CrimeN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/affair-129dba7d-cffe-482a-9ca8-e34bc10cc990-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/affair-129dba7d-cffe-482a-9ca8-e34bc10cc990-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో రోజురోజుకు అక్రమ సంబంధాలు పెరుగుతూ ఉన్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా చాల మంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి కోణంలోనే మరో ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా ఉంటున్న భార్య.. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇక ఆమె తన కూతురితో సహా వచ్చేసి ప్రియుడితో సహజీవనం చేస్తోంది.affair;jeevitha rajaseskhar;police;wife;father;lieయువకుడితో తల్లి ఎఫైర్.. కూతురిపై కన్నేసిన ప్రబుద్ధుడు.. చివరకి..!యువకుడితో తల్లి ఎఫైర్.. కూతురిపై కన్నేసిన ప్రబుద్ధుడు.. చివరకి..!affair;jeevitha rajaseskhar;police;wife;father;lieTue, 20 Apr 2021 10:00:00 GMTనేటి సమాజంలో రోజురోజుకు అక్రమ సంబంధాలు పెరుగుతూ ఉన్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా చాల మంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి కోణంలోనే మరో ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా ఉంటున్న భార్య.. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇక ఆమె తన కూతురితో సహా వచ్చేసి ప్రియుడితో సహజీవనం చేస్తోంది. ఇక ఇంట్లో తల్లిలేని సమయంలో కూతురిపై నీచానికి పాల్పడుతున్నాడు. సవతి తండ్రి ఘాతుకంపై పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన పంజాబ్‌లో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..  సంగూర్ జిల్లాకు చెందిన మహిళకు 2000 సంవత్సరంలో వివాహమైంది. ఆమెకు భర్తతో మనస్పర్థలు తలెత్తడంతో నాలుగేళ్ల కిందట విడిపోయింది. తన 14 ఏళ్ల కూతురితో ఆమె విడిగా ఉంటోంది. ఈ తరుణంలో ఆమెకు తనకంటే వయసులో చిన్నవాడైన యువకుడు(27)తో పరిచయమై వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో సహజీవనం చేయడం మొదలుపెట్టారు. కూతురితో సహా కలిసే ఉంటున్నారు.

అయితే తల్లితో సహజీవనం చేస్తున్న ప్రబుద్ధుడి కన్ను కూతురిపై పడింది. ఇక ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఇక ఆమె కూతురు ఒంటరిగా దొరికితే లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. అతడు పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఇక అండగా ఉంటాడనుకున్న ప్రియుడే తన కూతురి జీవితం పాడు చేయడం చూసిన తల్లి నిర్ఘాంతపోయింది.

ఇక కూతురిపై అత్యాచారం చేసిన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదేంటని అడిగినందుకు తనను కూడా చావబాదాడని ఆమె ఫిర్యాదులో వెల్లడించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై అత్యాచారం, పోక్సో, నేరపూరిత కుట్ర తదితర కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పరేషాన్ అవ్వకండి.. అదంతా ఒట్టి ముచ్చటే.. క్లారిటీ ఇచ్చిన వైద్య శాఖ..?

టీడీపీలో ఈ మార్పులు వెరీ అర్జెంట్‌... అప్పుడు బాబుకు తిరుగు లేన‌ట్టే ?

ఈ రెండు లోపాలు స‌రిచేసుకుంటే చంద్ర‌బాబుకు తిరుగులేన‌ట్టే ?

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..‘ఆదిపురుష్’ అప్డేట్ వచ్చేసింది..

ఇన్ని క‌ష్టాల్లోనూ చెక్కు చెద‌ర‌ని బాబు ఇమేజ్‌... ఇదే 2024 బ్ర‌హ్మాస్త్రం...!

తిరుప‌తిపై టీడీపీ, వైసీపీ బెట్టింగులు ఇలా...!

ఏపీలో అవినీతికి చెక్‌... ఆ సీఎంను ఫాలో అంటోన్న జ‌గ‌న్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>