PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijayashanti8eac22e1-79f6-4a71-94df-39a7c510de11-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijayashanti8eac22e1-79f6-4a71-94df-39a7c510de11-415x250-IndiaHerald.jpgసీఎం కేసీఆర్‌ను ఆద‌ర్శంగా తీసుకొని ప‌లువురు మంత్రులు, తెరాస నేత‌లు నిర్ల‌క్ష్యానికి నిల‌వుట‌ద్దంగా మారార‌ని విమ‌ర్శించారు. మాస్కులు లేవంటూ ప్ర‌జ‌ల‌పై వేల‌కువేలు ఫైన్లు వేస్తున్నసీఎం కేసీఆర్‌.. ముందు త‌న‌పై, ఆయ‌న్ను అనుచ‌రిస్తూ మాస్కులు ధ‌రించ‌ని మంత్రులు, తెరాస శ్రేణుల‌పై ఫైన్లు వేయాల‌ని విమ‌ర్శించారు.Vijayashanti;kcr;prema;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;love;mantraకేసీఆర్‌పై విజ‌య‌శాంతి సంచ‌ల‌న వ్యాఖ్య‌లుకేసీఆర్‌పై విజ‌య‌శాంతి సంచ‌ల‌న వ్యాఖ్య‌లుVijayashanti;kcr;prema;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;love;mantraTue, 20 Apr 2021 15:03:24 GMTతెరాస ప్ర‌భుత్వంపై తెలంగాణ ఫైర్‌బ్రాండ్‌, బీజేపీ నేత విజ‌య‌శాంతి ఒంటికాలితో లేస్తారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌పై, ఆయ‌న ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించే విజ‌య‌శాంతి తాజాగా మ‌రోసారి కేసీఆర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నా కేసీఆర్ ప్ర‌భుత్వానికి చీమ కుట్టిన‌ట్లుకూడా లేద‌ని మండిప‌డ్డారు. హైకోర్టు చివాట్లు పెట్టేవ‌ర‌కు ప్ర‌భుత్వం స్పందించ‌లేదంటే ప్ర‌జ‌ల ప్రాణాల‌పై కేసీఆర్ ప్ర‌భుత్వానికి ఏమాత్రం ప్రేమ ఉందో అర్థ‌మ‌వుతుంద‌ని అన్నారు. క‌రోనా బారిన ప‌డిన సీఎం కేసీఆర్ అంతకు ముందు మాస్క్ లేకుండా స‌మీక్ష‌లు నిర్వ‌హించిన, స‌భ‌ల్లో పాల్గొన్న ఫొటోలు మీడియాలోను, సోష‌ల్ మీడియాలోను చ‌క్క‌ర్లు కొడుతున్నాయ‌ని అన్నారు.

సీఎం కేసీఆర్‌ను ఆద‌ర్శంగా తీసుకొని ప‌లువురు మంత్రులు, తెరాస నేత‌లు నిర్ల‌క్ష్యానికి నిల‌వుట‌ద్దంగా మారార‌ని విమ‌ర్శించారు. మాస్కులు లేవంటూ ప్ర‌జ‌ల‌పై వేల‌కువేలు ఫైన్లు వేస్తున్నసీఎం కేసీఆర్‌.. ముందు త‌న‌పై, ఆయ‌న్ను అనుచ‌రిస్తూ మాస్కులు ధ‌రించ‌ని మంత్రులు, తెరాస శ్రేణుల‌పై ఫైన్లు వేయాల‌ని విమ‌ర్శించారు. హైకోర్టు మొట్టికాయ‌ల‌తో ప్ర‌భుత్వం నామ‌మాత్రంగా రాత్రి 9గంట‌ల నుంచి ఉద‌యం 5గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ విధించిద‌ని,  ప‌గ‌టి పూట ఎలాంటి నియంత్ర‌ణ‌లూ లేకుండా ప్ర‌భుత్వం క‌రోనాను ఎలా క‌ట్ట‌డి చేయ‌గ‌లుగుతుంద‌ని విజ‌య‌శాంతి ప్ర‌శ్నించారు.

ఓ ప‌క్క ఇత‌ర రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు క‌రోనా క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని, కానీ ఇక్క‌డ కేసీఆర్ ప్ర‌భుత్వం మాత్రం ప్ర‌జ‌ల‌కు క‌రోనా వ‌స్తే వారే ఇబ్బందులు ప‌డ‌తారు మ‌న‌కేంటి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విజ‌య‌శాంతి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విద్యా సంస్థ‌ల‌ను మూసివేయించిన ప్ర‌భుత్వం స‌భ‌లు, ర్యాలీలు, వైన్‌షాపులు, ప‌బ్‌లు, క్ల‌బ్‌లు ఎందుకు కొన‌సాగిస్తుంద‌ని ప్ర‌శ్నించారు. క‌రోనా సోకి ఆస్ప‌త్రుల‌కు వెళితే బెడ్లు లేవ‌ని బాధితులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వానికి వారి ఇబ్బందులు ప‌ట్ట‌వా అంటూ ఫైర్‌బ్రాండ్ విజ‌య‌శాంతి కేసీఆర్ ప్ర‌భుత్వంపై ఫైర్ అయ్యారు. హైకోర్టు ఆగ్ర‌హంతోనైనా ప్ర‌భుత్వం స్పందించి రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాబుతో కలిసి మోడీ వెళ్తారు సరే... మరి వాళ్ళు...?

హీరోలను సంతృప్తి పరచడానికి మన హీరోయిన్ లు ఏం చేసేవారో తెలుసా..!

పవర్ స్టార్ - పూరి ల పవర్ఫుల్ హిట్ కి 21 ఏళ్ళు .... ??

జగన్ చేసిందే కరెక్ట్ అంటున్నారుగా...?

మళ్ళీ బాబు అదే బాటలో...?

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్... పవన్ కు కరోనా నెగటివ్...

సీఎం జ‌గ‌న్‌తో కేవీపీ బావ‌మ‌రిది అశోక్‌ భేటీ.. ఇదే హాట్ టాపిక్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>