PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-kcr-telanganac135d6be-b184-4d9a-a445-fc096a8a2218-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-kcr-telanganac135d6be-b184-4d9a-a445-fc096a8a2218-415x250-IndiaHerald.jpgకరోనా జాగ్రత్తలపై ఎప్పుడు విచారణ జరిగినా తెలంగాణ ప్ర‌భుత్వ తీరుపై అక్క‌డి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటోంది. మొద‌టిద‌శ‌లోను ఇదే ప‌రిస్థితి.. రెండోద‌శ‌లోను ఇదే ప‌రిస్థితి. అయినా ప్ర‌భుత్వంలో ఎటువంటి చ‌ల‌నంలేదు. చెప్పిన‌వే చెబుతుంటుంది.. వినిన‌వే విన‌మంటుంది. తాజాగా జరిగిన విచారణలోనూ హైకోర్టు అదే తరహాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జన సంచారం తగ్గించేందుకు సినిమాహాల్స్, క్లబ్‌లు, ప‌బ్‌లు, మద్యం దుకాణాల‌ వంటి వాటిపై ఆంక్షలు విధించ‌మ‌ని ఆదేశించింది. రాష్ట్రంలోకి ప్ర‌వేశించేవారికి ఆర్టీపీసీtrs, kcr, telangana;kcr;telangana;high court;kanna lakshminarayanaయే మేరా స‌ర్కార్‌.. హ‌మారా స‌ర్కార్‌.. క్యాబోల్తే?యే మేరా స‌ర్కార్‌.. హ‌మారా స‌ర్కార్‌.. క్యాబోల్తే?trs, kcr, telangana;kcr;telangana;high court;kanna lakshminarayanaMon, 19 Apr 2021 16:29:23 GMT
కరోనా జాగ్రత్తలపై ఎప్పుడు విచారణ జరిగినా తెలంగాణ ప్ర‌భుత్వ తీరుపై అక్క‌డి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటోంది. మొద‌టిద‌శ‌లోను ఇదే ప‌రిస్థితి.. రెండోద‌శ‌లోను ఇదే ప‌రిస్థితి. అయినా ప్ర‌భుత్వంలో ఎటువంటి చ‌ల‌నంలేదు. చెప్పిన‌వే చెబుతుంటుంది.. వినిన‌వే విన‌మంటుంది. తాజాగా జరిగిన విచారణలోనూ హైకోర్టు అదే తరహాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  జన సంచారం తగ్గించేందుకు సినిమాహాల్స్, క్లబ్‌లు, ప‌బ్‌లు, మద్యం దుకాణాల‌ వంటి వాటిపై ఆంక్షలు విధించ‌మ‌ని ఆదేశించింది. రాష్ట్రంలోకి ప్ర‌వేశించేవారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది. కానీ హైకోర్టు సూచ‌న‌ల‌ను కేసీఆర్ స‌ర్కార్ పెడ‌చెవిన పెడుతోంది.

పాఠ‌శాల‌లు మూశారు.. ప‌బ్బులు తెరిచారు
క‌రోనా ప‌రీక్ష‌ల విషయంలో మరికొన్ని సూచనలు కూడా హైకోర్టు చేసింది. కానీ కేసీఆర్ సర్కార్  అన్నింటినీ తేలిగ్గా తీసుకుంది. ఎలాంటి కట్టడి చర్యలు తీసుకోలేదు. ఒక్క పాఠ‌శాల‌ల‌ను మూసివేయడం మిన‌హా.. తెలంగాణలో అన్నీ యథావిధిగా న‌డుస్తున్నాయి.  దీంతో హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాల కన్నా ఆదాయమే ముఖ్యమా? అని సూటిగా ప్రశ్నించింది. ప్రభుత్వం ఇస్తున్న నివేదికలు కూడా ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయంటూ మండిపడింది. మేం ప్రత్యేకంగా ఆదేశాలేమైనా ఇవ్వాలా?  మీరే నిర్ణ‌యం తీసుకుంటారా? చెప్పాలంటూ స్ప‌ష్టం చేసింది.

ప్ర‌భుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర వ్యాఖ్య‌లు
ప్రభుత్వ నిర్లక్ష్యంపై దాఖలైన అనేక పిటిషన్లను విచారిస్తున్న సమయంలో హైకోర్టు కేసీఆర్ స‌ర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసేది. అయినా ప‌నితీరులో మార్పు రాలేదు. త‌ర్వాత కరోనా పరిస్థితి సద్దుమణిగింది. రెండో విడత ఉధృతి ప్రారంభమయ్యాక హైకోర్టులో మ‌ళ్లీ పిటిష‌న్లు ప‌డ్డాయి. వాటి విచారణలోనూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. అయినా ప్ర‌భుత్వ తీరు మార‌డంలేదు. పాలనా పరమైన వ్యవహారాల్లో హైకోర్టు జోక్యం ఏమిటని? ఏం ఆదేశాలిస్తారో ఇచ్చుకోండ‌న్న‌ట్లుగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోందంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య వైఖ‌రిపై హైకోర్టు మున్ముందు ఎలా వ్య‌వ‌హ‌రిస్తుందో చూద్దాం.!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: రేపటి నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే.. తరువాత క్లోజ్..!!

షర్మిల మొదటి వ్యూహం సక్సెస్.. ఇక తర్వాత ఏంటో..?

సాహసానికి సిద్ధంగా లేమంటున్న టాలీవుడ్ హీరోలు.. ఇలా అయితే ఎలా మరి..??

విడుదల విషయంలో కెజిఎఫ్ 2 నిర్మాతల అయోమయం

రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు...?

ఏపీ సర్కార్ ఉద్యోగుల విషయంలో తప్పులు చేసిందా...?

మెగాస్టార్ మరో కథ విన్నాడట...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>