PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagane58259d1-6eea-4f34-8c98-1fffa3df7198-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagane58259d1-6eea-4f34-8c98-1fffa3df7198-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో ఎపుడు ఏం జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు. రాజకీయం అంటే అదే అని కూడా అంటారు. నిన్నటి మిత్రుడు రేపటి శత్రువు అని కూడా నానుడి ఉంది. ఇవన్నీ పక్కన పెడితే అధికారం, కుర్చీల చుట్టూనే ఎపుడూ బంధాలు సాగుతూ ఉంటాయి. jagan;view;modi;mamata benerjee;venkatesh;kcr;kishore;mithra;prasanth;tara;bharatiya janata party;kartha;jagan;andhra pradesh;west bengal - kolkata;2019;central government;yuva;prashant kishor;party;shatru1మమత టీమ్ లో జగన్...?మమత టీమ్ లో జగన్...?jagan;view;modi;mamata benerjee;venkatesh;kcr;kishore;mithra;prasanth;tara;bharatiya janata party;kartha;jagan;andhra pradesh;west bengal - kolkata;2019;central government;yuva;prashant kishor;party;shatru1Mon, 19 Apr 2021 21:00:00 GMTరాజకీయాల్లో ఎపుడు ఏం జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు. రాజకీయం అంటే అదే అని కూడా అంటారు. నిన్నటి మిత్రుడు రేపటి శత్రువు అని కూడా నానుడి ఉంది. ఇవన్నీ పక్కన పెడితే అధికారం, కుర్చీల చుట్టూనే ఎపుడూ బంధాలు సాగుతూ ఉంటాయి.

అవి శాశ్వతం అని ఎవరూ అనుకోరు కూడా. ఇక ఏపీలో జగన్ రెండేళ్ళ సీఎం గా అనుభవం గడించారు. ఆయన ప్రవేశపెట్టిన కొన్ని పధకాల కారణంగా జాతీయ స్థాయిలో పేరు బాగానే సంపాదించుకున్నారు. ఇక 2019 ఎన్నికల వేళ  జగన్ సాధించిన అసాధారణ విజయం కూడా జాతీయ స్థాయిలో ఆయనకు పేరు తెచ్చిపెట్టింది.  దానికి తోడు  యువ నేతగా ఉండడం. ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘంగా కొనసాగేలా ప్లాన్ వేసుకుంటూ ముందుకు సాగడంతో జగన్ మీద జాతీయ నాయకుల చూపు ఉంది.

ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా అందరి ఆలోచనలూ  మే 2 మీదనే ఉన్నాయి. మే 2న అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ దూకుడు చేస్తోంది. కానీ ఆ పార్టీ గెలిచే అవకాశాలు పెద్దగా లేవు అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.  కేవలం అసోం లో మాత్రమే బీజేపీకి ఆశావహ వాతావరణం ఉందని అంటున్నారు. అయితే అక్కడ కూడా టఫ్ ఫైట్ నడిచింది అని కూడా చెబుతున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ ని కైవశం చేసుకోవాలని బీజేపీ గట్టిగానే చూస్తోంది. ఇక్కడే దేశమంతా దృష్టి పెట్టింది. ఇక్కడ నుంచి మమత మూడవసారి కనుక గెలిస్తే మాత్రం దేశ రాజకీయాలు ఒక్కసారిగా మారుతాయి అంటున్నారు. మమత ఇప్పటికే దేశంలో మూడవ ఫ్రంట్ దిశగా ఆలోచనలు చేస్తున్నారు. ఈ మధ్యనే ఆమె దేశంలోని విపక్ష ముఖ్యమంత్రులతో పాతు, విపక్ష నేతలకు లేఖలు కూడా రాశారు. మోడీ సర్కార్ ని అంతా కలసి ఎదుర్కోవాలని కూడా ఆమె అందులో పేర్కొన్నారు. ఇక ఏపీలో జగన్ తెలంగాణాలో కేసీయార్ లకు కూడా మమత లేఖలు రాశారు.

బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తున్న కేసీయార్ మమతకు మద్దతు ప్రకటించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అదే సమయంలో ఏపీలో జగన్ ఏం చేస్తారు అన్న దాని మీదనే అందరి చూపూ ఉంది. ఇక్కడ మమతకు, జగన్ కి అనుసంధానంగా రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ ఉన్నారని అంటున్నారు. ఆయన 2019 ఎన్నికల్లో జగన్ని గెలిపించారు. ఆయనే ఇపుడు మమత పార్టీకి కూడా గెలుపు వ్యూహాలను రచిస్తున్నారు. మరో వైపు చూస్తే మమత కనుక హ్యాట్రిక్ విక్టరీ సాధిస్తే కనుక దేశంలోని ప్రాంతీయ పార్టీలకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది అంటున్నారు. ఆ విధంగా చూస్తే వెంటనే కాకపోయినా రానున్న రోజుల్లో అయినా మమతకు మద్దతు ఇస్తూ ఆమె టీమ్ లో చేరే వారు పెరుగుతారు అంటున్నారు. మరి జగన్ కూడా మమత టీమ్ లో చేరుతారా అన్నది ఒక చర్చగా ఉంది. ఏపీలో బీజేపీ దూకుడు కానీ కేంద్రంలో మోడీ సహాయ నిరాకరణ కానీ జగన్ని ఆ వైపుగా నడిపించినా నడిపించవచ్చు అన్న మాట అయితే ఉంది.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దారుణం: ఇద్దరు భార్యలపై శాడిస్టు భర్త హత్యాయత్నం..!

పుష్ప పాన్ ఇండియా మూవీ కాదా..?

వైష్ణవ్ ని నెలబెట్టినట్టు అఖిల్ ని మైత్రి వారు నిలబెడతారా?

షర్మిల మొదటి వ్యూహం సక్సెస్.. ఇక తర్వాత ఏంటో..?

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>