MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bharatheeyudu-2-movie-updatea5c62999-7642-4233-b97d-2297d6ba0af0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bharatheeyudu-2-movie-updatea5c62999-7642-4233-b97d-2297d6ba0af0-415x250-IndiaHerald.jpgలోకనాయకుడు కమల్ హాసన్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం భారతీయుడు ఎంతటి విజయం సాధించి పెను సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. 1996లో విడుదలైన ‘భారతీయుడు’ చిత్రం అప్పట్లో ఓ ప్రభంజనం. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 తీయాలని సంకల్పించారు డైరెక్టర్ శంకర్. అందుకు కమల్ హాసన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. BHARATHEEYUDU 2 MOVIE UPDATE;ram charan teja;kamal hassan;lyca productions;ram pothineni;shankar;adinarayanareddy;cinema;director;indian;dilఇండియన్ 2 నిర్మాతలకు 180 కోట్లు నష్టమా...? ఇప్పుడెలా..?ఇండియన్ 2 నిర్మాతలకు 180 కోట్లు నష్టమా...? ఇప్పుడెలా..?BHARATHEEYUDU 2 MOVIE UPDATE;ram charan teja;kamal hassan;lyca productions;ram pothineni;shankar;adinarayanareddy;cinema;director;indian;dilTue, 20 Apr 2021 14:00:00 GMTకమల్ హాసన్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం భారతీయుడు ఎంతటి విజయం సాధించి పెను సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. 1996లో విడుదలైన ‘భారతీయుడు’ చిత్రం అప్పట్లో ఓ ప్రభంజనం. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 తీయాలని సంకల్పించారు డైరెక్టర్ శంకర్. అందుకు కమల్ హాసన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు వహించేందుకు ముందుకు వచ్చింది. 250 కోట్ల బడ్జెట్ ప్రణాళికలతో ఈ సినిమాను నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. మొదట్లో కమల్ పాలిటిక్స్ లో ఫుల్ బిజీ కావడం వలన.... మరి కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగుతూ వచ్చింది.

ఆ తర్వాత షూటింగ్ జరుగుతున్న సమయంలో హఠాత్తుగా క్రేన్ ప్రమాదం సంభవించడంతో... ఊహించని రీతిలో భారతీయుడు 2 చిత్రం ఆగిపోయింది. ఇదే విషయమై క్షతగాత్రులను పట్టించుకునే విషయంలో లైకా సంస్థ నిర్లక్ష్యం చేసిందంటూ... కమల్ హాసన్ వారిపై గుర్రుగా ఉన్నారని వార్తలు వినిపించాయి. అయితే దీని తర్వాత అయినా షూటింగ్ ప్రారంభం అవుతుంది అనుకుంటే... కరోనా కారణంగా మళ్లీ బ్రేక్ పడింది. ఇలా ఆది నుండి షూటింగ్ అనుకుంటే చాలు ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఇక అటకెక్కినట్టే అన్న ప్రచారాలు మరింత పుంజుకున్నాయి. దీనికి కారణం లేకపోలేదు... క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 సినిమా  కోసం ఇప్పటికే చాలా సమయం వృధా అయింది అన్నట్లుగా ఉన్నారట.

అంతే కాకుండా దిల్ రాజు బ్యానర్ లో, రామ్ చరణ్ ప్రధానపాత్రలో ఓ చిత్రాన్ని ప్రారంభించాడు. దాంతో ఇక సందేహమే లేదు... ఇండియన్ 2 సినిమా ఇక పూర్తిగా ఆగిపోయినట్లే అన్న వార్తలు వైరల్ అయ్యాయి. మరోవైపు శంకర్ మా సినిమాని పూర్తి చేయకుండానే మరో సినిమాకు సిద్దమయ్యాడు అంటూ... లైకా సంస్థ కోర్టు మెట్లెక్కినా లాభం లేకపోయింది. ఇప్పటికే 180 కోట్ల వరకు ఖర్చు చేశాము... మా సినిమాని వదిలేసి వేరే చిత్రం చేయడమేంటి అని లైకా ప్రొడక్షన్స్ చెప్పినా... అక్కడ తీర్పు శంకర్ కు అనుకూలంగా రావడంతో... ఇక భారతీయుడు సీక్వెల్ గురించి మరచి పోవాల్సిందే అని అంతా అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేము.... కమల్ కనుక తలుచుకుంటే తిరిగి ఈ చిత్రాన్ని పట్టాలెక్కించగలరు. కానీ ఏం జరుగుతుందో చూడాలి. అయితే లీకే వారికి కలిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో తెలియక సతమవుతున్నారు.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

శుక్ర‌వారం నుంచి వీకెండ్ లాక్‌డౌన్

మళ్ళీ బాబు అదే బాటలో...?

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్... పవన్ కు కరోనా నెగటివ్...

ఈ లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతులు.. హెచ్చరించిన ఏపీ పోలీసులు..?

సీఎం జ‌గ‌న్‌తో కేవీపీ బావ‌మ‌రిది అశోక్‌ భేటీ.. ఇదే హాట్ టాపిక్ ?

తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ.. వీరికి మిన‌హాయింపు

వారికి అనుష్క షాక్ అప్పటి దాకా డేట్స్ ఇవ్వదట !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>