివాలయంలో క‌రోనా మ‌ర‌ణ‌ మృదంగాన్ని మోగిస్తోంది. మూడు రోజుల వ్యవధిలో నలుగురు అధికారులు మ‌హ‌మ్మారికి బ‌ల‌య్యారు. యాభై శాతం మందితో పని చేసేలా అయినా ఉత్తర్వులివ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. ముఖ్య‌మంత్రిని క‌లిసి విన్న‌విద్దామంటే వారికి అపాయింట్‌మెంట్ దొర‌క‌డంలేదు. ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడి జ‌బ్బ‌లు చ‌రుచుకున్నవారిని ఇప్పుడు క‌నీసం ద‌గ్గ‌రికి కూడా రానివ్వ‌డంలేదు. అటు ఉద్యోగుల‌కు ఏం చెప్పాలో అర్థంకాక‌, మ‌రోవైపు త‌మ స్థితికి తాము ఏంచేయాలో తెలియ‌ని సందిగ్ధంలో ఉన్న ఉద్యోగ సంఘాల నేత‌ల్ని చూసి ఉద్యోగులంతా త‌మ‌లో తామే న‌వ్వుకుంటున్నారు. ఉద్యోగుల ప్రాణాల‌ప‌ట్ల ప్ర‌భుత్వం ఎంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుందో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు క‌న‌ప‌డుతున్నా సంఘాల నేత‌లుగా చేతులెత్తేసిన‌వారు భ‌విష్య‌త్తులో త‌మ‌కు ఏం ప్ర‌యోజ‌నాలు సాధించిపెడ‌తార‌ని వ్యాఖ్యానించుకుంటున్నారు. ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డం.. వారికి అమ్ముడుబోవడంలాంటివి ఇక‌నైనా మానుకుంటే మంచిదంటున్నారు.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: అగైన్ అటాక్ .. వాళ్లందరికి కరోనా పాజిటివ్..!!

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్... పవన్ కు కరోనా నెగటివ్...

ఈ లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతులు.. హెచ్చరించిన ఏపీ పోలీసులు..?

సీఎం జ‌గ‌న్‌తో కేవీపీ బావ‌మ‌రిది అశోక్‌ భేటీ.. ఇదే హాట్ టాపిక్ ?

తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ.. వీరికి మిన‌హాయింపు

వారికి అనుష్క షాక్ అప్పటి దాకా డేట్స్ ఇవ్వదట !

దర్శకుడు రమేష్ వర్మకు కరోనా పాజిటివ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>