MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/atharva-murali-son-entry51a3b461-d0e9-4609-b633-e09af239598c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/atharva-murali-son-entry51a3b461-d0e9-4609-b633-e09af239598c-415x250-IndiaHerald.jpgసినీ పరిశ్రమలోకి స్టార్స్ వారసులు రావడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయమే. అదే ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీకి మరో సెలబ్రిటీ వారసుడు హీరోగా పరిచయం కానున్నాడు. ఆ కాబోయే కథానాయకుడి పేరు ఆకాష్ మురళి. దివంగత తమిళ నటుడు మురళి రెండవ కుమారుడే ఈ ఆకాష్ మురళి. మొదటి కొడుకు అధర్వ మురళి కాగా ఆకాష్ చిన్నవాడు. అథర్వ తెలుగు ప్రేక్షకులకు పరిచయస్తుడే. ATHARVA MURALI SON ENTRY;adharva;akash;anjali;murali;nayantara;vishnu;cinema;kollywood;tamil;cbi;audience;director;chitramఇండస్ట్రీకి పరిచయమవుతున్న మరో వారసుడు...?ఇండస్ట్రీకి పరిచయమవుతున్న మరో వారసుడు...?ATHARVA MURALI SON ENTRY;adharva;akash;anjali;murali;nayantara;vishnu;cinema;kollywood;tamil;cbi;audience;director;chitramMon, 19 Apr 2021 14:30:00 GMTసినీ పరిశ్రమలోకి స్టార్స్ వారసులు రావడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయమే. అదే ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీకి మరో సెలబ్రిటీ వారసుడు హీరోగా పరిచయం కానున్నాడు. ఆ కాబోయే కథానాయకుడి పేరు ఆకాష్ మురళి. దివంగత తమిళ నటుడు మురళి రెండవ కుమారుడే ఈ ఆకాష్ మురళి. మొదటి కొడుకు అధర్వ మురళి కాగా ఆకాష్ చిన్నవాడు. అథర్వ తెలుగు ప్రేక్షకులకు పరిచయస్తుడే. వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘గద్దలకొండ గణేష్‌’ లో ముఖ్య పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అధర్వ మురళి. ఈ సినిమాలో తన నటనతో తెలుగు ఆడియన్స్ ని మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అదే విధంగా నయనతార ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న అంజలి సిబిఐ చిత్రంలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు అధర్వ.  అటు తమిళ చిత్రాలలోనూ బిజీగా ఉంటూనే పలు తెలుగు ప్రాజెక్టులలో ప్రత్యేక పాత్రలకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పుడు ఇతని సోదరుడు ఆకాశ్ మురళి కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు. విజయ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మాస్టర్‌ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని నిర్మించిన ఎక్స్‌ బి ఫిలిమ్స్‌ క్రియేటర్స్‌ సంస్థ తాజాగా నిర్మిస్తున్న చిత్రం ద్వారా ఆకాష్ మురళి  ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాకి విష్ణు వర్ధన్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు.

చాలా కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన డైరెక్టర్ విష్ణువర్ధన్ ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ కెమెరాని పట్టుకోపోతుండడం విశేషం. ఈ విషయాన్ని ప్రకటించిన చిత్ర బృందం.. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్లు తెలిపింది. అయితే ఎంతో మంది వారసులు సినిమా రంగంలోకి అడుగు పెడుతున్న వేళ ఆకాష్ మురళి ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో తెలియాల్సి ఉంది. మొదటి సినిమాతోనే పెద్ద దర్శకుడి చేతిలో పడ్డాడంటే అదృష్టం బాగుందని చెప్పాలి. మరి ఏమి జరగనుందో తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడక తప్పదంటున్నాయి తమిళ సినిమా వర్గాలు.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమిళం నేర్చుకునే పనిలో సన్నీలియోన్.. కారణం అదేనా..?

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వచ్చిందా...? దానికి కారణం ఏంటీ...?

పవన్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ పూజలు ..! ఎక్కడో తెలుసా..?

అతనికి ఇద్దరు భార్యలు.. చివరికి సైకోగా మారి ఏం చేసాడో తెలుసా..?

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రైజా విల్సన్ ఫేస్ ఇలా అయింది ఏంటి..?

వినాయక్ బాటలో బోయపాటి...?

మేయ‌ర్ అభ్య‌ర్థిగా మంత్రి స‌తీమ‌ణి..? అధిష్టానం ఓకే చెబుతుందా



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>