Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trisha6a5ac7c8-e6b5-4e2c-b2ff-5052b07da07e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trisha6a5ac7c8-e6b5-4e2c-b2ff-5052b07da07e-415x250-IndiaHerald.jpgసీనియర్ సౌత్ హీరోయిన్ త్రిష త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. సుదీర్ఘమైన కెరీర్‌లో త్రిష చాలా మంది హీరోలతో డేటింగ్ చేసిందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే తమిళ నిర్మాత, యువ వ్యాపారవేత్త వరుణ్ మనియన్‌తో ..trisha;trisha krishnan;bhama;surya sivakumar;varsha;varun;varun sandesh;varun tej;india;korea, south;tollywood;cinema;tamil;marriage;producer;producer1;heroine;yuvaపెళ్లిపై త్రిష షాకింగ్ డెసిషన్.. ముహూర్తం కూడా ఫిక్స్..!పెళ్లిపై త్రిష షాకింగ్ డెసిషన్.. ముహూర్తం కూడా ఫిక్స్..!trisha;trisha krishnan;bhama;surya sivakumar;varsha;varun;varun sandesh;varun tej;india;korea, south;tollywood;cinema;tamil;marriage;producer;producer1;heroine;yuvaSun, 18 Apr 2021 20:31:00 GMTఇంటర్నెట్ డెస్క్: సీనియర్ సౌత్ హీరోయిన్ త్రిష త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. సుదీర్ఘమైన కెరీర్‌లో త్రిష చాలా మంది హీరోలతో డేటింగ్ చేసిందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే తమిళ నిర్మాత, యువ వ్యాపారవేత్త వరుణ్ మనియన్‌తో త్రిష వివాహానికి రెడీ అయింది. వీళ్లిద్దరి నిశ్చితార్థం కూడా వైభవంగా జరిగింది. ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల ఈ జంట పెళ్లిని నుంచి వైదొలిగింది. ఆ తర్వాత మళ్లీ సినిమాలపై కాన్‌సన్ట్రేషన్ చేసిన త్రిష పెళ్లి ప్రస్తావన పక్కన పెట్టింది. అయితే తాజాగా మళ్లీ ఆమె వివాహానికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. త్రిష వివాహానికి సిద్ధం అయిందట. ఈ సమ్మర్‌లోనే మూడు ముళ్లు వేయించుకోబోతుందని తెలుస్తోంది. అది కూడా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తితో కాదని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటనను త్రిష చేయబోతుందని కోలీవుడ్‌లో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. కానీ కొద్ది రోజుల క్రితం త్రిష.. తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. 'నా పెళ్లి ఎప్పుడు అనేది నాకే తెలియదు. నేను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నాను. నాకు సరైన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు నా సినిమాలు నేను చేసుకుంటాను. అదే సమయంలో నాకు కాబోయే వాడి కోసం అన్వేషిస్తుంటాను. దీనికి త్వరలోనే ముగింపు పలుకుతాను' అంటూ చెప్పుకొచ్చింది. ఇంతలోనే ఆమె వివాహానికి సంబంధించిన వార్తలు బయటకొచ్చాయి.

చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినా.. తల్లి ప్రోత్సాహంతో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది తమిళ భామ త్రిష. ఓ వైపు చదువును పూర్తి చేస్తూనే మరోవైపు అందాల ప్రపంచంలో అదరగొట్టేసింది. ఈ క్రమంలోనే ఎన్నో పోటీల్లో పాల్గొంది. ఈ సమయంలోనే మిస్ మద్రాస్‌గా ఎంపికైంది. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో 'మిస్ బ్యూటీఫుల్ స్మైల్' అవార్డును అందుకుంది. తల్లి ప్రోత్రాహంతోనే యాక్టింగ్‌లోకి కూడా అడుగుపెట్టి టీనేజ్‌లోనే 'జోడీ' అనే సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత సూర్య హీరోగా వచ్చిన 'మౌనం పెసియాదే'లో హీరోయిన్‌గా నటించింది. అనంతరం 'నీ మనసు నాకు తెలుసు' అనే ద్విభాషా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. 'వర్షం'తో మొదటి బ్రేక్‌ను అందుకుంది. ఆ సినిమా తరువాత స్టార్ హీరోయిన్ హోదా అందుకుంది. టాలీవుడ్, కోలివుడ్‌లతో పాటు సౌత్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా మారింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వాలంటే భయపడుతున్న స్టార్ హీరోలు...?

మళ్లీ ఫామ్ హౌస్ లోకి వాలిపోతున్న స్టార్ హీరోలు..

బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ 'వకీల్ సాబ్'..కారణం ఏంటో తెలుసా..??

బాలకృష్ణ సినిమాకు ఓటిటీ డీల్ మాములుగా లేదుగా.. !!

స్టార్ కమెడియన్ వివేక్ పోషించిన మరుపురాని పాత్రలు ఏంటో తెలుసా..!!

తారక్ కి జోడీగా న్యూ హీరోయిన్.. కొరటాల కొత్త ప్లాన్

ఫుల్లు కామెడీ చేసిన రోజా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>