Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan4b2a9f0f-bcbe-47be-9514-ca51bda94578-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan4b2a9f0f-bcbe-47be-9514-ca51bda94578-415x250-IndiaHerald.jpg క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ అంటే అంచనాలే భారీగా ఉంటాయి. ఇప్పటికే రంగస్థలం సినిమాతో వీరిద్దరూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందట. అది కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో తెరకెక్కిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం పుష్ప పూర్తవగానే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందట. ఈ విషయంపై సుకుమార్ స్వయంగా ..ram charan;ram charan teja;kumaar;allu arjun;jr ntr;pawan kalyan;ram pothineni;rashmika mandanna;rajamouli;shankar;sukumar;india;korea, south;alluri sitarama raju;rrr movie;cinema;blockbuster hit;director;hero;seetharamaraju;arjun 1;alluri seetha rama raju;seetharama raju;masala;massమళ్లీ చెర్రీతోనే సుక్కు.. పుష్ప అయిపోగానే..!మళ్లీ చెర్రీతోనే సుక్కు.. పుష్ప అయిపోగానే..!ram charan;ram charan teja;kumaar;allu arjun;jr ntr;pawan kalyan;ram pothineni;rashmika mandanna;rajamouli;shankar;sukumar;india;korea, south;alluri sitarama raju;rrr movie;cinema;blockbuster hit;director;hero;seetharamaraju;arjun 1;alluri seetha rama raju;seetharama raju;masala;massMon, 19 Apr 2021 13:48:41 GMTఇంటర్నెట్ డెస్క్: క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ అంటే అంచనాలే భారీగా ఉంటాయి. ఇప్పటికే రంగస్థలం సినిమాతో వీరిద్దరూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందట. అది కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో తెరకెక్కిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం పుష్ప పూర్తవగానే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందట. ఈ విషయంపై సుకుమార్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. మరో విశేషం ఏంటంటే ఆ సినిమా కూడా ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఉండబోతోందట. ఇప్పటికే చెర్రీకి కథ చెప్పి, ఒప్పించినట్లు కూడా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో చేస్తున్నాడు. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతోంది. ఈ చిత్రం తరువాత సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్‌తో చెర్రీ మూవీ కమిట్ అయ్యాడు. శంకర్-చెర్రీ కాంబోలో వచ్చే సినిమా సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కబోతోంది. ఇది కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో ఉంటుంది. మరి ఈ మూవీ పూర్తయిన తర్వాత చెర్రీ-సుకుమార్ సినిమా ప్రారంభమవుతుందా..? లేక రెండూ ఒకేసారి ప్రారంభిస్తారా..? అనే విషయంపై క్లారిటీ లేదు.

ఇదిలా ఉంటే సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రీసెంట్‌గా పుష్ప మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ని అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అల్లు అర్జున్ పవర్ ఫుల్ యాక్షన్ ఎలివేషన్ చూపించారు. ఈ టీజర్ తో సినిమా పక్కా మాస్ మసాలా మూవీగా ఉండబోతుందనే విషయాన్ని సుకుమార్ చెప్పేశాడు. ఇక సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన నటిస్తూ ఉండగా బన్నీకి ప్రతినాయకుడుగా మలయాళీ స్టార్ హీరో ఫాహద్ ఫైజల్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వచ్చిందా...? దానికి కారణం ఏంటీ...?

పవన్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ పూజలు ..! ఎక్కడో తెలుసా..?

అతనికి ఇద్దరు భార్యలు.. చివరికి సైకోగా మారి ఏం చేసాడో తెలుసా..?

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రైజా విల్సన్ ఫేస్ ఇలా అయింది ఏంటి..?

వినాయక్ బాటలో బోయపాటి...?

మేయ‌ర్ అభ్య‌ర్థిగా మంత్రి స‌తీమ‌ణి..? అధిష్టానం ఓకే చెబుతుందా

కరోనా కట్టడికి ఆర్మీ కావాలంటున్న సీఎం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>