PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-tested-covid-positivea44d6f3c-ef33-4de8-9309-613143a5464c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-tested-covid-positivea44d6f3c-ef33-4de8-9309-613143a5464c-415x250-IndiaHerald.jpgహాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఆ సభలో పార్టీ అభ్యర్థి నోముల భగత్ తో కలిసి వేదిక పంచుకున్నారు. బహిరంగ సభలో కేసీఆర్ మాస్క్ ధరించలేదు. వేదికపై నోముల భగత్ తో చాలా సార్లు మాట్లాడారు కేసీఆర్. దీంతో కేసీఆర్ కు హాలియా సభలోనే కరోనా సోకి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.kcr tested covid positive;kcr;kumaar;nagarjuna akkineni;vedhika;telangana rashtra samithi trs;nagarjuna sagar dam;korcha;kalvakuntla chandrashekar rao;telangana;district;cm;nalgonda;chief minister;mla;thota chandrasekhar;party;coronavirus;panjaaకేసీఆర్ కు కరోనా అక్కడే అంటిందా?కేసీఆర్ కు కరోనా అక్కడే అంటిందా?kcr tested covid positive;kcr;kumaar;nagarjuna akkineni;vedhika;telangana rashtra samithi trs;nagarjuna sagar dam;korcha;kalvakuntla chandrashekar rao;telangana;district;cm;nalgonda;chief minister;mla;thota chandrasekhar;party;coronavirus;panjaaMon, 19 Apr 2021 19:57:57 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కరోనా సోకింది. అనారోగ్యానికి గురి కావడంతో ఆయనకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్దారణ అయింది. ప్రస్తుతం ఫామ్ హోజ్ లోనే కేసీఆర్ కు చికిత్స అందిస్తున్నారు. రాపిడ్ యాంటిజెన్ టెస్టులో కేసీఆర్ కు పాజిటివ్ వచ్చింది. సీఎంకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా చేశారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు ప్రకటించారు. ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ.. అవసరమైతే హాస్పిటల్ కు తరలిస్తామని వైద్యులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ కు స్వల్ప లక్షణాలు ఉన్నాయని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ప్రత్యేక డాక్టర్ల బృందం ముఖ్యమంత్రిని పర్యవేక్షిస్తుందని చెప్పారు. కేసీఆర్ కోసం యశోద హాస్పిటల్ లో ప్రత్యేక గదిని సిద్దం చేస్తున్నారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కు కరోనా సోకిందన్న వార్తలతో టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇటీవల ఉప ఎన్నిక జరిగిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో కరోనా వైరస్ పంజా విసిరింది. ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ రోజున వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. నియోజకవర్గంలో సోమవారం 160 కేసులు నమోదయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల‌ భగత్‌‌తో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకి కూడా కరోనా సోకింది. వీళ్లతో పాటు సాగర్ లో ప్రచారం నిర్వహించిన నేతల్లో చాలా మందికి కరోనా సోకిందని తెలుస్తోంది.

హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఆ సభలో పార్టీ అభ్యర్థి నోముల భగత్ తో కలిసి వేదిక పంచుకున్నారు. బహిరంగ సభలో కేసీఆర్ మాస్క్ ధరించలేదు. వేదికపై నోముల భగత్ తో చాలా సార్లు మాట్లాడారు కేసీఆర్. హాలియా సభలో వేదికపై కూర్చున్న చాలా మంది నేతలకు కరోనా నిర్దారణ అయిందని తెలుస్తోంది. సభ తర్వాత చాలా మంది నేతలకు కేసీఆర్ తో కరచాలనం చేశారు. గుంపులు గుంపులుగా కేసీఆర్ చుట్టూ చేరారు నేతలు. దీంతో కేసీఆర్ కు హాలియా సభలోనే కరోనా సోకి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుష్ప పాన్ ఇండియా మూవీ కాదా..?

వైష్ణవ్ ని నెలబెట్టినట్టు అఖిల్ ని మైత్రి వారు నిలబెడతారా?

షర్మిల మొదటి వ్యూహం సక్సెస్.. ఇక తర్వాత ఏంటో..?

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?

ఏపీ సర్కార్ ఉద్యోగుల విషయంలో తప్పులు చేసిందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>