PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt4621006b-d347-4a54-b105-42cb1f3a4eb3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt4621006b-d347-4a54-b105-42cb1f3a4eb3-415x250-IndiaHerald.jpgతిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ రెండు రోజులు దాటుతోంది. అయినా అన్ని పార్టీలూ ఓట్ల లెక్కల మీదనే దృష్టి సారిస్తూ వస్తున్నాయి. ఉప ఎన్నికల్లో జనాలు తక్కువగానే ఓటింగ్ చేశారు. మామూలుగా అయితే తక్కువ పోలింగ్ జరిగిన సందర్భాల్లో చూసుకుంటే విపక్షాలకు పెద్దగా అవకాశం జ‌నాలు ఇవ్వాలనుకోవడంలేదనే సంకేతంగా వస్తుంది tpt;prema;tiru;bharatiya janata party;2019;tirupati;love;husband;tdp;ycp;partyతిరుపతి ఓటమి ఘోరంగానా...?తిరుపతి ఓటమి ఘోరంగానా...?tpt;prema;tiru;bharatiya janata party;2019;tirupati;love;husband;tdp;ycp;partyMon, 19 Apr 2021 19:00:00 GMTతిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ రెండు రోజులు దాటుతోంది. అయినా అన్ని పార్టీలూ ఓట్ల లెక్కల మీదనే దృష్టి సారిస్తూ వస్తున్నాయి. ఉప ఎన్నికల్లో జనాలు తక్కువగానే ఓటింగ్ చేశారు.

మామూలుగా అయితే తక్కువ పోలింగ్ జరిగిన సందర్భాల్లో చూసుకుంటే విపక్షాలకు పెద్దగా అవకాశం జ‌నాలు ఇవ్వాలనుకోవడంలేదనే సంకేతంగా వస్తుంది. ఎందుకంటే జనాలకు ఏ పార్టీ మీద అధిక ప్రేమ ఉన్నా కసి ఉన్నా క్యూ కట్టి మరీ ఓటేస్తారు. 2019 ఎన్నికల వేళ వైసీపీ మీద ప్రేమతోనే జనాలు ఓట్లెత్తారు. అది భారీ సీట్ల రూపంలో కన్వర్ట్ అయింది. మరి తిరుపతిలో ఒకటికి మూడు పార్టీలు బరిలో ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా గట్టిగానే ప్రచారం చేశాయి. కానీ జనాలు ఎందుకో పట్టించుకోలేదు. దాంతో 16 శాతం పోలింగ్ గత సారి కంటే తగ్గింది ఈ పరిణామాన్ని ఎలా చూడాలి. ఎలా విశ్లేషించుకోవాలి అన్నదే విపక్షాలకు అర్ధం కావడంలేదు.

వైసీపీ లెక్కకు చూస్తే గత సారి కంటే మెజారిటీ పెరుగుతుంది అని చెబుతున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా గతంలో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువగానే తెచ్చుకుంటుంది అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యం నుంచి చూసినపుడు కచ్చితంగా టీడీపీకి ఓటమి భారీగానే ఉంటుంది అంటున్నారు. గతసారి అయిదు లక్షల ఓట్ల తో టీడీపీ గౌరవప్రదంగా నిలిచించి. ఇపుడు ఆ ఓట్ల సంఖ్య సగానికి సగం పడిపోతే కనుక పసుపు పార్టీ తలెత్తుకోలేదు అంటున్నారు. మొత్తానికి చూస్తే ఓటమి ఖాయమని తెలుసు. కానీ ఘోరమా కాదా అన్నదే తేలాల్సి ఉందనే  దాని మీదనే విపక్ష శిబిరాల్లో చర్చ సాగుతోంది. గత సారి కంటే తమకు ఎక్కువ ఓట్లు వస్తాయని వైసీపీ బీజేపీ లెక్కలు వేసుకుంటూంటే పోలింగ్ తగ్గిన నేపధ్యంలో ఆ ఓట్లు టీడీపీ నుంచే కన్నం పెట్టి మరీ బదిలీ అవుతున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుష్ప పాన్ ఇండియా మూవీ కాదా..?

వైష్ణవ్ ని నెలబెట్టినట్టు అఖిల్ ని మైత్రి వారు నిలబెడతారా?

షర్మిల మొదటి వ్యూహం సక్సెస్.. ఇక తర్వాత ఏంటో..?

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?

ఏపీ సర్కార్ ఉద్యోగుల విషయంలో తప్పులు చేసిందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>