MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salar-movie4574dba1-7170-49a6-8d11-979fd67a39b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/salar-movie4574dba1-7170-49a6-8d11-979fd67a39b7-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయనకు ఛత్రపతి సినిమాకు ముందు వరకు కూడా ప్రభాస్ కేవలం ఓ హీరో మాత్రమే. ఆయనకు వర్షం లాంటి విజయం వచ్చినా కూడా మాస్ ఇమేజ్ మాత్రం రాలేదు. కోరుకున్న మార్కెట్ కూడా క్రియేట్ కాలేదు. అలాంటి సమయంలో రాజమౌళి వచ్చి చత్రపతి సినిమాతో ప్రభాస్ రేంజ్ మార్చేసాడు.Salar movie;prabhas;prasanth;prashanth neel;rajamouli;varsha;hyderabad;india;cinema;bahubali;hero;vegetable market;kgf;prasanth neel;chatrapathi;prashant kishor;massప్రభాస్ సలార్ సినిమాలో శ్రుతి హాసన్ పాత్ర అదేనా..!ప్రభాస్ సలార్ సినిమాలో శ్రుతి హాసన్ పాత్ర అదేనా..!Salar movie;prabhas;prasanth;prashanth neel;rajamouli;varsha;hyderabad;india;cinema;bahubali;hero;vegetable market;kgf;prasanth neel;chatrapathi;prashant kishor;massMon, 19 Apr 2021 12:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయనకు ఛత్రపతి సినిమాకు ముందు వరకు కూడా ప్రభాస్ కేవలం ఓ హీరో మాత్రమే. ఆయనకు వర్షం లాంటి విజయం వచ్చినా కూడా మాస్ ఇమేజ్ మాత్రం రాలేదు. కోరుకున్న మార్కెట్ కూడా క్రియేట్ కాలేదు. అలాంటి సమయంలో రాజమౌళి వచ్చి చత్రపతి సినిమాతో ప్రభాస్ రేంజ్ మార్చేసాడు. అప్పటి వరకు ఉన్న మార్కెట్‌ను మూడింతలు పెంచేసాడు. అన్నింటి కంటే ముందు ప్రభాస్‌కు ఫ్యాన్ బేస్ పెంచేసాడు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మరిపోయాడు.

ఇక కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” అనే మరో పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ పూర్తి అయిందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తీసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా శ్రుతి హాసన్ ఈ సినిమా వచ్చే షెడ్యూల్ షూట్ లో పాల్గొనబోతుంది. ఒక జర్నలిస్ట్ పాత్రలో శ్రుతి హాసన్ ఈ సినిమాలో కనిపించబోతుంది. అలాగే ఆమె పాత్రకు సంబంధించిన ట్విస్ట్ కూడా సినిమాలో హైలైట్ గా ఉంటుందట. ఇక హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ప్లేస్ లో వేసిన సెట్ లో ఈ సినిమా షూట్ స్టార్ట్ చేశారట. 2021లో లోపే ఈ సినిమాని పూర్తీ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్.

కాకపోతే, ప్రశాంత్ నీల్ కూడా రాజమౌళిలా సంవత్సరాల తరబడి సినిమాలు చేస్తాడనే పేరు ఉంది కాబట్టి.. కచ్చితంగా ప్రభాస్సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాలి. ఎలాగూ ప్రభాస్ కూడా సలార్ పైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి.. ప్రభాస్ సలార్ కోసం బల్క్ డేట్స్ ను కేటాయించనున్నాడు. కాగా ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ర‌ప‌త్రాల వెనుక క‌థేంటి..? తెరాస అధిష్టానం ఆరా..!

వినాయక్ బాటలో బోయపాటి...?

మేయ‌ర్ అభ్య‌ర్థిగా మంత్రి స‌తీమ‌ణి..? అధిష్టానం ఓకే చెబుతుందా

కరోనా కట్టడికి ఆర్మీ కావాలంటున్న సీఎం

సీఎం జగన్ కు ఇబ్బందిగా మారిన ఆ మంత్రులు...?

విజయమ్మ పై మహిళా కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

సినిమా టైటిల్ గా పాపులర్ డైలాగ్ ఇంతకీ మూవీ పేరేంటో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>