MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips0ca9c0d6-d024-4f12-bbdb-b9227260afee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips0ca9c0d6-d024-4f12-bbdb-b9227260afee-415x250-IndiaHerald.jpgకోవిడ్ మహమ్మారి రెండో వేవ్ తెలుగు చిత్ర పరిశ్రమను టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే చాలా తెలుగు సినిమాలు విడుదల వాయిదా వేశారు. అలాగే పెద్ద పెద్ద సినిమాలు వెనక్కి వెళ్ళే యోచన చేస్తున్నాయి. ఇదిలా ఉంటే భారీ సినిమా షూటింగులు కూడా ఇప్పుడు ఆగిపోయే పరిస్థితి నెలకొంది. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది. సినిమా యూనిట్ లో కొన్ని కరోనా కేసులు వెలుగులోకి రావడంతో అప్పటికప్పుడు అర్ధాంతరంగా షూట్ నిలిపివేసినట్లు సమాచారం. యూనిట్ లోనే కాక రాష్ట్ర వ్tollywoodgossips;ram charan teja;alia bhatt;ram pothineni;rajamouli;hyderabad;rrr movie;cinema;graphicsషాకింగ్ : మళ్ళీ ఆగిపోయిన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ?షాకింగ్ : మళ్ళీ ఆగిపోయిన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ?tollywoodgossips;ram charan teja;alia bhatt;ram pothineni;rajamouli;hyderabad;rrr movie;cinema;graphicsTue, 20 Apr 2021 07:00:00 GMTకోవిడ్ మహమ్మారి రెండో వేవ్ తెలుగు చిత్ర పరిశ్రమను టెన్షన్ పెడుతోంది.  ఇప్పటికే చాలా తెలుగు సినిమాలు విడుదల వాయిదా వేశారు. అలాగే పెద్ద పెద్ద సినిమాలు వెనక్కి వెళ్ళే యోచన చేస్తున్నాయి. ఇదిలా ఉంటే భారీ సినిమా షూటింగులు కూడా ఇప్పుడు ఆగిపోయే పరిస్థితి నెలకొంది. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది. సినిమా యూనిట్ లో కొన్ని కరోనా కేసులు వెలుగులోకి రావడంతో అప్పటికప్పుడు అర్ధాంతరంగా షూట్ నిలిపివేసినట్లు సమాచారం.

 యూనిట్ లోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దానికి కారణం ఈ సినిమా ఒక భారీ బడ్జెట్ సినిమా కావడమే. ఈ సినిమాలో పని చేయడం కోసం దాదాపు హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి చాలామంది షూటింగ్ కి వస్తుంటారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాలతో కనెక్టివిటీ ఉన్న కారణంగా ప్రస్తుతం రిస్కు చేయడం ఇష్టం లేని రాజమౌళి షూటింగ్ అర్థాంతరంగా నిలిపివేసినట్లు సమాచారం.. ఇక ప్రస్తుతానికి గ్రాఫిక్స్ వర్క్ మీద ఆయన పూర్తిగా దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. 

నిజానికి ఇప్పటికే పలు దేశాలలో ఉన్న పలువురు నిపుణులతో ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ చేయిస్తున్నారు. అయితే గతంలో వచ్చిన అవుట్పుట్ సరిగ్గా నచ్చకపోవడంతో ఇప్పుడు మళ్లీ రాజమౌళి కొత్త అవుట్ పుట్ కోసం ఆయా నిపుణుల వెంట పడుతున్నారు. ఇక అనుకోకుండా వచ్చిన ఈ గ్యాప్ తో గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నాడు అని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది కాకపోతే రామ్ చరణ్ అలియా భట్ మధ్య కొన్ని సన్నివేశాలు, మరి కొంత టాకీ పార్ట్ బాకీ ఉంది. ఆమెకు ఈ మధ్యనే కరోనా వచ్చి తగ్గింది. మొత్తం ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుప‌తిపై టీడీపీ, వైసీపీ బెట్టింగులు ఇలా...!

ఏపీలో అవినీతికి చెక్‌... ఆ సీఎంను ఫాలో అంటోన్న జ‌గ‌న్ ?

ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌కు వెళ్లొద్దు.. ప‌రిస్థితి ఎంత డేంజ‌ర్ అంటే...!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబును బాగా ఇరికించేసిన అచ్చెన్న

వాయిదా పడిన ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు షో..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈ అధికారి పదే పదే ఎందుకు కెలుక్కుంటున్నట్లు ?

జబర్దస్త్ 'బ్లాక్ అండ్ వైట్' జోడిని వదిలని ఈటీవీ.. ఇప్పుడు మరోసారి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>