PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-6463cf43-3c5a-46d3-8db4-98b94a88d828-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-6463cf43-3c5a-46d3-8db4-98b94a88d828-415x250-IndiaHerald.jpgప్రధాని నరేంద్ర మోడీ క్రేజ్ మామూలుగా లేదు. అది మరొకరికి రాదు. దశాబ్దాల తరబడి దేశం కోసం పాటు పడిన ఆజన్మ బ్రహ్మచారి అటల్ బిహారీ వాజ్ పేయ్ సైతం బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ తేలేకపోయారు. కానీ మోడీ మాస్టర్ మాత్రం అలవోకగా రెండు సార్లు బీజేపీకి ఫుల్ మెజారిటీ తెచ్చి ఇందిరాగాంధీ తరువాత అంతటి శక్తిమంతుడైన ప్రజా నేతగా నిలిచారు. modi;modi;narendra modi;rbi;prime minister;central government;oxygen;master;narendraమోడీ.. ఆ మూడూ...మూడ్ మార్చేశాయా...?మోడీ.. ఆ మూడూ...మూడ్ మార్చేశాయా...?modi;modi;narendra modi;rbi;prime minister;central government;oxygen;master;narendraMon, 19 Apr 2021 22:00:00 GMTప్రధాని నరేంద్ర మోడీ క్రేజ్ మామూలుగా లేదు. అది మరొకరికి రాదు. దశాబ్దాల తరబడి దేశం కోసం పాటు పడిన ఆజన్మ బ్రహ్మచారి అటల్ బిహారీ వాజ్ పేయ్ సైతం బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ తేలేకపోయారు. కానీ మోడీ మాస్టర్ మాత్రం అలవోకగా రెండు సార్లు బీజేపీకి ఫుల్ మెజారిటీ తెచ్చి ఇందిరాగాంధీ తరువాత అంతటి శక్తిమంతుడైన ప్రజా నేతగా నిలిచారు.

అయితే కాలమెపుడూ ఒక్కలా ఉండదు. మోడీ విషయంలో మొదటి రెండేళ్లకే కొంత మోజు తగ్గింది. దానికి తోడు అన్నట్లుగా పెద్ద నోట్ల రద్దుతో మోడీ అతి పెద్ద ఫెయిల్యూర్ ని మూట కట్టుకున్నారు అన్న మాట ఇప్పటికీ ఆర్ధిక వేత్త్తల నుంచి వస్తుంది. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ క్రమబద్ధీకరించబడుతుందని, దేశంలో నల్లధనం అంతా ఖజానాకు వచ్చి చేరుతుందని ఎన్నో చెప్పారు.

కానీ దాని వల్ల దేశ జనాలు తమ డబ్బుల కోసం బ్యాంకుల ముందుకు వచ్చి చనిపోయారు తప్ప మరేమీ ఒరగలేదు. అక్కడ మోడీ మీద భారీ వ్యతిరేకత మొదలైంది అంటున్నారు. ఇక జీఎస్టీ విధానం వల్ల కూడా దేశంలో వస్తువుల ధరలు ఒక్కసారిగా తగ్గిపోతాయని ఊదరగొట్టారు. కానీ ఈ విధానంతో దేశంలోని పన్నులనీ నేరుగా కేంద్ర ఖజానాకు జమ కావడంతో పాటు రాష్ట్రాలు వెళ్ళి కేంద్రం వద్ద తమ వాటాను అర్ధించే పరిస్థితి ఏర్పడింది అన్న మాట ఉంది.

ఇక కరోనా విషయంలో అన్నింటి కంటే అతి పెద్ద వైఫల్యాన్ని మోడీ సర్కార్ చవి చూస్తోందని అంటున్నారు. గత ఏడాది కరోనా కారణంగా చాలా మంది చనిపోయారు. కానీ కొంత తగ్గుముఖం పట్టింది.అదే సమయంలో కరోనా వస్తే ఏం చేయాలో కూడా చెప్పి వెళ్లింది. మరి దాన్ని గుణపాఠంగా తీసుకుని ఈ ఏడాదిలో పాలకులు చేసిందేంటి అన్న మాట ఇపుడు వినిపిస్తోంది. ఇప్పటికీ ఆసుపత్రులో బెడ్స్ లేవు, ఆక్సిజన్ సిలిండర్లు లేవు, వ్యాక్సినేషన్ కూడా నత్తనడకగా సాగుతోంది. మొత్తానికీ ఈ మూడు అతి పెద్ద ఫెయిల్యూర్స్ మోడీ మీద దేశం మూడ్ ని మార్చేశాయి అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తొలిసారిగా సైంటిస్ట్ గా నటిస్తున్న ప్రభాస్ .... ఏంటి నిజమే ..... ??

పుష్ప పాన్ ఇండియా మూవీ కాదా..?

వైష్ణవ్ ని నెలబెట్టినట్టు అఖిల్ ని మైత్రి వారు నిలబెడతారా?

షర్మిల మొదటి వ్యూహం సక్సెస్.. ఇక తర్వాత ఏంటో..?

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>