EducationChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/jobs382f9024-686f-4a0d-b3c9-620faf112be5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/jobs382f9024-686f-4a0d-b3c9-620faf112be5-415x250-IndiaHerald.jpgఈరోజుల్లో డిగ్రీ చదవడం కామన్ అయ్యింది. డిగ్రీ ఏం ఖర్మ.. ఇంజినీరింగే రొటీన్ అయ్యింది. అయితే ఎంత చదివినా ఉద్యోగం దొరకడం మాత్రం చాలా కష్టసాధ్యంగా మారుతోంది. అందులోనూ ఇక ప్రభుత్వోద్యోగం అంటే.. విపరీతమైన పోటీ.. ఇక్కడే ఓ కీలక విషయం చాలా మంది మిస్ అవుతున్నారు. అందరూ పోటీ పడే ఉద్యోగాల వైపే చూస్తున్నారు తప్పించి.. మిగిలిన అవకాశాల వైపు చూడటం లేదు. మరి ఇంటర్‌తోనే ఉద్యోగ అవకాశం లభించడం అంటే మంచి అవకాశమే కదా. కేంద్ర ప్రభుత్వం ఏటా.. అనేక ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. అందులో కొన్ని పోస్టులు కేవలం పది, ఇంటర్ తjobs;scheduled caste;government;job;degree;central government;indianకేవలం ఇంటర్‌ తోనే.. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్.. అబ్బాయిలకు మాత్రమే..!కేవలం ఇంటర్‌ తోనే.. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్.. అబ్బాయిలకు మాత్రమే..!jobs;scheduled caste;government;job;degree;central government;indianTue, 20 Apr 2021 07:00:00 GMTఈరోజుల్లో డిగ్రీ చదవడం కామన్ అయ్యింది. డిగ్రీ ఏం ఖర్మ.. ఇంజినీరింగే రొటీన్ అయ్యింది. అయితే ఎంత చదివినా ఉద్యోగం దొరకడం మాత్రం చాలా కష్టసాధ్యంగా మారుతోంది. అందులోనూ ఇక ప్రభుత్వోద్యోగం అంటే.. విపరీతమైన పోటీ.. ఇక్కడే ఓ కీలక విషయం చాలా మంది మిస్ అవుతున్నారు. అందరూ పోటీ పడే ఉద్యోగాల వైపే చూస్తున్నారు తప్పించి.. మిగిలిన అవకాశాల వైపు చూడటం లేదు. మరి ఇంటర్‌తోనే ఉద్యోగ అవకాశం లభించడం అంటే మంచి అవకాశమే కదా.


కేంద్ర ప్రభుత్వం ఏటా.. అనేక ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. అందులో కొన్ని పోస్టులు కేవలం పది, ఇంటర్  తరగతి అర్హతతోనే భర్తీ చేస్తుంది.  అలాంటి ఓ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చేసింది. అదే ఇండియన్ నావీలో సెయిల‌ర్ విభాగంలో ఖాళీగా ఉన్న సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్‌ (ఎస్ఎస్ఆర్‌), ఆర్టిఫిస‌ర్ అప్రెంటిస్ (ఏఏ) పోస్టుల‌ భ‌ర్తీ నోటిఫికేషన్. ఈ పోస్టులకు ఎంపికైన వారికి ట్రైనింగ్‌ స‌మ‌యంలో ప్రతినెల‌ రూ.14,600 స్టయిఫండ్‌ ఇస్తారు.


అయితే ఈ ఉద్యోగాలు కేవలం పురుష అభ్యర్థులకు మాత్రమే అన్నది గమనించాలి. గ‌తేడాది 2700 పోస్టుల‌ను భ‌ర్తీ చేసింది. ఇప్పుడు కూడా ఇంతే స్థాయిలో పోస్టులు ఉండే అవకాశం ఉంది. ఇంకా పూర్తి నోటిఫికేషన్ రాలేదు. ఈనెల 26 నుంచి  ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అర్హత‌లు పరిశీలిస్తే..  60 మార్కుల‌తో ఇంట‌ర్ పాసై ఉండాలి. నిర్ణీత ప్రమాణాల ప్రకారం శ‌రీరధారుడ్యం క‌లిగి ఉండాలి. రాత‌ప‌రీక్ష, ఫిజిక‌ల్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్ట్‌ ద్వారా ఎంపిక ఉంటుంది. రాత‌ప‌రీక్ష 100 మార్కుల‌కు  ఉంటుంది. వంద ప్రశ్నలు గంటలో పూర్తి చేయాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంది. నాలుగు తప్పు ప్రశ్నలకు ఒక మార్కు పోతుంది. ఎస్సీ, ఎస్టీల‌కు దరఖాస్తు ఫీజు లేదు. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ఏప్రిల్ 30, 2021. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌:https://www.joinindiannavy.gov.in/ చూడొచ్చు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుప‌తిపై టీడీపీ, వైసీపీ బెట్టింగులు ఇలా...!

ఏపీలో అవినీతికి చెక్‌... ఆ సీఎంను ఫాలో అంటోన్న జ‌గ‌న్ ?

ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌కు వెళ్లొద్దు.. ప‌రిస్థితి ఎంత డేంజ‌ర్ అంటే...!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబును బాగా ఇరికించేసిన అచ్చెన్న

వాయిదా పడిన ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు షో..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈ అధికారి పదే పదే ఎందుకు కెలుక్కుంటున్నట్లు ?

జబర్దస్త్ 'బ్లాక్ అండ్ వైట్' జోడిని వదిలని ఈటీవీ.. ఇప్పుడు మరోసారి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>