EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chandrababub3e753ab-43a1-4ec5-8b2e-9027f7e6dce2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chandrababub3e753ab-43a1-4ec5-8b2e-9027f7e6dce2-415x250-IndiaHerald.jpgచంద్రబాబు దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్.. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ.. రాజకీయాల్లో అన్ని రోజులు మనవి కావు.. చంద్రబాబుకు ప్రస్తుతం తన రాజకీయ జీవితంలోనే అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు.. తనతోనే తన పార్టీ తెలుగు దేశం అంతర్థానమవుతుందని గతంలో ఎన్టీఆర్ అనేవారని కొందరు చెబుతారు. కానీ..అలాంటి తెలుగు దేశం పార్టీని.. ఎన్టీఆర్ 1996లో మరణించిన తర్వాత కూడా సుదీర్ఘకాలం విజయవంతంగా నడిపించారు చంద్రబాబు. పాతికేళ్లుగా తెలుగు దేశాన్ని ఏకతాటిపై నడిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం, చంద్chandrababu;view;cbn;ntr;jeevitha rajaseskhar;tara;telugu;media;history;cheque;nandamuri taraka rama rao;parliament;partyఈ రాజకీయ 'చంద్రుడి'కి.. మళ్లీ పున్నమి ఉందా..?ఈ రాజకీయ 'చంద్రుడి'కి.. మళ్లీ పున్నమి ఉందా..?chandrababu;view;cbn;ntr;jeevitha rajaseskhar;tara;telugu;media;history;cheque;nandamuri taraka rama rao;parliament;partyTue, 20 Apr 2021 11:00:00 GMTచంద్రబాబు దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్.. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ.. రాజకీయాల్లో అన్ని రోజులు మనవి కావు.. చంద్రబాబుకు ప్రస్తుతం తన రాజకీయ జీవితంలోనే అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు.. తనతోనే తన పార్టీ తెలుగు దేశం అంతర్థానమవుతుందని గతంలో ఎన్టీఆర్ అనేవారని కొందరు చెబుతారు. కానీ..అలాంటి తెలుగు దేశం పార్టీని.. ఎన్టీఆర్ 1996లో మరణించిన తర్వాత కూడా సుదీర్ఘకాలం విజయవంతంగా నడిపించారు చంద్రబాబు. పాతికేళ్లుగా తెలుగు దేశాన్ని ఏకతాటిపై నడిపిస్తున్నారు.

అయితే ప్రస్తుతం తెలుగుదేశం, చంద్రబాబు అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఏపీలో ఓ వెలుగు వెలిగిన తెలుగు దేశం ఇప్పుడు తెలంగాణలో కనుమరుగై పోయింది. ఆంధ్రాలోనూ మిణుకుమిణుకు మంటోంది. ఒకనాడు పార్లమెంటులో అతి పెద్ద ప్రతిపక్షంగా నిలిచిన తెలుగు దేశం ఇప్పుడు కేవలం ముగ్గురు ఎంపీల స్థాయికి పడిపోయింది. మరి ఎన్నో విజయవంతమైన వ్యూహాలతో పార్టీని గట్టెక్కించిన చంద్రబాబు ఈ గడ్డు పరిస్థితి నుంచి పార్టీని బయటపడేస్తారా.. ఆయన కూడా కష్టాల నుంచి గట్టెక్కుతారా.. అన్నదే ఆసక్తికరం.

చంద్రబాబు మంచి రాజకీయ వ్యూహకర్త. అందులో అనుమానం లేదు. ఆ విషయాన్ని చరిత్ర ఎన్నోసార్లు రుజువు చేసింది. కానీ.. కాలం మారుతోంది. పరిస్థితులు మారుతున్నాయి. కాలంతో పాటు మారకపోతే ఎంతటి వారైనా అంతర్థానం కాక తప్పదు. చంద్రబాబు కూడా ఇందుకు మినహాయింపేమీ కారు. ఈ విషయం చంద్రబాబు గుర్తించాలి. కాలం చెల్లిన వ్యూహాలు ఇక పనికిరావు. రాజకీయం మారింది. మీడియా తీరు మారింది. చంద్రబాబు వ్యూహాలూ మారాలి.

పార్టీని భుజాన మోసిన వారిని చంద్రబాబు పట్టించుకోలేదన్న అపవాదు ఉంది. కార్పొరేట్‌ వ్యాపారులకు పార్టీలో అధిక ప్రాధాన్యమిచ్చారన్న అపవాదూ ఉంది. వీటికి చెక్ పెట్టాలి. అలాగే ఎలాగైనా లోకేశ్‌నే పార్టీకి అధినేతను చేయాలన్న పట్టుదల కూడా సడలించాలి. జనం సమస్యలను భుజానికి ఎత్తుకోవాలి. నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడాలి.. కష్టపడితే మళ్లీ చంద్రబాబుకు అధికారం కష్టమేమీ కాదు. అది గతంలోనూ రుజువైంది. కావాల్సింది వాస్తవాలను గుర్తెరిగి పోరాడటమే.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా తుఫాన్‌.. దేశంలో కొత్తగా ఇన్ని ల‌క్ష‌ల కేసులా... వామ్మో..!

వారికి అనుష్క షాక్ అప్పటి దాకా డేట్స్ ఇవ్వదట !

దర్శకుడు రమేష్ వర్మకు కరోనా పాజిటివ్..!

కరోనా బారినపడకుండా ఉండాలంటే రెండు మాస్కులు పెట్టాల్సిందే..!

బ్రేకింగ్:వైఎస్‌ షర్మిలకు కరోనా టెన్షన్.. ఆయనకు కొవిడ్ పాజిటివ్..!!

పరేషాన్ అవ్వకండి.. అదంతా ఒట్టి ముచ్చటే.. క్లారిటీ ఇచ్చిన వైద్య శాఖ..?

టీడీపీలో ఈ మార్పులు వెరీ అర్జెంట్‌... అప్పుడు బాబుకు తిరుగు లేన‌ట్టే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>