PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/padma-rajan3de3a188-79c7-4d16-9bc9-6d1ec35cf66c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/padma-rajan3de3a188-79c7-4d16-9bc9-6d1ec35cf66c-415x250-IndiaHerald.jpgదేశంలో ఏ ఎన్నికలు జరిగినా మొదటి వ్యక్తిగా నామినేషన్‌ వేసే పద్మరాజన్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కించుకున్నారు. గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించడమే తన లక్ష్యమని ఈసందర్భంగా పద్మరాజన్‌ తెలిపడం జరిగింది. తమిళనాడులోని సేలం జిల్లా మేట్టూరు సమీపంలోని ఎరటై పులియ మరత్తూరుకు చెందిన పద్మరాజన్‌(62).1988 నుంచి ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎలాంటి ఎన్నికలు జరిగినా మొదటి నామినేషన్‌ వేస్తున్నారు. రాష్ట్రంలో అయితే సహకార సంఘాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంట్, రాజ్యసభ ఎన్నికల్లో సైతం నామినేPadma rajan;kerala;delhi;india;rajya sabha;district;media;parliment;king;assembly;tamilnadu;king 1;local languageప్రతి ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న పద్మ రాజన్..ప్రతి ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న పద్మ రాజన్..Padma rajan;kerala;delhi;india;rajya sabha;district;media;parliment;king;assembly;tamilnadu;king 1;local languageMon, 19 Apr 2021 10:53:00 GMTఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కించుకున్నారు. గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించడమే తన లక్ష్యమని ఈసందర్భంగా పద్మరాజన్‌ తెలిపడం జరిగింది. తమిళనాడులోని సేలం జిల్లా  మేట్టూరు సమీపంలోని ఎరటై పులియ మరత్తూరుకు చెందిన పద్మరాజన్‌(62).1988 నుంచి ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎలాంటి ఎన్నికలు జరిగినా మొదటి నామినేషన్‌ వేస్తున్నారు. రాష్ట్రంలో అయితే సహకార సంఘాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంట్, రాజ్యసభ ఎన్నికల్లో సైతం నామినేషన్లు వేశారు. ఓ సారి రాష్ట్రపతి ఎన్నికల్లోనూ నామినేషన్‌ వేశారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచినా, రాజ్యసభ, రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేషన్లు తిరస్కరణకు గురవ్వడం జరిగింది.

ఇక పద్మ రాజన్ ప్రతి ఎన్నికల్లోనూ తన సొంత డబ్బు ఖర్చు పెట్టి డిపాజిట్‌ సొమ్ము చెల్లించి నామినేషన్లు వేస్తుంటారు. ఇప్పటి వరకు 218 సార్లు ఆయన నామినేషన్లు వేశారు. అయితే వార్డు సభ్యుడిగా కూడా ఆయన ఇంత వరకు గెలవలేదు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పళనిస్వామికి పోటీగా ఎడపాడి నియోజకవర్గంలో, కేరళ సీఎం పినరయి విజయన్‌కు పోటీగా ధర్మడం నియోజకవర్గంలో పోటీ చేశారు. ఇలా వరుస ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్న ఆయనకు తాజాగా గుర్తింపు దక్కింది. ప్రతి ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు గాను ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు ఆయన్ను గుర్తించింది. తమ బుక్‌ ఆఫ్‌ రికార్డులో ఆయనకు చోటు కల్పిస్తూ సర్టిఫికెట్‌ను పంపించడం జరిగింది. దీనిని ఆదివారం పద్మరాజన్‌ మీడియా దృష్టికి తెచ్చారు. 2021కి గాను రికార్డుల జాబితాలో ఆయనకు అత్యధిక సార్లు ఓటమి పాలైన అభ్యర్థిగా ఈ అవార్డు రావడం గమనార్హం. ఈ అవార్డు గురించి పద్మరాజన్‌ మాట్లాడుతూ గిన్నిస్‌ బుక్‌ రికార్డులో తన పేరు నమోదయ్యే వరకు ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.అప్పటిదాకా తన ప్రయత్నాన్ని ఆపనని చెప్పారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనాకు మాజీ మంత్రి బ‌లి

మేయ‌ర్ అభ్య‌ర్థిగా మంత్రి స‌తీమ‌ణి..? అధిష్టానం ఓకే చెబుతుందా

కరోనా కట్టడికి ఆర్మీ కావాలంటున్న సీఎం

సీఎం జగన్ కు ఇబ్బందిగా మారిన ఆ మంత్రులు...?

విజయమ్మ పై మహిళా కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

సినిమా టైటిల్ గా పాపులర్ డైలాగ్ ఇంతకీ మూవీ పేరేంటో తెలుసా..?

అక్కడ మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు.. ఇజ్రాయిల్ కీలక నిర్ణయం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>