PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-good-newsea6be2ef-b9b9-4b41-ab8e-45096c545ed1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-good-newsea6be2ef-b9b9-4b41-ab8e-45096c545ed1-415x250-IndiaHerald.jpgఏపి రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.. సరిగ్గా పంటలు పండక రైతులు అప్పులతో సతమతమవుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ అండగా నిలిచింది. ఎన్నికలకు ముందు సున్నా వడ్డీ రుణాలను ఇస్తామని చెప్పిన వాగ్దానాన్ని సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిలబెట్టుకున్నాడు. లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాది లోపు ఆ రుణం తిరిగి చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేస్తున్నారు. Ap cm good news;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;2019;bank;good news;nijam;good newwz;partyరైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు జమ..రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు జమ..Ap cm good news;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;2019;bank;good news;nijam;good newwz;partyTue, 20 Apr 2021 07:00:00 GMTఏపి రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.. సరిగ్గా పంటలు పండక రైతులు అప్పులతో సతమతమవుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ అండగా నిలిచింది. ఎన్నికలకు ముందు సున్నా వడ్డీ రుణాలను ఇస్తామని చెప్పిన వాగ్దానాన్ని సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిలబెట్టుకున్నాడు. లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాది లోపు ఆ రుణం తిరిగి చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేస్తున్నారు.


రైతులకు సీఎం జగన్ ఇప్పటివరకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేసింది. ఇప్పుడు రెండో ఏడాది కూడా.. అంటే 2019-20 రబీ సీజన్‌లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.128.47 కోట్లు చెల్లిస్తున్నారు. ఈ మేరకు జగన్ ఈ రోజు తన క్యాంప్ కార్యాలయంలో ఈ డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు.


కాగా, ఈ-క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేయాలని తొలుత నిర్ణయించారు. అయితే ఈ-క్రాప్‌లో 2,50,550 మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. మిగిలిన రైతులలో బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన వారందరికీ ఇప్పుడు సీఎం జగన్‌ ఉదారంగా ఈ పథకాన్ని వర్తింజేసి వడ్డీ రాయితీ చెల్లిస్తున్నారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ చెల్లింపుల కోసం సోమవారం ఆర్థికశాఖ నిధులు విడుదల చేయగా వ్యవసాయశాఖ పరిపాలన అనుమతి మంజూరు చేసింది. 2014-15 నుంచి 2018-19 వరకు పెట్టిన రూ.1,180 కోట్లు వడ్డీ లేని రుణాల బకాయిలను కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తోంది.


ఆ మేరకు ఇప్పటి వరకు అర్హులైన రైతులకు రూ.850.68 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం చెల్లించింది. సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 2019 ఖరీఫ్‌కి సంబంధించి 14.27 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.281.86 కోట్లు జమచేసింది.. వైఎస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు రూ.61,400 కోట్ల సాయాన్ని అందించింది. ఇది నిజంగానే రైతులకు సంతోషాన్ని కలిగించింది. సీఎం నిర్ణయానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుప‌తిపై టీడీపీ, వైసీపీ బెట్టింగులు ఇలా...!

ఏపీలో అవినీతికి చెక్‌... ఆ సీఎంను ఫాలో అంటోన్న జ‌గ‌న్ ?

ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌కు వెళ్లొద్దు.. ప‌రిస్థితి ఎంత డేంజ‌ర్ అంటే...!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబును బాగా ఇరికించేసిన అచ్చెన్న

వాయిదా పడిన ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు షో..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈ అధికారి పదే పదే ఎందుకు కెలుక్కుంటున్నట్లు ?

జబర్దస్త్ 'బ్లాక్ అండ్ వైట్' జోడిని వదిలని ఈటీవీ.. ఇప్పుడు మరోసారి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>