PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/central-govt-guidelines18a050d5-adb9-497a-9f1e-9dd5e6c8d71c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/central-govt-guidelines18a050d5-adb9-497a-9f1e-9dd5e6c8d71c-415x250-IndiaHerald.jpgకరోనా కారణంగా ప్రపంచం అంతా సర్వనాశమయిన పరిస్థితి మనము చూశాము. కానీ గత అయిదు నెలల ముందు వరకు కరోనా ప్రభావం తక్కువగా ఉండడంతో దేశ ఆర్ధిక పరిస్థితి కాస్త మెరుగుపడిందని చెప్పవచ్చు. ఎప్పటిలాగే అన్ని రంగాలు తమ తమ కార్యకలాపాలతో బిజీ గా ఉన్నారు. అయితే అంతలోనే మరో పిడుగు లాంటి వార్త ప్రజలను భయపెట్టింది. CENTRAL GOVT GUIDELINES;delhi;maharashtra - mumbai;maharashtra;central governmentరాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?CENTRAL GOVT GUIDELINES;delhi;maharashtra - mumbai;maharashtra;central governmentMon, 19 Apr 2021 16:36:41 GMTకరోనా కారణంగా ప్రపంచం అంతా సర్వనాశమయిన పరిస్థితి మనము చూశాము. కానీ గత అయిదు నెలల ముందు వరకు కరోనా ప్రభావం తక్కువగా ఉండడంతో దేశ ఆర్ధిక పరిస్థితి కాస్త మెరుగుపడిందని చెప్పవచ్చు. ఎప్పటిలాగే అన్ని రంగాలు తమ తమ కార్యకలాపాలతో బిజీ గా ఉన్నారు. అయితే అంతలోనే మరో పిడుగు లాంటి వార్త ప్రజలను భయపెట్టింది. కరోనా సెకండ్ వేవ్ వస్తోంది అని కొన్ని సూచనలు ప్రముఖ ఆరోగ్య నిపుణులు మరియు ప్రభుత్వాలు ముందస్తుగా ప్రకటించాయి. కానీ ఈ సారి కూడా ప్రజలు పెద్దగా ఆందోళన చెందకుండా విరివిగా ఉన్నారు. దాని ఫలితంగా గడిచిన నెల రోజుల నుండి మళ్ళీ దేశమంతా కరోనా కేసులతో ఇబ్బందులు పడుతున్నారు.

రోజుకి వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో మళ్ళీ ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా ప్రయత్నాలు మొదలెట్టాయి. ఇప్పటికే మహారాష్ట్ర లాక్ డౌన్ ప్రకటించగా. ఈ రోజు ఢిల్లీ రేపటి నుండి లాక్ డౌన్ ప్రకటించింది. ఇది ఇలా ఉంటే మరో వైపు దేశమంతా వ్యాక్సినేషన్ ప్రజలందరికీ ఇస్తూ ఉన్నారు. మొదటగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి వ్యాక్సిన్ ఇవ్వగా, ఇప్పుడు 45 సంవత్సరాల పైబడి ఉన్న వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి కొన్ని కీలకమైన ఉత్తర్వులను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. లాక్ డౌన్ కొనసాగుతున్న రాష్ట్రాలలో ఉన్న ప్రజలు ఆయా సమయాలలో వ్యాక్సినేషన్ సెంటర్ కి వెళ్ళడానికి అనుమతులిచ్చింది.

కొన్ని రాష్ట్రాలలో పగలు లాక్ డౌన్ ఉంది..మరి కొన్ని రాష్ట్రాలలో రాత్రి లాక్ డౌన్ ఉంది. వ్యాక్సినేషన్ కోసం వెళ్లే ప్రజలపై కేసులు పెట్టకుండా ఉండాలని ఆదేశాలిచ్చింది. అంతే కాకుండా వ్యాక్సినేషన్ కోసం వెళ్లేవారికి మార్గ మధ్యంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చేయాలనీ...అలాగే వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కూడా వారు క్షేమంగా ఇంటికి చేరే విధంగా చూడాలని ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. పరిస్థితులు మన చేయి దాటుతున్న తరుణంలో ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకుంటూ సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని ఈ గైడ్ లైన్స్ లో అన్ని రాష్ట్రాలకూ తెలిపింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో 10, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

ఏపీ సర్కార్ ఉద్యోగుల విషయంలో తప్పులు చేసిందా...?

మెగాస్టార్ మరో కథ విన్నాడట...?

తిరుప‌తిలో బీజేపీకి ప‌డే ఓట్లెన్ని .. బెట్టింగులే బెట్టింగులు...!

ఇండస్ట్రీకి పరిచయమవుతున్న మరో వారసుడు...?

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వచ్చిందా...? దానికి కారణం ఏంటీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>