కేసీఆర్ భ‌జ‌న బ్యాచ్‌కి ఓ దండం‌

క‌రోనా సోక‌కుండా భౌతిక దూరం పాటించాలి నెత్తి నోరు కొట్టుకుంటూ చెప్పాడు సీఎం కేసీఆర్‌. కానీ ఆయ‌న మాట‌ల‌ను బేకాత‌ర్ చేస్తూ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఏకంగా య‌జ్ఞం చేసింది. ఈ య‌జ్ఞం ఏవ‌రి కోసం చేసిందో తెలిస్తే ఆశ్చ‌ర్య పోవాల్సిందే.

సోమ‌వారం తెలంగాణ సీఎంకి కరోనా పాజిటివ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల కోసం స‌భ పెట్టి… మూతికి మాస్క్ లేకుండా ప్ర‌స‌గించారు సీఎం. అయితే అక్క‌డి ఎమ్మెల్యే అభ్య‌ర్తితో పాటు సీఎంకి క‌రోనా పాజిటివ్ అని తేలింది. సోష‌ల్ మీడియా, ఇత‌ర మీడియాల ద్వారా భౌతిక దూరం పాటించి స‌రైన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని కోరుతున్నారు. ఇవ‌న్ని పెడ చెవిన పెట్టిన న‌గ‌ర డిప్యూటీ మేయ‌ర్ మోతే శ్రీల‌త సీఎం మొప్పు పొంద‌డానికి ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కరోణ బారి నుండి త్వరగా కోలుకోని రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో కెసిఆర్ ఆరోగ్యం కోసం యజ్ఞం చేశారు. దీంతో నెటిజ‌న్లు డిప్యూటీ మేయ‌ర్ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఈ భ‌జ‌న అవ‌స‌ర‌మా అని .

క‌రోనా వ‌ల్ల కొన్ని రాష్ట్రాలు లౌక్ డౌన్ పెట్ట‌డం, ఇక్క‌డ తెలంగాణ ప్ర‌భుత్వం నైట్ క‌ర్య్ఫూ పెడుతుంటే ఇవ‌న్ని ఏం ఆలోచించ‌కుండా సీఎం కేసీఆర్ దృష్టి ఆక‌ర్షించాల‌ని ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేయ‌డంతో ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నారు.