National
oi-Madhu Kota
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి అత్యంత ప్రమాదకరంగా మారిన సమయంలోనే వ్యాక్సిన్ల కొరత ఏర్పడటం, టీకాల తయారీ ముడిసరుకును అమెరికా నిలిపేయడం, ఆ దెబ్బకు భారత్ లోని దిగ్గజ ఫార్మా కంపెనీల ఉత్పత్తి పడిపోవడం, వ్యాక్సిన్ అందుబాటులో లేని కారణంగా ప్రత్యామ్నాయ రెమ్‌డెసివీర్ కోసం వినతలు పెరగడం, కొత్త కేసులు, మరణాలు భారీగా పెరగడం తదితర పరిణామాలతో కేంద్ర ఎట్టకేలకు నిద్ర లేచినట్లుగా టీకాల ఉత్పత్తి పెంపునకు చర్యలు చేపట్టింది..
కామసూత్ర, కొరియర్ బాయ్ -జగన్ బాబాయిపై రఘురామ సంచలనం -నర్సాపురంలో ఉపఎన్నిక, షాక్

రూ.4500 కోట్ల రుణాలు..
గడిచిన మూడు వారాలుగా కొత్త కేసులు, మరణాలు ప్రమాదకర స్థాయిని దాటిపోవడం, అదే సమయంలో టీకాల కొరత ఏర్పడిన దరిమిలా పరిస్థితిని చక్కబెట్టేలా టీకాల ఉత్పత్తి పెంచే దిశగా కేంద్ర చర్యలు చేపట్టింది. టీకా తయారీ సంస్థలు అవసరాలకు అనుగుణంగా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోడానికిగానూ రూ.4500 కోట్ల రుణాలు సూత్రప్రాయంగా మంజూరు చేసింది. అందులో..

సీరం, భారత్ బయోకు..
మహారాష్ట్రలోని పుణె కేంద్రంగా పనిచేసే సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తిదారుగా ఉంటూ, ప్రస్తుతం బ్రిటిష్-స్విడిష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీతో కలిసి ‘కొవిషీల్డ్’టీకాను ఉత్పత్తి చేస్తుండటం, ఇటు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ సంస్థ.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘కొవాగ్జిన్’ టీకాను తీసుకురావడం, ఈ రెండు టీకాలనే భారత్ ప్రధానంగా వినియోగిస్తుండం తెలిసిందే. ఈ రెండు కంపెనీలూ టీకాల ఉత్పత్తిని పెంచేలా ప్రణాళికలు రూపొందించి, రుణాల కోసం కేంద్రాన్ని గతంలోనే అభ్యర్థించాయి. ఎట్టకేలకు స్పందించి కేంద్రం.. సీరం సంస్థకు రూ.3 వేల కోట్లు, భారత్ బయోటెక్ సంస్థకు రూ.1500 కోట్లు రుణంగా అందించేందుకు అంగీకరించింది. నిజానికి..

టీకాల కొరతపై హైడ్రామా
అమెరికా ముడి సరుకును నిలిపేసి రోజులు గడిచినా కేంద్రం ఎంతకూ స్పందించకపోవడంతో సీరం సీఈవో అధర్ పూనావాలా మీడియాకెక్కి, గోడు వెళ్లబోసుకున్నారు. ఉన్న టీకాలను కేంద్రం తీసేసుకోవడంతో, ఇతర సంస్థలతో తాము కుదుర్చుకున్న ఒప్పందాలు విఫలమై లీగల్ చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, క్లిష్ట సమయంలో కేంద్రం కనీసం రూ.3వేల కోట్లయినా సహాయం చేయాలని పూనావాలా అర్దించారు. ఆ తర్వాత కూడా కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో సీరం సీఈవో నేరుగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కు ట్వీట్ చేసి, నిషేధం ఎత్తేయాలని కోరారు. ఇంత జరిగినా భారత ప్రభుత్వం.. అమెరికాతో సంప్రదింపులు చేసిన దాఖలాల్లేవు. సీరం, భారత్ బయోలకు ఊరట కల్పిస్తూ ఇప్పుడు రుణాలు మాత్రం మంజూరు చేశారు. అయితే..

కేంద్ర, రాష్ట్రాల మద్య లొల్లి..
టీకాల ఉత్పత్తి పెంచుకునేలా సీరం, భారత్ బయోటెక్ సంస్థలకు కలిపి రూ.4500 కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు సూత్రప్రాయంగా నిర్ణయం జరిగిందని, ఈ మొత్తాన్ని అతి త్వరలో ఆయా సంస్థలకు విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. దేశంలో కోవిడ్ -19 నిర్వహణలో భాగస్వాములైన వివిద రంగాల కంపెనీలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలను ఆదుకుంటామని ఆమె చెప్పినప్పటికీ, పరిస్థితిని చక్కబెట్టడంలో కేంద్రానికి అన్ని రాష్ట్రాలూ పూర్తిగా సహకరించాలని నిర్మల మెలిక పెట్టారు. నిజానికి కరోనా విలయం మొదలైనప్పటి నుంచి ఎపిడమిక్ చట్టాలు అమలు లోకి రావడంతో వైద్య, మందుల తయారీ, ఇతర అత్యవసర విభాగాలపై కేంద్రం మోనోపలీకి అవకాశం ఏర్పడింది. ప్రతి అంశాన్నీ కేంద్రం తన పరిధిలోనే ఉంచుకోవడంతో రాష్ట్రాలు తరచూ లొల్లి పెడుతుండటం చూస్తున్నదే. ఫార్మా కంపెనీలకు రుణాలు మంజూరు చేసిన కేంద్రం.. అమెరికాతోనూ చర్చలు చేస్తుందా వేచిచూడాలి.