PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-jagan-tdp7b466c5f-6ef1-4c90-b1c4-b9af94a6f94c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-jagan-tdp7b466c5f-6ef1-4c90-b1c4-b9af94a6f94c-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు రుణాలపై ఎలక్ట్రిక్‌ స్కూటర్లను అందించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్‌టీపీసీ/ఈఈఎస్‌ఎల్‌ వంటి సంస్థలతో కలిసి నెడ్‌క్యాప్‌ ఒక పథకాన్ని రూపొందించినట్లు ఇంధన శాఖ చెపుతోంది. డౌన్‌ పేమెంట్‌ కట్టనవసరం లేకుండా.. నెలవారీ ఈఎంఐ రూ.2,000 నుంచి రూ.2,500 ఉండేలా మాట్లాడుతున్నారు. ఇంధన శాఖ నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు ప్రతిపాదన చేరగా.. ఆయన దీనిపై సానుకూలంగా స్పందించారు.ycp, jagan, tdp;vidya;telugu desam party;jagan;telugu;chief minister;central government;partyమేం ఒప్పందం కుదుర్చుకున్నాం.. మీరు క‌చ్చితంగా కొనాల్సిందే!!మేం ఒప్పందం కుదుర్చుకున్నాం.. మీరు క‌చ్చితంగా కొనాల్సిందే!!ycp, jagan, tdp;vidya;telugu desam party;jagan;telugu;chief minister;central government;partyMon, 19 Apr 2021 10:20:05 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు రుణాలపై ఎలక్ట్రిక్‌ స్కూటర్లను అందించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్‌టీపీసీ/ఈఈఎస్‌ఎల్‌ వంటి సంస్థలతో కలిసి నెడ్‌క్యాప్‌ ఒక పథకాన్ని రూపొందించినట్లు ఇంధన శాఖ చెపుతోంది. డౌన్‌ పేమెంట్‌ కట్టనవసరం లేకుండా.. నెలవారీ ఈఎంఐ రూ.2,000 నుంచి రూ.2,500 ఉండేలా మాట్లాడుతున్నారు.   ఇంధన శాఖ నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు ప్రతిపాదన చేరగా.. ఆయన  దీనిపై సానుకూలంగా స్పందించారు.

24 నెల‌ల నుంచి 60 నెల‌ల్లో తీర్చాలి
ఈ రుణాన్ని 24 నెలల నుంచి 60 నెలల్లో తీర్చేలా వివిధ సంస్థలతో చర్చిస్తున్నారు. బ్యాటరీ సామర్థ్యంపై వాహన ధర ఆధారపడి ఉంటుంది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 40 కి.మీ. నుంచి 100 కి.మీ. వరకు తిరిగేలా వాహనాలు అందుబాటులో ఉన్నట్లు ఇందన శాఖ తెలిపింది. తొలి దశలో లక్ష వాహనాలను సరఫరా చేయడానికి ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను కోర‌గా..ఇప్పటికే 10 సంస్థలు ముందుకొచ్చినట్లు నెడ్‌క్యాప్‌ అధికారులు వెల్ల‌డించారు. అయితే ఆస‌క్తిఉన్న ఉద్యోగులే ఈ వాహ‌నాల‌ను కొనుగోలు చేసుకోవ‌చ్చ‌ని, ఇందులో బ‌ల‌వంతం ఏమీలేద‌ని ప్ర‌భుత్వం చెపుతోంది.

ఎల‌క్ట్రిక్‌పై దృష్టి
ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగంపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసేవారికి రాయితీతోపాటు పాటు ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలను అందించనున్నారు. వాహనాలకు చార్జింగ్‌ కోసం వినియోగించే విద్యుత్‌ యూనిట్‌ ధరను రూ.6.70గా నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలో 80 చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయగా.. కొత్తగా మరో 73 ప్రాంతాల్లో 400 చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో ఎల‌క్ట్రిక్ కార్ల వినియోగాన్నిపెంచ‌డంపై జ‌గ‌న్ స‌ర్కార్ దృష్టిసారించింది. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై ఎన్న‌డూలేని ప్రేమ‌ను ఒల‌క‌బోస్తున్న ప్ర‌భుత్వం ఇప్పుడు ప్ర‌త్యేకంగా ఈ స్కూట‌ర్ల వినియోగాన్ని పెంచ‌డంలోని లోగుట్టు ఏమిట‌ని తెలుగుదేశం పార్టీ ప్ర‌శ్నిస్తోంది. ఐచ్ఛిక‌మ‌ని చెబుతున్నా ఇక్క‌డ ప‌రిస్థితి గ‌మ‌నిస్తుంటే క‌చ్చితంగా కొనితీరాల్సిందే!! అనీరీతిలో ప్ర‌భుత్వ వైఖ‌రి ఉందోంటూ మండిప‌డుతోంది.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విజయమ్మ పై మహిళా కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

సినిమా టైటిల్ గా పాపులర్ డైలాగ్ ఇంతకీ మూవీ పేరేంటో తెలుసా..?

అక్కడ మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు.. ఇజ్రాయిల్ కీలక నిర్ణయం..?

"ఢీ" సీక్వెల్ ఉన్నట్టా ...? లేనట్టా...?

షర్మిల దెబ్బకి బీజేపీ అలెర్ట్

విజయ్ సేతుపతి తన భార్యను మొదటి సారిగా ఎక్కడ చూశాడో తెలుసా..!

క‌రోనా క‌ట్ట‌డికి వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ డెసిష‌న్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>