HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/covid-vaction-1edc0845-3e34-4617-a215-b16d2a8a7c28-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/covid-vaction-1edc0845-3e34-4617-a215-b16d2a8a7c28-415x250-IndiaHerald.jpgచట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగానే, ఒకవైపు కరోనా కూడా తన పని తాను చేసుకుపోతూ వుంటే, మరోవైపు దీని బారినపడకుండా ఉండేందుకు చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడం మొదలు పెట్టారు. రెండో దశ వ్యాక్సినేషన్ లో భాగంగా 60 సంవత్సరాలు పైబడిన వారితో పాటు 45 సంవత్సరాలు దాటిన వారికి, కూడా వ్యాక్సిన్ ఇస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఇందులో చాలామందికి ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో..ఏమో అన్న భయంతో ఇక వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు.. ఇక మరి కొంతమందేమో అసలు వ్యాక్సCOVID VACTION;apple;vitamin c;vitamin;turmeric;cholesterol;spinach;shaktiకరోనా వ్యాక్సిన్ కి ముందు.. ఆ తర్వాత ఏం తినాలో..? ఏం తినకూడదో..తెలుసా..?కరోనా వ్యాక్సిన్ కి ముందు.. ఆ తర్వాత ఏం తినాలో..? ఏం తినకూడదో..తెలుసా..?COVID VACTION;apple;vitamin c;vitamin;turmeric;cholesterol;spinach;shaktiMon, 19 Apr 2021 14:25:00 GMT
చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగానే,  ఒకవైపు కరోనా కూడా తన పని తాను చేసుకుపోతూ  వుంటే, మరోవైపు దీని బారినపడకుండా ఉండేందుకు చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడం మొదలు పెట్టారు. రెండో దశ వ్యాక్సినేషన్ లో భాగంగా 60 సంవత్సరాలు పైబడిన వారితో పాటు 45 సంవత్సరాలు దాటిన వారికి, కూడా  వ్యాక్సిన్ ఇస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఇందులో చాలామందికి ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో..ఏమో అన్న భయంతో ఇక వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు.. ఇక మరి కొంతమందేమో అసలు వ్యాక్సిన్ కి ముందు,  ఆ తర్వాత ఏవైనా ప్రత్యేక ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుందో..ఏమో.. అన్న సందేహం మరికొంతమందిలో ఉంది.

అయితే ఈ సందేహాలు ఉండడం నిజమేనని అంటున్నారు నిపుణులు. టీకా వేసుకోవడానికి ముందు, వేసుకున్న తర్వాత కొన్ని రకాల పదార్థాలు తీసుకోవడం వల్ల,  వ్యాక్సిన్ వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలను చాలావరకు తగ్గించవచ్చని అంటున్నారు.. అయితే  ఏ ఆహార పదార్థాలు తినాలో..తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

టీకా వేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన పదార్థాలు :
రోగనిరోధక శక్తిని పెంచి, అనారోగ్య సమస్యను దూరం చేసే సుగుణాలు పసుపులో అధికంగా ఉన్నాయి. దీనిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ గుణాలు నొప్పి నివారిణిగా పనిచేస్తాయి. అందుకే పసుపును కూరతో పాటు సూప్స్, సలాడ్స్, టీలో భాగం చేసుకుంటున్నారు.

పాలకూర, తోటకూర,  బ్రోకలీ, గ్రీన్ ఆపిల్ వంటి ఆకుపచ్చ కూరగాయలు,  ఆకుకూరలు,  యాంటీ ఆక్సిడెంట్లు, బీటాకెరోటిన్, విటమిన్ సి,  కె, బీ, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల వ్యాక్సిన్ వేసుకున్న భాగంలో వాపు ఇతర శారీరక నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు..

కోడి, మేక కాళ్లు, ఎముకల్ని ఉడికించడం ద్వారా తయారు చేసిన సూప్(బోన్ బ్రాత్ ) లో ట్రిప్టోఫాన్ అనే, అత్యవసర అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో సెరటోనిన్ ను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇక వ్యాక్సిన్ వల్ల ఎదురయ్యే అసౌకర్యాన్ని, మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది.. అందుకే వ్యాక్సిన్ కు ముందు ఆ తర్వాత దీన్ని తీసుకోవడం మంచిది. ఇక మంచినీళ్ళు కూడా ఎక్కువగా తాగాలి..


తీసుకోకూడని పదార్థాలు :
ప్రాసెస్డ్ ఫుడ్స్ లో ఉండే అధిక క్యాలరీలు,సాచ్యురేటెడ్ కొవ్వులు  రోగ నిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. తద్వారా టీకా వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలను తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. అలాగే చక్కెర అధికంగా ఉండే పదార్థాలు కూడా తీసుకోకూడదు. ఇక మద్యపానం చేసే వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి కొన్ని వారాల ముందు నుంచి, ఇక వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని వారాల తరువాత మధ్యపానం అలవాటును పూర్తిగా దూరం పెట్టాలి.

కాబట్టి ఇలాంటివి పాటిస్తే,  మీరు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కూడా ఎలాంటి దుష్ప్రభావాలకు లోనవ్వకుండా ఉండవచ్చు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వచ్చిందా...? దానికి కారణం ఏంటీ...?

పవన్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ పూజలు ..! ఎక్కడో తెలుసా..?

అతనికి ఇద్దరు భార్యలు.. చివరికి సైకోగా మారి ఏం చేసాడో తెలుసా..?

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రైజా విల్సన్ ఫేస్ ఇలా అయింది ఏంటి..?

వినాయక్ బాటలో బోయపాటి...?

మేయ‌ర్ అభ్య‌ర్థిగా మంత్రి స‌తీమ‌ణి..? అధిష్టానం ఓకే చెబుతుందా

కరోనా కట్టడికి ఆర్మీ కావాలంటున్న సీఎం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>