MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-comedians67fcab33-8686-40ad-a20c-764bd3ff70a1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-comedians67fcab33-8686-40ad-a20c-764bd3ff70a1-415x250-IndiaHerald.jpgభారతదేశంలో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్న అంశం టెన్షన్ పెట్టిస్తోంది. మొదట్లో రోజుకు పది వేల నుంచి 25 వేల కేసులు నమోదవుతున్న ఇప్పుడు రెండు లక్షల నుంచి మూడు లక్షల కేసులు నమోదు అయ్యే పరిస్థితి ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి దారుణంగానే ఉంది. కరోనా వైరస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద కూడా తన ప్రతాపం చూపిస్తోంది ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకుంటే మరి కొన్ని సినిమా షూటింగ్ లో ఉన్నాయి. షూటింగులు కూడా అర్ధాంతరంగా ఆపివేసి వాయిదా వేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇకtollywood gossips;bhama;varsha;hyderabad;india;cinema;telugu;jabardasth;media;television;industry;comedy;instagram;coronavirusజబర్ధస్త్‌‌ లో కలకలం: ఆమెకు కరోనా పాజిటివ్ !జబర్ధస్త్‌‌ లో కలకలం: ఆమెకు కరోనా పాజిటివ్ !tollywood gossips;bhama;varsha;hyderabad;india;cinema;telugu;jabardasth;media;television;industry;comedy;instagram;coronavirusTue, 20 Apr 2021 14:00:00 GMTభారతదేశంలో  పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్న అంశం టెన్షన్ పెట్టిస్తోంది. మొదట్లో రోజుకు పది వేల నుంచి 25 వేల కేసులు నమోదవుతున్న ఇప్పుడు రెండు లక్షల నుంచి మూడు లక్షల కేసులు నమోదు అయ్యే పరిస్థితి ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి దారుణంగానే ఉంది. కరోనా వైరస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద కూడా తన ప్రతాపం చూపిస్తోంది ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకుంటే మరి కొన్ని సినిమా షూటింగ్ లో ఉన్నాయి. షూటింగులు కూడా అర్ధాంతరంగా ఆపివేసి వాయిదా వేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. 

ఇక ఈ వైరస్ తెలుగు టెలివిజన్ ను కూడా తాకినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగులో నెంబర్ వన్ కామెడీ షో గా వెలుగొందుతున్న జబర్దస్త్ లో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం ఇప్పుడు ఆ యూనిట్ లో అందరికీ టెన్షన్ గా మారింది. జబర్దస్త్ లో గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి టీం మెంబర్ గా మారిన వర్షకు ఇప్పుడు కరోనా వైరస్ పాజిటివ్ అని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఈ భామ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుందని సమాచారం అందుతోంది.

 ఇక తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఆమె ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. అందులో తనకు రెండు రోజులుగా ఆరోగ్యం బాగుండడం లేదని అందుకే కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని పేర్కొంది. హాస్పిటల్స్ పరిస్థితి అసలు ఏమీ బాగోలేదు అని డెడ్ బాడీ లను చుట్టేసి పడేస్తున్నారు అని అందుకే అందరూ జాగ్రత్తగా ఉండి మాస్కులు పెట్టుకుని శానిటైజర్ వాడాలని ఆమె సలహా ఇచ్చింది. ఇక జబర్దస్త్ లో వర్ష ఇమ్మానియేల్ జోడి బాగా కుదరడంతో జబర్దస్త్ తో పాటు మరికొన్ని కార్యక్రమాల్లో కూడా ఈ జోడిని చూపిస్తూ హైలైట్ చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో జబర్దస్త్ మాత్రమే కాక ఆమె పాల్గొన్న మిగిలిన కార్యక్రమాలు యూనిట్స్ కూడా ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాయి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

శుక్ర‌వారం నుంచి వీకెండ్ లాక్‌డౌన్

మళ్ళీ బాబు అదే బాటలో...?

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్... పవన్ కు కరోనా నెగటివ్...

ఈ లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతులు.. హెచ్చరించిన ఏపీ పోలీసులు..?

సీఎం జ‌గ‌న్‌తో కేవీపీ బావ‌మ‌రిది అశోక్‌ భేటీ.. ఇదే హాట్ టాపిక్ ?

తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ.. వీరికి మిన‌హాయింపు

వారికి అనుష్క షాక్ అప్పటి దాకా డేట్స్ ఇవ్వదట !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>