MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan-ec4b8ca9-b6a4-4817-9b36-d873a296f94e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan-ec4b8ca9-b6a4-4817-9b36-d873a296f94e-415x250-IndiaHerald.jpgచిరంజీవి తమ్ముడుగా గుర్తింపు తెచ్చుకోకుండా నాగబాబు తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకున్నాడు. నటుడుగా టివి కార్యక్రమాల జడ్జిగా నిర్మాతగా విభిన్న బాధ్యతలను నాగబాబు నిర్వర్తిస్తున్నాడు. అయితే నటుడుగా టివి కార్యక్రమాల జడ్జిగా నాగబాబు రాణించాడు కానీ నిర్మాతగా అతడు ఏమాత్రం రాణించలేకపోయాడు.మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘రుద్రవీణ'తో నిర్మాతగా మారిన నాగబాబు అప్పటి నుంచి ‘త్రినేత్రుడు' ‘ముగ్గురు మొనగాళ్లు' ‘కౌరవుడు' ‘బావగారూ బాగున్నారా' ‘గుడుంబా శంకర్' ‘స్టాలిన్' ‘ఆరెంజ్' ‘నా పేరు సూర్య' లramcharan;;chiranjeevi;ram charan teja;ram pothineni;rani;shankar;surya sivakumar;udhayanidhi stalin;cinema;stalin;na peru surya;naa peru surya naa illu india;tammudu;magadheera;thammudu;gudumba shankarచరణ్ కు తీర్చవలసిన బాకీ గురించి ఎదురు చూస్తున్న నాగబాబు !చరణ్ కు తీర్చవలసిన బాకీ గురించి ఎదురు చూస్తున్న నాగబాబు !ramcharan;;chiranjeevi;ram charan teja;ram pothineni;rani;shankar;surya sivakumar;udhayanidhi stalin;cinema;stalin;na peru surya;naa peru surya naa illu india;tammudu;magadheera;thammudu;gudumba shankarTue, 20 Apr 2021 10:00:00 GMTచిరంజీవి తమ్ముడుగా గుర్తింపు తెచ్చుకోకుండా నాగబాబు తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకున్నాడు. నటుడుగా టివి కార్యక్రమాల జడ్జిగా నిర్మాతగా విభిన్న బాధ్యతలను నాగబాబు నిర్వర్తిస్తున్నాడు. అయితే నటుడుగా టివి కార్యక్రమాల జడ్జిగా నాగబాబు రాణించాడు కానీ నిర్మాతగా అతడు ఏమాత్రం రాణించలేకపోయాడు.



మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘రుద్రవీణ'తో నిర్మాతగా మారిన నాగబాబు అప్పటి నుంచి ‘త్రినేత్రుడు' ‘ముగ్గురు మొనగాళ్లు' ‘కౌరవుడు' ‘బావగారూ బాగున్నారా' ‘గుడుంబా శంకర్' ‘స్టాలిన్' ‘ఆరెంజ్' ‘నా పేరు సూర్య' లాంటి అనేక సినిమాలు తీసాడు. ఈ సినిమాల్లో ఒక్క ‘బావగారు బాగున్నారా’ తప్ప మిగతా సినిమాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి. భారీ సినిమాల నిర్మాతగా మారాలని నాగబాబు చేసిన ప్రయత్నాలు అన్నీ కలిసిరాలేదు.



దీనితో తాను సినిమా నిర్మాణానికి పనికిరాను అన్న విషయం తనకు చాల ఆలస్యంగా తెలిసిందే అని అంటున్నాడు. ఇదే సందర్భంలో తనకు భారీ నష్టాలను మిగిల్చిన ‘ఆరెంజ్’ సినిమా గురించి మాట్లాడుతూ నాగబాబు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఈమూవీని ‘మగధీర’ సినిమా తరువాత తాను రామ్ చరణ్ తో నిర్మిస్తున్న పరిస్థితులలో ఈ మూవీ పై భారీ పెట్టుబడి పెట్టి చాల ఆశలు పెట్టుకున్న అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు.


అయితే ఈమూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ఈమూవీ వల్ల తనకు అప్పట్లో వచ్చిన భారీ నష్టాలను గుర్తుకు చేసుకుంటూ ఆ నష్టాలను తీర్చడంలో తన అన్న చిరంజీవి తనకు ఎంతో సహాయం చేసాడని చిరంజీవి సహకారం అప్పట్లో తనకు లభించకుండా ఉండి ఉంటే తాను ఆ కష్టాల నుండి బయట పడలేకపోయేవాడిని అంటూ కామెంట్ చేసాడు. ఇదే సందర్భంలో ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ కు ఇవ్వవలసిన పారితోషికం తాను ఇప్పటివరకు ఇవ్వలేదని చరణ్ కు తీర్చవలసిన ఆ బాకీ ఎప్పటికి తీరుతుందో తనకు తెలియదు అంటూ తన పై తానే జోక్ చేసుకున్నాడు..    





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పరేషాన్ అవ్వకండి.. అదంతా ఒట్టి ముచ్చటే.. క్లారిటీ ఇచ్చిన వైద్య శాఖ..?

టీడీపీలో ఈ మార్పులు వెరీ అర్జెంట్‌... అప్పుడు బాబుకు తిరుగు లేన‌ట్టే ?

ఈ రెండు లోపాలు స‌రిచేసుకుంటే చంద్ర‌బాబుకు తిరుగులేన‌ట్టే ?

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..‘ఆదిపురుష్’ అప్డేట్ వచ్చేసింది..

ఇన్ని క‌ష్టాల్లోనూ చెక్కు చెద‌ర‌ని బాబు ఇమేజ్‌... ఇదే 2024 బ్ర‌హ్మాస్త్రం...!

తిరుప‌తిపై టీడీపీ, వైసీపీ బెట్టింగులు ఇలా...!

ఏపీలో అవినీతికి చెక్‌... ఆ సీఎంను ఫాలో అంటోన్న జ‌గ‌న్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>