LifeStyleGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/politics_latestnews/tea-usesce931c7b-5d9a-4212-91b2-ca09566d1ea9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/politics_latestnews/tea-usesce931c7b-5d9a-4212-91b2-ca09566d1ea9-415x250-IndiaHerald.jpgఒత్తిడిగా అనిపించిన‌ప్పుడు ఓ కప్పు టీ తాగితే ఉపశమనం పొందుతారు. అలాగే తలనొప్పిగా ఉన్న సమయంలో కూడా టీ చక్కగా పనిచేస్తుంది. టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. టీ క్యాన్సర్ కారకాలను నిర్వీర్యం చేయ‌డంతోపాటు రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. టీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పటిష్టం చేసి బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి కాపాడ‌టంతోపాటు, జీర్ణాశయ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుండె వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులను నిరోధించ‌డంతోపాటు పాడైన జీవకణాలను ఉత్తేtea uses;jiya;tara;vitamin;heart;cancer;green teaప్ర‌తిరోజు మీరు టీ ఎన్నిసార్లు తాగుతున్నారు?ప్ర‌తిరోజు మీరు టీ ఎన్నిసార్లు తాగుతున్నారు?tea uses;jiya;tara;vitamin;heart;cancer;green teaMon, 19 Apr 2021 11:46:18 GMTఒత్తిడిగా అనిపించిన‌ప్పుడు ఓ కప్పు టీ తాగితే ఉపశమనం పొందుతారు. అలాగే తలనొప్పిగా ఉన్న సమయంలో కూడా టీ చక్కగా పనిచేస్తుంది. క్యాన్సర్ కారకాలను నిర్వీర్యం చేయ‌డంతోపాటు రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. టీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పటిష్టం చేసి బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి కాపాడ‌టంతోపాటు, జీర్ణాశయ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుండె వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులను నిరోధించ‌డంతోపాటు పాడైన జీవకణాలను ఉత్తేజపరుస్తుంది. చాలా మంది టీ తాగడం వల్ల రిఫ్రెష్‌మెంట్‌గా ఉంటుందని, అందుకే తాగుతామని చెబుతుంటారు. కానీ టీ మంచి రెఫ్రెష్‌మెంట్ మాత్రమే కాదు ప్ర‌తిరోజు టీ తీసుకోవ‌డం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఎన్నో ప‌రిశోధ‌న‌లు కూడా నిరూపించాయి.

క్ర‌మం త‌ప్ప‌కుండా తాగితే అనారోగ్యాలు రావు
క్రమం తప్పకుండా టీ తాగేవారు గుండె సంబంధ వ్యాధుల బారిన పడటం, ఏదైనా కారణం వల్ల అక‌స్మాత్తుగా మ‌ర‌ణించే  అవకాశం తక్కువని శాస్త్ర‌వేత్త‌లు కనుగొన్నారు. ముఖ్యంగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం తక్కువని చెబుతున్నారు. ముఖ్యంగా టీ  క్రమంగా తాగేవారు అనారోగ్యాల బారిన పడే అవకాశం తక్కువని , టీని కనీసం వారానికి మూడుసార్లైనా ఆస్వాదించేవారు టీ వల్ల వచ్చే ప్రయోజనాలు పొందుతారు. బ్లాక్ టీ తో పోలిస్తే గ్రీన్ టీ బలమైన ప్రభావాన్ని చూపుతుంద‌ని చెపుతున్నారు.

ఎక్కువ కాలం జీవిస్తారు
50 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న వ్య‌క్తి తరచూ టీ తాగడం వల్ల గుండె జబ్బు రాద‌ని, ఎప్పుడూ టీ తాగని వారికంటే ఒక సంవత్సరం ఎక్కువ కాలం వీరే జీవిస్తార‌ని అధ్యయనాలు తెలిపాయి. క్రమం తప్పకుండా టీ తాగేవారు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే జీవనశైలిని అవలంభిస్తున్నారని ఇటలీలోని పెరుజియా యూనివర్శిటీలో పరిశోధకురాలు వెనెస్సా బియాంకోనీ తెలిపారు. ర‌క్తపోటును తగ్గించే సామర్థ్యం ఉంది. కొన్ని మూలికా టీలు జీర్ణవ్యవస్థకు సహా ఔషధ విలువలకు ప్రసిద్ది అని, ఇవి అన్నిప్రాంతాల్లో దొర‌క‌వ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వినాయక్ బాటలో బోయపాటి...?

మేయ‌ర్ అభ్య‌ర్థిగా మంత్రి స‌తీమ‌ణి..? అధిష్టానం ఓకే చెబుతుందా

కరోనా కట్టడికి ఆర్మీ కావాలంటున్న సీఎం

సీఎం జగన్ కు ఇబ్బందిగా మారిన ఆ మంత్రులు...?

విజయమ్మ పై మహిళా కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

సినిమా టైటిల్ గా పాపులర్ డైలాగ్ ఇంతకీ మూవీ పేరేంటో తెలుసా..?

అక్కడ మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు.. ఇజ్రాయిల్ కీలక నిర్ణయం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>