PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjuna-sagar-hot-spot0755ede1-4ac1-42fb-b119-2ae655d5ae6e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjuna-sagar-hot-spot0755ede1-4ac1-42fb-b119-2ae655d5ae6e-415x250-IndiaHerald.jpgసోమవారం నియోజకవర్గం పరిధిలో 161 పాజిటివ్ కేసులు నమోదు కాగా... మంగళవారం ఆ సంఖ్య మరింత పెరిగింది. నియోజకవర్గ పరిధిలోని పీహెచ్సీలలో చేసిన రాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో మంగళవారం ఒక్కరోజే 250 మందికి కరోనా నిర్దారణ అయింది. nagarjuna sagar hot spot;kcr;nagarjuna akkineni;ravi anchor;sridhar;tiru;vedhika;bharatiya janata party;telangana rashtra samithi trs;nagarjuna sagar dam;district;nalgonda;mandalam;mla;doctor;reddy;nayak;partyకరోనా హాట్ స్పాట్ గా నాగార్జున సాగర్!కరోనా హాట్ స్పాట్ గా నాగార్జున సాగర్!nagarjuna sagar hot spot;kcr;nagarjuna akkineni;ravi anchor;sridhar;tiru;vedhika;bharatiya janata party;telangana rashtra samithi trs;nagarjuna sagar dam;district;nalgonda;mandalam;mla;doctor;reddy;nayak;partyTue, 20 Apr 2021 17:04:01 GMTఇటీవల ఉప ఎన్నిక జరిగిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ నియోజకవర్గం కరోనా హాట్ స్పాట్ గా మారింది. రోజురోజుకు కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. సోమవారం నియోజకవర్గం పరిధిలో 161 పాజిటివ్ కేసులు నమోదు కాగా... మంగళవారం ఆ సంఖ్య మరింత పెరిగింది. నియోజకవర్గ పరిధిలోని పీహెచ్సీలలో చేసిన రాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో మంగళవారం ఒక్కరోజే 250 మందికి కరోనా నిర్దారణ అయింది. ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా మంది పరీక్షలు చేయించుకున్నారని తెలుస్తోంది. చాలా మందికి పాజిటివ్ రావడంతో క్వారంటైన్ లో ఉంటున్నారని చెబుతున్నారు.

మంగళవారం తిరుమలగిరి మండలంలో 250 మందికి టెస్ట్ చేయగా 60 మంది కరోనా సోకింది. పెద్దవూర మండలంలో 44, త్రిపురారం మండలంలో 19, నాగార్జున సాగర్ లో 49, నిడమనూర్ మండలంలో 17, గుర్రంపోడు మండలంలో 23, హాలియా పట్టణంలో 38 మందికి కొత్తగా కరోనా సోకిందని నిర్దారణ అయింది. నియోజవర్గ పరిధిలోని పీహెచ్సీలకు టెస్టులు కోసం జనాలు భారీగా వస్తున్నారు. కిట్స్ కొరతతో టెస్టులు చేయలేక చేతులెత్తేశారు వైద్యశాఖ సిబ్బంది.

ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ రోజున వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల‌ భగత్‌‌తో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకి కూడా కరోనా సోకింది. వీళ్లతో పాటు సాగర్ లో ప్రచారం నిర్వహించిన నేతల్లో చాలా మందికి కరోనా సోకిందని తెలుస్తోంది. ఈనెల 14న హాలియాలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆ సభలో పార్టీ అభ్యర్థి నోముల భగత్ తో కలిసి వేదిక పంచుకున్నారు. సీఎం కేసీఆర్ కు కూడా సాగర్ సభలోనే కరోనా సోకిందని భావిస్తున్నారు.

నాగార్జున సాగర్ బీజేపీ నేతలను కరోనా టెన్షన్ పట్టుకుంది. సాగర్ బై ఎలక్షన్ తర్వాత బీజేపీ నేతలకు కరోనా బారినపడటమే దీనికి కారణం. ఇప్పటికే హోం ఐసోలేషన్‌లోకి సాగర్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ రవి నాయక్ వెళ్లారు. సాగర్ బీజేపీ నేతలు నివేదితారెడ్డి, శ్రీధర్ రెడ్డిలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనా ప్ర‌ళ‌య గ‌ర్జ‌న‌

జ‌గ‌న్‌, బొత్స‌, ధ‌ర్మాన మెడ‌కు బిగుసుకుంటున్న ఉచ్చు?

ప్చ్..... ఆ మెగా ముల్టీస్టారర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా ....??

ఆ రెండిటి తరువాత బాలయ్య మూడో సినిమా ఆయన తో ఫిక్స్ .... ??

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>