MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya48501c27-8bf3-4dd1-b7f5-3bb881efd246-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya48501c27-8bf3-4dd1-b7f5-3bb881efd246-415x250-IndiaHerald.jpgనటసింహం నందమూరి బాలయ్య సినిమా వస్తుంది అంటే అటు ఆయన అభిమానులతో పాటు ఇటు ఆడియన్స్ లో కూడా దానిపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొంటాయి. అయితే ఇటీవల కెరీర్ పరంగా వరుసగా పరాజయాలతో కొంత సతమతమవుతున్న బాలయ్య గతంలో తనకు సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందించిన మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శీను దర్శకత్వంలో తాజాగా చేస్తున్న సినిమా అఖండ. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి దీన్ని ఎంతో భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిరbalayya;mahesh;balakrishna;gopichand;anil music;anil ravipudi;boyapati srinu;geetha;pragya jaiswal;thaman s;tollywood;cinema;sangeetha;rajani kanth;producer;audience;blockbuster hit;producer1;heroine;success;yuva;mythri movie makers;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;simha;yashasvi jaiswal;massఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??balayya;mahesh;balakrishna;gopichand;anil music;anil ravipudi;boyapati srinu;geetha;pragya jaiswal;thaman s;tollywood;cinema;sangeetha;rajani kanth;producer;audience;blockbuster hit;producer1;heroine;success;yuva;mythri movie makers;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;simha;yashasvi jaiswal;massTue, 20 Apr 2021 16:00:00 GMTనటసింహం నందమూరి బాలయ్య సినిమా వస్తుంది అంటే అటు ఆయన అభిమానులతో పాటు ఇటు ఆడియన్స్ లో కూడా దానిపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొంటాయి. అయితే ఇటీవల కెరీర్ పరంగా వరుసగా పరాజయాలతో కొంత సతమతమవుతున్న బాలయ్య గతంలో తనకు సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందించిన మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శీను దర్శకత్వంలో తాజాగా చేస్తున్న సినిమా అఖండ. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి దీన్ని ఎంతో భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

బాలయ్య ఈ సినిమాలో ఒక మధ్యతరగతి రైతుగా అలానే అఘోరగా రెండు రకాల విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు టీజర్లకు ప్రేక్షకాభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునేలా అలానే తమ కాంబోలో హ్యాట్రిక్ హిట్ కొట్టేలా దర్శకుడు బోయపాటి ఈ సినిమాని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. కాగా ఈ సినిమా మే 28న విడుదల కానుంది. అయితే దీని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలయ్య నటించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ లెవల్లో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి అతి త్వరలో అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ రెండు సినిమాల తరువాత ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలయ్య ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. రెండు రోజుల క్రితం బాలయ్యని ప్రత్యేకంగా కలిసిన దర్శకుడు అనిల్ రావిపూడి ఆయనకి ఒక అద్భుతమైన స్టోరీ లైన్ వినిపించారని అలాగే అది ఎంతో నచ్చిన బాలయ్య పూర్తి స్క్రిప్టు సిద్ధం చేయండి వీలైనంత త్వరలో సినిమా చేద్దాం అంటూ మాట ఇచ్చారని అంటున్నారు. ఒక బడా నిర్మాణ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించి అతి త్వరలో అఫీషియల్ స్టేట్మెంట్ కూడా బయటకు రానుందట. మరి ఇదే గనుక నిజమైతే మొత్తంగా బాలయ్య నుంచి మూడు బ్లాక్ బస్టర్ సక్సెస్ లు ఖాయమని అంటున్నారు ఆయన అభిమానులు.....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనా ప్ర‌ళ‌య గ‌ర్జ‌న‌

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?

మళ్ళీ బాబు అదే బాటలో...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>