PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-students6effddb4-7b09-48b4-aae8-458b12bf3dd5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-students6effddb4-7b09-48b4-aae8-458b12bf3dd5-415x250-IndiaHerald.jpg సీఎం జగన్ పదిలక్షల మంది విద్యార్థులకు గుడ్ న్యూస్ చెబుతున్నారు. జగనన్న విద్యాదీవెన కింద ప్రస్తుత విద్యా సంవత్సరం లో తొలి త్రైమాసికం బోధనా రుసుముల్ని ఇవాళ అందజేయబోతున్నారు. విద్యాదీవెనకు సంబంధించి రూ.671.45 కోట్లు విడుదలకు సాంఘిక, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు పాలనా అనుమతులు ఇప్పటికే జారీ చేశాయి. బీసీ సంక్షేమశాఖ రూ.491.42 కోట్లు, సాంఘిక సంక్షేమశాఖ రూ.119.25 కోట్లు, గిరిజన సంక్షేమశాఖ రూ.19.10 కోట్లు, మైనార్టీ సంక్షేమశాఖ రూ.41.68 కోట్ల విడుదలకు ఇప్పటికే ఆమోదం తెలిపాయి. తాడేపల్లిలోని క్యాంపు కారjagan-students;suma;suma kanakala;jagan;backward classes;degree;good news;good newwzపది లక్షలమంది విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్..?పది లక్షలమంది విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్..?jagan-students;suma;suma kanakala;jagan;backward classes;degree;good news;good newwzMon, 19 Apr 2021 08:00:00 GMT
సీఎం జగన్ పదిలక్షల మంది విద్యార్థులకు గుడ్ న్యూస్ చెబుతున్నారు. జగనన్న విద్యాదీవెన కింద ప్రస్తుత విద్యా సంవత్సరం లో తొలి త్రైమాసికం బోధనా రుసుముల్ని ఇవాళ అందజేయబోతున్నారు. విద్యాదీవెనకు సంబంధించి రూ.671.45 కోట్లు విడుదలకు సాంఘిక, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు పాలనా అనుమతులు  ఇప్పటికే జారీ చేశాయి. బీసీ సంక్షేమశాఖ రూ.491.42 కోట్లు, సాంఘిక సంక్షేమశాఖ రూ.119.25 కోట్లు, గిరిజన సంక్షేమశాఖ రూ.19.10 కోట్లు, మైనార్టీ సంక్షేమశాఖ రూ.41.68 కోట్ల విడుదలకు ఇప్పటికే ఆమోదం తెలిపాయి.


తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్‌ ఆన్‌లైన్‌ ద్వారా రూ.671.45 కోట్లను విడుదల చేయబోతున్నారు. దీని ద్వారా 10,88,439 మంది విద్యార్థులకు డబ్బు చేరుతుంది.  జగన్ సర్కారు తొలిసారిగా బోధనా రుసుముల్ని కళాశాలల యాజమాన్యాలకు బదులుగా విద్యార్థుల తల్లుల అకౌంట్లలో వేస్తోంది. గతంలో నేరుగా కాలేజీలకు డబ్బు పంపేవారు.. కానీ ఇప్పడు తల్లుల ఖాతాల్లో వేయడం వల్ల ఫీజులు చెల్లించేందుకు తల్లిదండ్రులు ఏటా నాలుగు సార్లు కళాశాలకు వెళ్తారని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా కళాశాలల్లో  సదుపాయాలు, బోధనా పద్ధతుల్ని పరిశీలించి యాజమాన్యాన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.


అందుకే ఇకపై జగనన్న విద్యాదీవెన ద్వారా ప్రభుత్వం ఏటా నాలుగు విడతల్లో బోధనా రుసుముల్ని విడుదల చేయనుంది. దీంతో పాటు ఈనెల 28న వసతిదీవెన తొలివిడత సాయం అందజేయబోతున్నారు. ఈ వసతిదీవెన ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ వారికి రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు చదివే వారికి రూ.20 వేలు వసతి, ఆహార ఖర్చుల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే.  బోధనారుసుములు, ఉపకార వేతనాల బకాయిలు రూ.1,880 కోట్లు ఉండగా.. ప్రభుత్వం గత విద్యాసంవత్సరంలో విడుదల చేసింది. ఇప్పటివరకూ మొత్తం రూ.4,879.30 కోట్ల బోధన రుసుములు, ఉపకారవేతనాల్ని జగన్ ప్రభుత్వం విడుదల చేసింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అతనితో బాక్సింగ్ ఎకాడమీ పెట్టిస్తా : ఆనంద్ మహీంద్ర

విజయ్ సేతుపతి తన భార్యను మొదటి సారిగా ఎక్కడ చూశాడో తెలుసా..!

క‌రోనా క‌ట్ట‌డికి వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ డెసిష‌న్‌

జ‌గ‌న్‌తో ష‌ర్మిల‌కు యుద్ధం త‌ప్ప‌దా... వాళ్లు భ‌లే ఇరికించేశారే ?

స్టార్ హీరోలను కన్ఫ్యూజ్ చేస్తూ.. గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎన్టీఆర్..!

తిరుపతి ఫలితంపై సంచలన సర్వే.. పార్టీలవారీగా ఓట్లు, మెజారిటీ ఇవిగో..?

నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఫలితంపై సంచలన సర్వే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>