COVID-19 Lockdown: లాక్‌డౌన్ ప్రకటించగానే Wine Shopsకు మందుబాబులు పరుగులు, పలు ప్రాంతాల్లో భారీ క్యూ

COVID-19 Lockdown In Delhi ఫ కరోనా వైరస్ రెండో దశలో ఉగ్రరూపం దాల్చుతోంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కోవిడ్19 మహమ్మారి పెను ప్రభావాన్ని చూపుతోంది. దేశ వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో ఏకంగా దాదాపు 3 లక్షల వరకు పాజిటివ్ కేసులు, 1500 మరకు కరోనా మరణాలు నమోదు కావడం పరిస్థితి ఎంతగా దిగజారిపోతుందో సూచిస్తుంది. పలు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ లాంటివి విధిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 

దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌తో సమీక్షించిన అనంతరం దేశ రాజధానిలో లాక్‌డౌన్ విధించారు. కరోనా వైరస్(CoronaVirus) వ్యాప్తి నేపత్యంలో ఏప్రిల్ 19 రాత్రి 10 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఢిల్లీలో లాక్‌డౌన్ అమలులో ఉండనుంది. అయితే లాక్‌డౌన్ ఏంటి, ఎందుకు అనే ఆలోచన కన్నా తమకు కావాల్సింది దొరుకుతుందా లేదా అని మందుబాబులు ఆలోచించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించగానే దేశ రాజధానిలో వైన్స్‌షాపులు, మద్యం దుకాణాల ముందు మందుబాబులు ప్రత్యక్షమయ్యారు. పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాల ముందు క్యూ కట్టారు.

కోవిడ్19 నిబంధనలైన భౌతిక దూరం పాటిస్తూ కనిపించారు. వారం రోజులపాటు తాము మందు తాగకుంటే ఏమైపోతామనే ఉన్న ఆలోచన, ప్రాణాలు తీస్తున్న కరోనా విషయంలో లేకపోవడం లాంటి నిర్లక్ష్యం నేడు వేలాది ప్రాణాలను రోజువారీగా బలితీసుకుంటుంది. కానీ వారం రోజులపాటు లాక్‌డౌన్ రాత్రి నుంచి అమల్లోకి వస్తుందని తెలియగానే మందుబాబులు వైన్స్, ఇతర మద్యం దుకాణాలకు క్యూ కట్టారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇదే సీన్ కనిపించింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  కరోనా(COVID-19) వచ్చినా, ఇంకోటి వచ్చినా సరే, వీళ్లకు మందు ఉంటే చాలంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link – https://bit.ly/3hDyh4G

Apple Link – https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More | https://zeenews.india.com/telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *