Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gandid08cac11-09b6-42d2-8ee2-9d1003207f98-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gandid08cac11-09b6-42d2-8ee2-9d1003207f98-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అయితే మొన్నటి వరకు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కేసులు మరో సారీ విపరీతంగా పెరిగి పోతుండటంతో రాష్ట్ర ప్రజానీకం మాత్రం ఆందోళనలో మునిగిపోతుంది. అయితే రోజురోజుకు వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో అందుతున్న వైద్య సదుపాయలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి అంటూ ఎన్నో విమర్శలు కూడా తన మీదికి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైద్యం అందిస్తున్నామని చెబుతున్నపGandi;mohandas karamchand gandhi;district;youtube;woman;medchal;corporate;coronavirusగాంధీ ఆసుపత్రి నిర్లక్ష్యం.. కళ్లముందే కన్నతల్లి ప్రాణం పోయింది.. వైరల్ వీడియో..?గాంధీ ఆసుపత్రి నిర్లక్ష్యం.. కళ్లముందే కన్నతల్లి ప్రాణం పోయింది.. వైరల్ వీడియో..?Gandi;mohandas karamchand gandhi;district;youtube;woman;medchal;corporate;coronavirusTue, 20 Apr 2021 10:40:00 GMTతెలంగాణలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అయితే మొన్నటి వరకు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కేసులు మరో సారీ విపరీతంగా పెరిగి పోతుండటంతో రాష్ట్ర ప్రజానీకం మాత్రం ఆందోళనలో మునిగిపోతుంది.  అయితే రోజురోజుకు  వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో అందుతున్న వైద్య సదుపాయలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి అంటూ ఎన్నో విమర్శలు కూడా తన మీదికి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైద్యం అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ.. ఆచరణలో మాత్రం ఇది సాధ్యం కావడం లేదు అన్నది అర్ధమవుతుంది.



 అయితే గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తిచెందిన సమయంలో ఇక ఎంతో మంది రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే కనీసం పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు అంటూ ఎంతో మంది బాధితులు ఇక తమ బాధను వెలిబుచ్చిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇక ప్రస్తుతం కూడా అదే పరిస్థితులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూస్తుంటే ఇక గాంధీ ఆస్పత్రి నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారిపోయింది .  ఈ వీడియోలో తన తల్లి కళ్ళముందే చనిపోతున్నా ఏమీ చేయలేని  స్థితిలో ఉండిపోయిన ఆ కొడుకు పడిన ఆవేదన అందర్నీ కన్నీరు పెట్టిస్తోంది.



 మేడ్చల్ జిల్లా శామీర్పేట కు చెందిన 50 ఏళ్ల జయమ్మ అనే మహిళకు మూడు రోజుల కిందట కరోనా సోకింది. అయితే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడిన మహిళలను ఇక గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే సదరు మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ  గాంధీ ఆస్పత్రి సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. కరోనా సర్టిఫికెట్ వుంటేనే ఆస్పత్రిలో చేర్చుకుంటాను అంటూ సిబ్బంది చెప్పారు. దీంతో ఊపిరాడక ఇబ్బంది పడుతూ అల్లాడిపోయిన జయమ్మ చివరికి అంబులెన్సులోనే చనిపోయింది.దీంతో పక్కనే ఉన్న కొడుకు ఏమీ చేయలేకపోయాడు ఇక తన తల్లి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే గాంధీ ఆస్పత్రికి వచ్చి గంటలు గడుస్తున్నా ఎవరు స్పందించడం లేదని ఇదేం ఆసుపత్రో అర్థం కావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ కొడుకు రికార్డ్ చేసిన వీడియో వైరల్ గా మారిపోయింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సోము వీర్రాజుపై వేటు??

వారికి అనుష్క షాక్ అప్పటి దాకా డేట్స్ ఇవ్వదట !

దర్శకుడు రమేష్ వర్మకు కరోనా పాజిటివ్..!

కరోనా బారినపడకుండా ఉండాలంటే రెండు మాస్కులు పెట్టాల్సిందే..!

బ్రేకింగ్:వైఎస్‌ షర్మిలకు కరోనా టెన్షన్.. ఆయనకు కొవిడ్ పాజిటివ్..!!

పరేషాన్ అవ్వకండి.. అదంతా ఒట్టి ముచ్చటే.. క్లారిటీ ఇచ్చిన వైద్య శాఖ..?

టీడీపీలో ఈ మార్పులు వెరీ అర్జెంట్‌... అప్పుడు బాబుకు తిరుగు లేన‌ట్టే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>