MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-3bc0d6fb-0f87-4379-9696-26fd78f8d8cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-3bc0d6fb-0f87-4379-9696-26fd78f8d8cb-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనకి కొన్ని లక్షల్లో వీరాభిమానులు వుంటారు. అలాంటి అభిమానుల్లో తన అన్న మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా వున్నాడు. చరణ్ కు తన బాబాయి పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం అన్న సంగతి అందరికీ తెలిసిందే. 'రంగస్థలం' సక్సెస్ మీట్లో చరణ్ సక్సెస్ ను చూసి పవన్ ఎంత మురిసిపోయాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ వేడుకలో పవన్ రామ్ చరణ్ ని పొగుడుతూ ముద్దు పెట్టుకున్న తీరు మెగా అభిమానులకు ఎంతగానో సంతోషాన్నిచ్చింది.అంతేకాదు 2019 ఎన్నికPawan-kalyan;pawan;chiranjeevi;ram charan teja;kalyan;pawan kalyan;ram pothineni;ram madhav;rrr movie;2019;upasana;wife;success;research and analysis wingరామ్ చరణ్ ని ఆకాశానికి ఎత్తేస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్...రామ్ చరణ్ ని ఆకాశానికి ఎత్తేస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్...Pawan-kalyan;pawan;chiranjeevi;ram charan teja;kalyan;pawan kalyan;ram pothineni;ram madhav;rrr movie;2019;upasana;wife;success;research and analysis wingMon, 19 Apr 2021 21:10:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనకి కొన్ని లక్షల్లో వీరాభిమానులు వుంటారు. అలాంటి అభిమానుల్లో తన అన్న మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా వున్నాడు. చరణ్ కు తన బాబాయి పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం అన్న సంగతి అందరికీ తెలిసిందే. 'రంగస్థలం' సక్సెస్ మీట్లో చరణ్ సక్సెస్ ను చూసి పవన్ ఎంత మురిసిపోయాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ వేడుకలో పవన్ రామ్ చరణ్ ని పొగుడుతూ ముద్దు పెట్టుకున్న తీరు మెగా అభిమానులకు ఎంతగానో సంతోషాన్నిచ్చింది.అంతేకాదు 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ డీ హైడ్రేషన్ తో మంచాన పడితే, రాంచరణ్ వెంటనే అక్కడికి చేరిపోయాడు. 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్లో చరణ్ కాలికి గాయం అయ్యి రెస్ట్ తీసుకుంటున్న టైం అయినా సరే పవర్ స్టార్ కు అలా జరిగేసరికి ఆలోచించకుండా వెంటనే అక్కడికి వెళ్ళిపోయాడు.


అలాంటి చరణ్.. పవన్ కు కరోనా సోకితే ఊరుకుంటాడా..! నిజానికి కరోనా సోకితే ఫ్యామిలీ మెంబెర్స్ కూడా త్వరగా దగ్గరకు రారు. అయితే చరణ్ మాత్రం పవన్ కు కరోనా సోకిందని తెలిసిన వెంటనే..తన బాబాయ్ ని చూడటానికి వచ్చాడు.అతను చికిత్స పొందుతోన్న శంకరపల్లికి చేరిపోయాడు. శంకరపల్లిలో పవన్ తన ఫార్మ్ హౌస్లోనే చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. అయినప్పటికీ చరణ్..తన భార్య ఉపాసన సాయంతో అపోలో వైద్యుల చేత పవన్ కు సరైన వైద్యం అందేలా చూస్తున్నాడు చరణ్. గంట గంటకు పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ లను అపోలో వైద్యులు చరణ్ కు చెబుతున్నారట. అంతేకాదు పవన్ కోసం 'ఆచార్య' లో తన పార్ట్ షూటింగ్ ను కూడా క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చేసాడట చరణ్. ఏప్రిల్ 20వరకూ జరగాల్సిన పాట చిత్రీకరణను చరణ్ ఆపేసాడట.ఇక పవర్ స్టార్ పట్ల చరణ్ కి వున్న ప్రేమని చూసి పవర్ స్టార్ అభిమానులు చరణ్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మా చరణ్ బాబు మా అన్న పవర్ స్టార్ కి ఎంత ప్రేమో అని మురిసిపోతున్నారు పవన్ అభిమానులు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దారుణం: ఇద్దరు భార్యలపై శాడిస్టు భర్త హత్యాయత్నం..!

పుష్ప పాన్ ఇండియా మూవీ కాదా..?

వైష్ణవ్ ని నెలబెట్టినట్టు అఖిల్ ని మైత్రి వారు నిలబెడతారా?

షర్మిల మొదటి వ్యూహం సక్సెస్.. ఇక తర్వాత ఏంటో..?

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>