MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhjit5b96ca44-4a2b-4a7b-b25c-014eb1fbb770-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhjit5b96ca44-4a2b-4a7b-b25c-014eb1fbb770-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ మీద ఒక రకమైన యాంటీ సెంటిమెంట్ ముద్ర పడిపోతోంది. ఇప్పటికి నాలుగు సీజన్లు పూర్తి చేసుకుని ఫుల్ ఎంటర్టైమెంట్ గా ఆడియన్స్ ని అలరిస్తున్న బిగ్ బాస్ అందులో కంటెస్టెంట్లకు మాత్రం బ్రైట్ ఫ్యూచర్ ని ఇచ్చే విషయంలో ఎందుకో దోహదపడడంలేదన్న విమర్శలు అయితే ఉన్నాయి. abhjit;shiva;abhijith;monal gajjar;rahul new;rahul;shiva balaji;tara;k l rahul;cinema;bigboss;audience;lord siva;army;winner;rahul sipligunj;winner1బిగ్ బాస్ అభిజిత్ కూడా ఆ లిస్ట్ లో ?బిగ్ బాస్ అభిజిత్ కూడా ఆ లిస్ట్ లో ?abhjit;shiva;abhijith;monal gajjar;rahul new;rahul;shiva balaji;tara;k l rahul;cinema;bigboss;audience;lord siva;army;winner;rahul sipligunj;winner1Tue, 20 Apr 2021 20:30:00 GMT
బిగ్ బాస్ మీద ఒక రకమైన  యాంటీ సెంటిమెంట్ ముద్ర పడిపోతోంది. ఇప్పటికి నాలుగు సీజన్లు పూర్తి చేసుకుని ఫుల్ ఎంటర్టైమెంట్ గా ఆడియన్స్ ని అలరిస్తున్న  బిగ్ బాస్ అందులో కంటెస్టెంట్లకు  మాత్రం బ్రైట్ ఫ్యూచర్ ని ఇచ్చే విషయంలో ఎందుకో దోహదపడడంలేదన్న విమర్శలు అయితే ఉన్నాయి.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ వన్ నుంచి మొదలుపెడితే విన్నర్ గా అయిన వారెవరూ పెద్దగా బయట ఎలివేట్ కాలేకపోయారు అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ వన్ లో నటుడు శివ బాలాజి విన్నర్ గా నిలిచారు. అయితే ఆ తరువాత ఆ సినిమా కెరీర్ ఏమీ ఆశవహంగా సాగలేదు. ఆయనకు అంతకు ముందు ఉన్న చాన్సులు కూడా తరువాత తగ్గిపోయాయని కూడా చెబుతారు. ఇక రెండవ సీజన్ లో కౌశల్ గెలిచాడు. కౌశల్ ఆర్మీ పేరిట నాడు జరిగిన హడావుడి అంత ఐంతా కదు, అయినా కౌశల్ మాత్రం నేమ్ ఫేమ్ సంపాదించుకుని సినిమా చాన్సులు పెద్దగా పొందలేకపోయారు. ఆయన హీరోగా సినిమాలు తీస్తారని అని కూడా అంతా భావించారు. కానీ అవేమీ వర్కౌట్ కాలేదు.

ఇక సీజన్ త్రీ లో విన్నర్ రాహుల్ సింప్లిగంజ్ కూడా ఇదే తీరున  రేసులో వెనకబడ్డాడు. రాహుల్ సినిమా అవకాశాలు పెరిగి ఆయన మరింత ముందుకు సాగుతాడు అని అంతా ఊహించారు. కానీ రాహుల్ ఇంకా స్ట్రగుల్స్ తోనే ఉన్నారని అంటున్నారు. ఇపుడు సీజన్ ఫోర్ లో విన్నర్ గా ఉన్న అభిజిత్ హీరోగా నాలుగైదు సినిమాలు వస్తాయని అంతా గట్టిగానే ఊహించారు.  కానీ అభిజిత్ విన్నర్ అయి ఆరు నెలలు దగ్గర పడుతున్నా కూడా కొత్తగా అప్డేట్ ఏదీ లేదు అభిజిత్ కంటే రన్నర్ గా ఉన్న సోహెల్ ముందుకు సాగుతున్నాడు. ఒక సినిమాలో హీరోగా కూడా చేస్తున్నాడు. ఇక మోనాల్ గజ్జర్ దశ తిరిగి చిన్న తెర మీద సందడి చేస్తోంది. అలాగే మిగిలిన వారు కూడా తమ ఉనికి చాటుకుంటున్నారు. కానీ అభిజిత్ నుంచి కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఏదీ లేకుండా పోయింది అంటున్నారు. మరి ఆయన కూడ మిగిలిన వారి లిస్ట్ లోకి చేరిపోయాడా అన్న టాక్ అయితే ఉందిపుడు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?

మళ్ళీ బాబు అదే బాటలో...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>